Vacche vacche thammudo yesu samy వచ్చె వచ్చె తమ్ముడో యేసు సామి

Song no: 24

    వచ్చె వచ్చె తమ్ముడో - యేసు సామి వచ్చే వేళాయె సూడరో "2"
    మేఘాల పీఠమెక్కి - మెరుపోలె నింగికి "2" {వచ్చె వచ్చె}

  1. ఆళ్ళీళ్ళని లేకుండ ఆయనొంక చూస్తరు "2"
    భూజనులేసుని చూసి రొమ్ము కొట్టుకుంటరు "2" {వచ్చె వచ్చె}

  2. రెక్కల దూతలతో సక్కగ దిగివస్తడు "2"
    టక్కరోడు సాతాను కొమ్ములిరగదీస్తడు "2" {వచ్చె వచ్చె}

  3. భూతాలే కరిగిపోయి భూమి కాలిపోవును "2"
    ఆకాశం అంతలోనే ఆవిరిగా మారును "2" {వచ్చె వచ్చె}

  4. నమ్మి బతికున్నోళ్ళు నింగికెగిరిపోతరు "2"
    నమ్మి చనిపోయినోళ్ళు లేచి బయటికొస్తరు "2" {వచ్చె వచ్చె}

Jeevamugala deva jeevinchuchunnavada జీవముగల దేవా జీవించుచున్నవాడా

Song no: 23

    జీవముగల దేవా జీవించుచున్నవాడా "2"
    జీవనరాగం జీవితగమ్యం "2"

    జీవనజ్యోతివయా యేసయ్యా - పావనమూర్తివయా "2"

  1. నను రక్షించిన నిన్ను మరువను
    నా శిక్షబాపిన నిన్ను విడువను "2"
    నిన్న నేడు మారనిదేవా - కన్నుల నిన్నే నిలుపు కొంటిని "2" {జీవనరాగం}

  2. నను మార్చిన నిను ఘనపరచెదను
    ప్రాణమిచ్చిన నిను కొనియాడెదను
    సత్యము నీవే శాంతి ప్రదాతా - నిత్యము నా హృది నీదు నివాసం "2" {జీవనరాగం}

Throvalo neevuntivo throvapakka padiyuntivo త్రోవలో నీవుంటివో త్రోవప్రక్క పడియుటింవో

Song no: 22

    త్రోవలో నీవుంటివో - త్రోవప్రక్క పడియుటింవో "2"
    త్రోవ చూపిన నజరేయుని కనలేని అంధుడవైయుంటింవో "2"

    అ.ప. : జీవితపు ఈ యాత్రలో నీ పరిస్థితి తెలుసుకో
    జీవమార్గం క్రీస్తులో నిన్ను నీవు నిలుపుకో {త్రోవలో}

  1. చెరిపివేసుకున్నావు నీదు మార్గమును
    చెదిరి ఎన్నుకున్నావు స్వంత మార్గమును "2"
    పాపపు అంధకారంతో మార్గం కనరాకయుంటివే
    చీటికి దారిన పయనంతో మరణం కొనితెచ్చుకుటింవే {జీవితపు}

  2. సిద్ధపరచెను యేసు నూతన మార్గమును
    బలిగ అర్పణగ చేసి శరీరరక్తమును "2"
    సత్యమైన ఆమార్గంలో జీవం క్షేమం ఉందిలే
    నిత్యుడు ఆ దేవునిచేరే ధైర్యం కలిగించిందిలే {జీవితపు}

  3. నడచి వెళ్ళుచున్నావా అరణ్యమార్గమున
    గమ్యమెరుగకున్నావా జీవనగమనమున "2"
    పర్వతములు త్రోవగ చేసి నీటియొద్దకు చేర్చులే
    త్రోవలను తిన్నగ చేసి ఆత్మదాహమును తీర్చులే {జీవితపు}

Samayamu ledhanna mari ledhanna సమయము లేదన్నా మరి లేదన్నా

Song no: 20

    సమయము లేదన్నా మరి లేదన్నా
    పోతే మరలా తిరిగి రాదన్నా "2"
    యేసన్న నేడో రేపో వచ్చెనన్నా"2"
    భూమిమీదికి దైవరాజ్యం తెచ్చేనన్నా

  1. హృదయంలో యేసుని చేర్చుకున్న
    పరలోక భాగ్యమే నీదగునన్నా "2"
    నీ పాపజీవితం విడువకయున్న "2"
    పాతాళగుండమే నీగతియన్నా
    రేపన్నది నీది కాదు నిద్ర మేలుకో
    నేడన్నది ఉండగానే దారి తెలుసుకో "2"
    చేయకాలస్యము - తెరువు నీ హృదయము "2" {సమయము}

