Song no: 113
- నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా క్రుంగియున్నావు? } 2
దేవునివలన ఎన్నో మేళ్ళను అనుభవించితివే } 2
స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా } 2
ఎందుకిలా జరిగిందనీ యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని
సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే } 2
ఎందుకిలా జరిగిందనీ.....
- నా హృదయమా ఇంకెంతకాలము ఇంతగ నీవు కలవరపడుదువు? } 2
దేవునిద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే } 2
అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? } 2 || ఎందుకిలా ||
- నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా } 2
దేవుడుచేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా } 2
బ్రతుకు దినములన్నియు నీవు ఉత్సాహగానము చేయుమా } 2 || ఎందుకిలా ||