  2. ఆకాశం పట్టజాలని దేవుడన్నా
    కన్య మరియ గర్భమందు పుట్టాడన్నా "2"
    లోక పాపమంత వీపున మోసాడన్నా
    మానవాళి శాపం రూపుమాపాడన్నా "2"
    నీ హృదయపు వాకిట నిలుచున్నాడు
    నిరంతరం ఆ తలుపు తడుతున్నాడు "2"
    చేయకాలస్యము-తెరువు నీ హృదయము "2" {సమయము}

  3. యేసయ్య రెండవ రాకకు సూచనలెన్నో
    నీ చుట్టూ జరుగుచున్నవి గమనించన్నా "2"
    గడ్డిపువ్వు లాంటిది నీ జీవితమన్నా
    ఎపుడు ముగిసి పోతుందో తెలియదన్నా "2"
    భూరధ్వనితో ఆర్భాటంతో మేఘారూఢుడై
    తీర్పుతీర్చ యేసురాజు రానున్నాడు "2"
    చేయకాలస్యము- తెరువు నీ హృదయము "2" {సమయము}

Nee needalo na brathuku gadavalani నీ నీడలో నాబ్రతుకు గడవాలని

Song no: 106

    నీ నీడలో నాబ్రతుకు గడవాలని
    నీ అడుగు జాడలలో నేనడవాలని 
    అ.ప:హృదయవాంఛను కలిగియుంటిని } "2"
    నీసహాయము కోరుకుంటిని || నీ నీడలో ||

  1. నీయందు నిలిచి ఫలించాలని
    ఈలోక ఆశలు జయించాలని "2"
    నీప్రేమ నాలో చూపించాలని "2"
    నాపొరుగువారిని ప్రేమించాలని || హృదయ ||

  2. నీసేవలోనే తరించాలని
    నీకైశ్రమలను భరించాలని "2"
    విశ్వాస పరుగు ముగించాలని "2"
    జీవకిరీటము ధరించాలని || హృదయ ||

  3. నీరూపునాలో కనిపించాలని
    నాఅహమంతా నశియించాలని "2"
    నీవార్తఇలలో ప్రకటించాలని "2"
    నీకడకు ఆత్మలనడిపించాలని || హృదయ ||


Dheshamlo maha rakshana desamlo maha dhivena దేశంలో మహా రక్షణ దేశంలో మహా దీవెన

Song no:

    దేశంలో మహా రక్షణ.... దేశంలో మహా దీవెన...
    దేశంలో గొప్ప సంపద.. దేశంలో మహా శాంతిని..."2"
    తొలగించుమయా......... నిజాదేవుడా...."2"
    కరుణించూ మయా.... మా యేసయ్యా "దేశంలో"

  1. వ్యభిచారము మధ్య పానము... ప్రతి విధమైన... వ్యసనమును...."2"
    తొలగించుమయా......... నిజాదేవుడా...."2"
    కరుణించూ మయా.... మా యేసయ్యా "దేశంలో"

  2. ఉగ్రవాదమును ప్రేమోన్మాదము....ప్రతి విధమైన అవినీతిని........"2"
    తొలగించుమయా......... నిజాదేవుడా...."2"
    కరుణించూ మయా.... మా యేసయ్యా "దేశంలో"

Maruvakura maruvakura dhevuni premanu maruvakura మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా

Song no: 21

    మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా
    విడువకురా విడువకురా ఆప్రభు సన్నిధి విడువకురా
    అ.ప. : ఆప్రేమే నిత్యమురా - ప్రభు సన్నిధి మోక్షమురా {మరువకురా}

  1. పరమును చేరే మార్గము ఇరుకని
    శ్రమలుంటాయని ఎరుగుమురా "2"
    నశించు సువర్ణము అగ్నిపరీక్షలో
    శుద్దియగుననిగమనించరా "2" {ఆప్రేమే}

  2. లోక సంద్రాములో ఎదురీదాలని
    సుడులుంటాయని ఎరుగుమురా "2"
    తీరము చేరిన మెప్పును మహిమ
    ఘనత కలుగునని గమనించరా "2" {ఆప్రేమే}

  3. విశ్వాసపరుగులో శోధానవలన
    దుఃఖముందాని ఎరుగుమురా "2"
    కడముట్టించిన నిత్యానందము
    బహుమానముందని గమనించరా "2" {ఆప్రేమే}

Yesu nee sakshiga nanu nilpinavaya యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా

Song no: 19

    యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా
    గురిలేని నాబ్రతుకు దరిచేర్చినావయా
    నీసేవచేయగా - నీసిల్వమోయగా "2" {యేసు నీ సాక్షిగా}

  1. ఎండిపోయిన గుండెలకు జీవనదివని ప్రకటింప "2"
    మంటిని మహిమకు చేర్చే వారధివని చాటింప

  2. సత్యం జీవం మార్గం నీవేయని ప్రచురింప "2"
    నిత్యం స్తుతి నొందదగిన నీనామము ప్రణుతింప "2" {యేసు నీ సాక్షిగా}

  3. నాలోనీ సిల్వప్రేమ లోకానికి చూపింప "2"
    రాకడకై కనిపెట్టుచు నీకొరకే జీవింప "2" {యేసు నీ సాక్షిగా}

Sthuthiyinchedhanu sthuthipathruda ninu స్తుతియించెదాను స్తుతిపాత్రుడ నిను

Song no: 17

    స్తుతియించెదాను స్తుతిపాత్రుడ నిను
    భజియించెదను భయభక్తితోను

    అ.ప. : వందానమయ్యా యేసయ్యా
    నీకేప్రణుతులు మెస్సీయా

  1. నీగుణగణములు పొగడనుతరమా
    నీఘనకీర్తిని పాడనావశమా "2"
    పరలోకసైన్యపు స్తుతిగానములతో "2"
    దీనుడనాస్తుతి అంగీకరించుమా "2" {వందానమయ్యా}

  2. నీఉపకారములు లెక్కింపగలనా
    నీమేలులన్నియు వర్ణింపనగునా "2"
    నాహృదిగదిలో నివసింపగోరిన నజరేయుడా నిను హెచ్చింతునయ్యా "2" {వందానమయ్యా}

  3. నీసిల్వప్రేమను వివరింపశక్యమా
    నీసన్నిధిలేక జీవింపసాధ్యమా "2"
    ఆరాధించెదఆత్మతోనిరతం నీక్షమముతో నింపుమాసతతం "2" {వందానమయ్యా}

Aakasha vasulara yehovanu sthuthiyimchudi ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ

Song no: 3

    ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
    ఉన్నత స్థలముల నివాసులారా
  1. యెహోవాను స్తుతియించుడీ...హల్లేలూయ "ఆకాశ"
    ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
    సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ "ఆకాశ"
  2. సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా
    వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ "ఆకాశ"

Aakashamandhunna asinuda ni thattu kanuletthuchunnanu ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను

Song no: 2

    ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను
    నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| 
  1. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2)
    కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| 
  2. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
    కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| 
  3. పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
    కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||

Aakaashamandunna Aaseenudaa
Nee Thattu Kanuleththuchunnaanu
Nenu Nee Thattu Kanuleththuchunnaanu ||Aakaasha||

Daari Thappina Gorrenu Nenu
Daari Kaanaka Thiruguchunnaanu (2)
Karuninchumaa Yesu Kaapaadumaa ||Nee Thattu||

Gaayapadina Gorrenu Nenu
Baagu Cheyumaa Parama Vaidyudaa (2)
Karuninchumaa Yesu Kaapaadumaa ||Nee Thattu||
Paapa Oobhilo Padiyunnaanu
Levaneththumaa Nannu Baagu Cheyumaa (2)
Karuninchumaa Yesu Kaapaadumaa ||Nee Thattu||

Dhustula alochana choppuna naduvaka దుష్టుల ఆలోచన చొప్పున నడువక

Song no: 1

  1. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములయందు నిలిచియుండక 
  2. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు || దుష్టుల ||
  3. కాలువ నీటియోర నతడు నాటబడి కాలమున ఫలించు చెట్టువలె యుండును || దుష్టుల ||
  4. ఆకు వాడని చెట్టువలె నాతడుండును ఆయన చేయునదియెల్ల సఫలమగును || దుష్టుల ||
  5. దుష్టజనులు ఆ విధముగా నుండక పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు || దుష్టుల ||
  6. న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులు నీతిమంతుల సభలో పాపులును నిలువరు || దుష్టుల ||
  7. నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును నడుపును దుష్టుల దారి నాశనమునకు || దుష్టుల ||

Yentha krupamayudavu yesayya prema chupi ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను

Song no:

    ఎంత కృపామయుడవు యేసయ్యా – ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా /2/ నలిగితివి వేసారితీవి – నలిగితివి వేసారితీవి /2/ నాకై ప్రాణము నిచ్చితివి – నాకై ప్రాణము నిచ్చితివి /2/
  1. బండ లాంటిది నాదు మొండి హృదయం- ఎండిపోయిన నాదు పాప జీవితం /2/ మార్చితివి నీ స్వాస్త్యముగ /2/ – ఇచ్చినావు మెత్తనైనా కొత్తహృదయం /2/ఎంత/
  2. వ్యాధి బాధలందు నేను క్రుంగీయుండగా – ఆదరించెను నీ వాక్యము నన్ను /2/ స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను/2/ ప్రేమతో పిలచిన నాధుడవు /2/
  3. కన్న తల్లి తండ్రులు నన్ను విడచినను – ఈ లోకము నను వెలివేసిన /2/ మరువలేదు నన్ను విడువలేదు /2/ – ప్రేమతో పిలచిన నాధుడవు /2/ ఎంత/
  4. ఆదరణ లేని నన్ను ప్రేమించితివి- అభిషేకించితివి ఆత్మలోను /2/ నిలచుటకు ఫలించుటకు /2/ – అత్మతో నను ముద్రించితివి /2/ ఎంత/

Kanti papanu kayu reppala nanu kachedi కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి

Song no:

    కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా ||కంటి||
  1. మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
  2. ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|

    kanti paapanu kaayu reppalaa nanu kaachedi yesayyaa chanti paapanu saaku ammalaa daachedi maa ayya neevegaa needagaa thodugaa neethone nenunu jeevinthu neekannaa minnaagaa evarayyaa naaku neeve chaalayyaa ||kanti||
  1. maarpuleni mathsarapadani prema choopinchinaavu deergha kaalam sahanmu choope prema nerpinchinaavu idi evaru choopinchani prema idi laabham aashinchani prema idi evaru edabaapani prema idi maranam varaku karunanu choopina prema ||kanti|| 
  2.  dambamu leni haddulerugani prema kuripinchinaavu nirmalamaina nisswaardhya premanu maapai kuripinchinaavu idi evaru choopinchani prema idi laabham aashinchani prema idi evaru edabaapani prema idi maranam varaku karunanu choopina prema ||kanti||

Aaha nakemanandhamu sriyesu nache battuchu ఆహా నాకేమానందము శ్రీ యేసు నాచేఁ బట్టుచు

Song no: 431

    ఆహా నాకేమానందము శ్రీ యేసు నాచేఁ బట్టుచు సహాయుఁడై నాయన్నిటన్ సజీవుఁడై నడుపును. ||నా దారిఁ జూపును యేసు నా చేఁబట్టి నడుపును ఎన్నఁడు నెడబాయఁడు యేసె నా దారిఁ జూఁపును ||
  1. యేదే స్సుఖంబు లైనన్ సదా విచార మైనను బాధాంధకార మైనను ముదంబుతోడ నుందును.
  2. చింతేల నాకు నీ దయన్ సంతత మీవు తోడుగాన్ బంతంబు నీచేఁ బట్టుచు సంతృప్తితో నే నుందును.
  3. నా చావు వేళ వచ్చినన్ విచార మొందక ధృతిన్ నీ చేయి బట్టి యేసుఁడా నీ చారు మోక్ష మెక్కుదున్

Aashirvashamu niyama ma paramajanaka ఆశీర్వాదము నీయుమ మా పరమజనక

Song no: 555

    ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశీర్వాదము నీయుమ ఆశలుదీరంగ నాయు వొసంగుచు వాసిగ కరుణను వర్ధిల్ల బిడ్డకు ||ఆశీర్వాదము||
  1. యేసు పెరిగిన యట్టులే నీ దయయందు ఈసు బిడ్డను పెంచుము వాసిగ మనుజుల కరుణయందున బెరుగ భాసుర వరమిచ్చి బాగుగ బెంచుము ||ఆశీర్వాదము||
  2. నెనరు మీరగ మోషేను నెమ్మదియందు తనర బెంచినట్లుగ ఘనముగ నీ శాంతి సంతసములయందు తనర నీ బిడ్డను తగురీతి బెంచుము ||ఆశీర్వాదము||
  3. ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగ బెంచితివో యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు కోరి బెంచుము ప్రభువ కోర్కెలూరగ వేగ ||ఆశీర్వాదము||
  4. సత్య విశ్వాసమునందు చక్కగ బెరుగ శక్తి యొసంగినడ్పుమా సత్య వాక్యమునందు సరగను వర్ధిల్ల నిత్యము నీ కృప నిచ్చి బ్రోవుమ ప్రభువ ||ఆశీర్వాదము||
  5. భక్తి ప్రేమల నీ బిడ్డ బాగుగా బెరుగ శక్తినీయ మా ప్రభువ ముక్తి పథంబున ముద్దుగ నడువంగ యుక్తజ్ఞానము నిచ్చి యుద్ధరించుమ ప్రభువ ||ఆశీర్వాదము||

Aalinchu ma prardhana ma rakshaka yalinchu ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు

Song no: 587

    ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు వని నమ్మి యాసక్తి వేఁడెదము మేలైన దీవెనలు మెండుగాఁ గురిపించి ||యాలించు||
  1. ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ సేవకై మేము నెనరుచే నొసఁగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు ||డాలించు||
  2. ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే పొందుగ నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ బృందంబుతో నింపి ||యాలించు||
  3. ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ జెచ్చెర రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే ||నాలించు||
  4. నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి వారల కిచ్చి ||యాలించు||
  5. చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు తెలిపించి ||యాలించు||

Aanandhamanandha mayenu nadhu priyakumaruni ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని

Song no: 628

    ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు ||మహదానం||
  1. ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు అందుచే నీ తోటి వారికంటె ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం||
  2. అంత్యదినముల యందున ఆ వింతకుమారునిద్వారా ఈ మానవులతోడ మాట్లాడెను సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||మహదానం||
  3. తనయుండె ఆ తండ్రి మహమ ఆ తత్వంబు రూపంబు తానె ఆ మహాత్యమైనట్టి మాటలచేత సమస్తమును నిర్వహించు అందరిలో అతి శ్రేష్ఠుండాయే ||మహదానం||
  4. నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి ||మహదానం||
  5. విజ్ఞాన సంపద లెల్లను ఆ సుజ్జానిలో గుప్తమాయెను ఆ సంతోసహమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను ||మహదానం||
  6. అందరికన్న నీవెంతనో అతి సుందరుడవై యున్నావు నీవు నీ పెదవుల మీద పోయబడి నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించును తండ్రి ||మహదానం||
  7. దివ్యరారాజై కుమారుడు ఒక వెయ్యివర్షాలు పాలించును మహా అంతములేని రాజ్యమేలును యెందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు ||మహదానం||

Aalinchu deva na manavula nalimchu ఆలించు దేవా నా మనవుల నాలించు

Song no: 375

    ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ ||ఆలించు||
  1. సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు నెల్లప్పుడు ||నాలించు||
  2. పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి కాసంతైన ||నాలించు||
  3. నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ సుతుని కృతమున ||నాలించు||
  4. నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ డించు మనిశంబు ||నాలించు||
  5. నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను కృపచే ||నాలించు||

Aanandha magu mukthi ye na mandhiramu ఆనంద మగు ముక్తి యే నా మందిరము

Song no: 347

    ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు దాని సుందరము ||ఆనందమగు||
  1. పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ డి పరితృప్తి నుండు ||నానంద మగు||
  2. బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల నమృతుఁడ నెపుడు ||నానంద మగు||
  3. ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి భువి యందె గాంతు ||నానంద మగు||

Anamdham anandham dhinadhinam anandham ఆనందం ఆనందం దినదినం ఆనందం

Song no: 630

    ఆనందం ఆనందం దినదినం ఆనందం యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను(2)
  1. తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు దూరంపోయిన కనుగొన్నాడు(2) తన ప్రాణమును నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను ||ఆ..ఆనందమే||
  2. ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు వచ్చువరకు కాచుకొందును ||ఆ..ఆనందమే||
  3. ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆ..ఆనందమే||

Aadharimpumu yesuva ni nna srayimchithi ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి

Song no: 321

    ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్ ||ఆద||
  1. నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా
  2. సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు లొసగుము నీతి నిధుల సజీవుడా ||ఆద||
  3. ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి నా ప ద్బాంధవ విడిపించుమా ||ఆద||
  4. పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా మొరను గైకొని కలుషముల నెడబాపవే ||ఆద||
  5. పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా ||

Aathma nadupu sa thyamu loni kipude ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే

Song no: 239

    ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా||
  1. ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా||
  2. అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా||
  3. నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా||
  4. సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా||
  5. దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా||

Aathma srumgarinchu kommu papa gruha veedi pommu ఆత్మ! శృంగారించు కొమ్ము పాప గుహ వీడి పొమ్ము

Song no: 625

    ఆత్మ! శృంగారించు కొమ్ము పాప గుహ వీడి పొమ్ము వెల్గులోని కింకరమ్ము తేజరిల్లు మీ దినము "రక్షణాధి కారవిందు నీకు జేయ బోవుముందు భూదినంబు లేలు ఱేడు నిన్ను జేర వచ్చు నేడు"
  1. పెండ్లి కూతురెట్లు భర్త నట్లు ప్రేమ జూపుకర్త నాయ నెంతో జాలిగుండె తోడ దల్పు దట్టు చుండె "నా ప్రియుండ! వేగరమ్ము ముద్దు బెట్ట నిమ్ము నన్ను" అందు హృదయంబుతోడ యేసునాద నాహ్వానించు.
  2. శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు జేయ గొండ్రు బల్ధనంబు సర్వ శ్రేష్ఠమౌ వరంబు లిచ్చు చుంటి యుచితంబు కాకయున్న నీ శరీర రక్తముల్గొనంగ నీర రాసులైన గనులైన జాలునా మరేవియైన?
  3. నిశ్చలంపు బ్రేమ నిన్ను చీల్చి భూమికంటె నన్ను మాకునైత్వదీయ ప్రాణ మిచ్చినాడ వట్లు గాన ఆమేన్. చిందబడ్డ నీ శరీర రక్త బిందు లింపుమీర రాత్రి భోజనాన మాక నంత ప్రేమ పెంచుగాక
  4. యేసు! జీవ భక్తమైన నీదు బల్ల గంటినైన వ్యర్థ నష్టతల్ల భింప నీకు, దీననే నశింప భూమి మీద బోలె మింట నిన్ను గూడి త్రాగి తింటి కీసు భోజనంబు నందు నీదు ప్రేమ జూపుమందు,

Aathmalanu sampadhimpa nagu aathma balamuna ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున

Song no: 461

    ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను||
  1. ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను||
  2. క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||యాత్మలను||
  3. పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను||
  4. నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక ||నాత్మలను||
  5. జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను గడింప నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను||
  6. నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు విభుని సేవకు నీ వర్పించు ||నాత్మలను||

Aa chinna varilo nenundi yunna ఆ చిన్న వారిలో నేనుండి యున్న

Song no: 546

    ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు ||నా చిన్న||
  1. ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||నా చిన్న||
  2. ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి ||యా చిన్న||
  3. ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ లోకమందునఁ జూచి వినుచుందు ||నా చిన్న||
  4. శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్ ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య ||మా చిన్న||

aacharinchuchunnamu aa chandhamu memu ఆచరించుచునున్నాము ఆ చందము మేము

Song no: 274

    ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభు సెల విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు||
  1. నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగా గాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధ శ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది ||యాచరించు||
  2. భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖ స్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికు ల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి ||యాచరించు||
  3. పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌ నీదైవత్వచి హ్నముతోడను గూడ సరవిగా దతియను బొందె దెరగున నీబప్తి స్తోదకములయు బరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు నిన్ను ||యాచరించు||
  4. పరయానంద వదనము నీ దరికరాఁగిగోరు వీరి న్నీ పరమ కృపన్ దీవించి నీ కరుణా కటాక్షేక్షన్ స్థిరతఁ బాంచియాత్మలకు నీ మహిమ కిరణములు నెరపు మో అభువాయని నిన్ను వేడుచు ||నాచరించు||

Alasatapadda nivu dhaivokthi vinu ra అలసటపడ్డ నీవు దేవోక్తి విను రా

Song no: 410

    అలసటపడ్డ నీవు దేవోక్తి విను రా, నా యొద్ద, సు విశ్రాంతి పొందుము
  1. నేను చూచు గుర్తు లేవి, వాని కుండునా? 'ప్రక్కఁ గాలుసేతులందు గాయముల్'
  2. రాజుఁబోలి కిరీటంబు వాని కుండునా 'యుండుగాని ముండ్లచేత నల్లరి'
  3. నన్ను ఁ జేర్చుకొమ్మనంగఁ జేర్చుకొనునా? 'ఔను లోకాంతంబు దాఁక చేర్చును'
  4. వాని వెంబడింతు నేని యేమి లాభము? 'పాప దుఃఖ కష్టములు వచ్చును'
  5. చావుమట్టు కోర్తునేని ఏమి యిచ్చును? 'సంతోషంబు సౌఖ్య మింక మోక్షము'

Ayyo iedhi dhukkamu prabhu thirppuvela అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ

Song no: 230

    అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||
  1. తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||
  2. అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో||
  3. భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల ||రయ్యో||
  4. క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద ||రయ్యో||
  5. శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ ||రయ్యో||
  6. అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో||
  7. సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||

Anukarinchedha ne nanudhinamunu అనుకరించెద నే ననుదినమును

Song no: 543

    అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన బాలుఁడేసు ||ననుకరించెద||
  1. పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును జయించిన స చ్చరితుఁడైన యోసేపు ||ననుకరించెద||
  2. తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||
  3. పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద||
  4. శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద||
  5. పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||
  6. యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||
  7. అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||
  8. ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని సమాచార మిడిన రొదే ||ననుకరించెద||
  9. భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||

Aduguchunna mo dheva kdu dhayanu gava అడుగుచున్నా మో దేవ కడు దయను గావ

Song no: 269

రాగం - శంకరాభరణము 

బోధకులకొరకైన ప్రార్థన

తాళం - ఆది

    అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||
  1. వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడు గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||

  2. సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||

  3. దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||

  4. తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||

  5. మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై శోధనంబులు పొర్లి రాకుండాదరింప ||నడుగు||

  6. దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||

  7. రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని ||న్నడుగు||

  8. ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||

Andhuda rava aramarayela adugonayya అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య

Song no: 627

    అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...

  1. నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...||అ||

  2. మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ||

  3. ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||

  4. లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||

  5. పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే ||అ||

  6. హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||


Amthya dhinamandhu dhutha bura nudhu అంత్య దినమందు దూత బూర నూదు

Song no: 497

    అంత్య దినమందు దూత బూర నూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ ||నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరి యుందు నచ్చ టన్||
  1. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్.
  2. కాన యేసుసేవ ప్రత్య హంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్

Devudinaddam mosalu cheyyaboku bible peru దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు బైబిలు పేరు

Song no: 121


దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు
బైబిలు పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు
ఓ..పెద్దాన్నా... నామాట వినరన్నా
ఓ..చిన్నన్నా...ఈమాట నిజమన్నా

1. కన్నులిచ్చినవాడు కానకుండునా
అన్యాయమైన పనులు చూడకుండునా
మనుష్యుల కళ్ళు కప్పినా దేవుని నీతి ఒప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పికైనా

2. దేవుని సొమ్ము నీవు దొంగిలించినా
దైవసేవ అంటూ నీఆస్తి పెంచినా
అన్యాయపుసిరి నిలుచునా - దేవునిశిక్షతప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందాుముఇప్పటికైనా

3. స్వార్ధానికై వాక్యం కలిపి చెరిపినా
లాభానికై అనుకూలముగా మార్చినా
పరలోక తండ్రి ఓర్చునా - ఉగ్రత చూపక మానునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పటికైనా

Halleloya yani padudi samadhipai హలెలూయ యని పాడుఁడీ సమాధిపై

Song no: 217


హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును ||హలెలూయ||

హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక పారిపోయెను గలిబి లాయెను నరకము ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ||

Vijayambu vijayambu vijayambu ma yesu విజయంబు విజయంబు విజయంబు మా యేసు

Song no: 216


విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద ||విజయంబు||

విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసె ||విజయంబు||

విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము ||విజయంబు||

విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు ||విజయంబు||

విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు ||విజయంబు||

Sudhathulara mi ricchata nevvari vedhakuchunnaru సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు

Song no: 215


సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి ||సుదతులార||

ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో ||సుదతులార||

మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద మీరు వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||

ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||

Randu viswasulara randu vijayamu suchinchu రండు విశ్వాసులారా రండు విజయము సూచించు

Song no: 214


రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు నియమించె దేవుఁడు విజయం, విజయం, విజయం, విజయం ||విజయం||

నేటి సమయ మన్ని యాత్మలకును నీ టగు వసంత ఋతువగును వాటముగఁ జెరసాలను గెలిచె వరుసగ మూన్నాళ్ నిద్రించి సూటిగ లేచెన్ యేసు సూర్యుని వలెన్ ||విజయం||

కన్ను కన్నుకానని చీఁకటి కాలము క్రీస్తుని కాంతిచే నిన్నాళ్లకు శీఘ్రముగఁ బోవు చున్నది శ్రీ యేసుని కెన్నాళ్ల కాగని మన సన్నుతుల్ భువిన్ ||విజయం||

బలమగు మరణ ద్వారబంధ ములు నిన్ బట్టకపోయెను వెలుతురు లేని సమాధి గుమ్మ ములు నిన్నాపక పోయెను గెలువ వాయెను కా వలియు ముద్రయు ||విజయం||

పన్నిద్దరిలోపల నీ వేళ సన్నుతముగ నీవు నిలిచి యున్నావు మానవుల తెలివి కెన్నఁడైన నందని యౌన్నత్య శాంతిని న నుగ్రహింతువు ||విజయం||

Dhaivathanaya kresthunadhunda ayya papulakai pranamicchithiva దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా

Song no: 237
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. 1 యోహాను John 3:16

పల్లవి: దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా

1. పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా - దేవా పరలోకము తెరచినావా

2. కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము కడిగి పావన పరచినావా - దేవా కడుగు బూరతో రానై యున్నావా

3. మరణము జయించినావా మరణముల్లు విరచినావా మహిమతోడ లేచినావా - దేవా మాదు చింతలు దీర్చినావా

4. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరణికే ఏతెంచినావా - దేవా ధన్యులనుగా జేసినావా

5. ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు అల్ఫయు ఓమేగయు నీవేగా - యేసు ఆర్భటించుచు రానై యున్నావా

Siluvalo nakai sramanondhi nee prema bahuvu andhinchi సిలువలో నాకై శ్రమనొంది - నీ ప్రేమ బాహువు అందించి

Song no:

సిలువలో నాకై శ్రమనొంది - నీ ప్రేమ బాహువు అందించి
నాశనమను గోతి నుండి - నను పైకి లేపిన నా రక్షికా
వందనం వందనం - నా యేసు రాజా నీకే నా ఆరాధనా

1. మంటినైన నాకు నీరూపునిచ్చి - నీ పోలికలో మార్చావయ్యా
ఆశీర్వదించి ఆనంద పరచి - శ్రేష్టమైన ఈవులు ఇచ్చావయ్యా

2. పాపినైన నాకు నీ రక్తమిచ్చి- నీతి మంతునిగా తీర్చావయ్యా
ఆ నిత్య మహిమలో శుభప్రదమైన - నిరీక్షణ నాకు ఇచ్చావయ్యా

Yesu prabhu na korakai baliganu nivaithivi యేసు ప్రభూ నా కొరకై - బలిగాను నీవైతివి

Song no: 232

యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను John 1:7 

పల్లవి: యేసు ప్రభూ నా కొరకై - బలిగాను నీవైతివి (2)

1. సిలువలోన యేసు - నీదు ప్రాణమిచ్చితివి (2)
ప్రాణమిచ్చితివి - ప్రాణమిచ్చితివి (2)
2. సిలువ రక్తము తోడ - నన్ను జేర్చుకొంటివి
చేర్చుకొంటివి - చేర్చుకొంటివి

3. నీ వెలుగును నీవు - నాలో వెలిగించితివి
వెలిగించితివి - వెలిగించితివి

4. నీ ప్రేమను నీవు - నాలో నింపితివిగా
నింపితివిగా - నింపితివిగా

5. నా పాపము నంతటిని - నా నుండి తీసితివి
తీసితివి - తీసితివి

6. నిత్యము నే నిన్ను - స్తుతియించి కీర్తింతును
కీర్తింతును - కీర్తింతును

Manakai yesu maranimche mana papmula korakai మనకై యేసు మరణించె మన పాపముల కొరకై

Song no: 231

యెషయా Isaiah 53 

పల్లవి: మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె

1. తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను

2. మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి

3. మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె

4. గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును

5. దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్

6. ఎదిరింప లేదెవరిన్ - లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్

7. సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ

Yesuni sramalathoda aashatho palu pondhedhanu యేసుని శ్రమలతోడ - ఆశతో పాలు పొందెదను

Song no: 230

ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థనచేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. లూకా Luke 22:44 


పల్లవి: యేసుని శ్రమలతోడ - ఆశతో పాలు పొందెదను
అను పల్లవి: ఇతని ఓదార్పు నిజము - ఇతర ఓదార్పు వృథయే

1. నిందలెల్ల ఏకముగా - మహామహునిమీద బడగా
వింతగానే యోర్చుకొనెను - తండ్రి మాట నేరవేర్చెన్

2. దుఃఖముతో నిండియుండెన్ - ప్రక్కలోన గ్రుచ్చబడెను
రక్తితోడయోర్చుకొని వి - రక్తి మాట పల్కకుండెన్

3. శోకంబు చెత నేను - నాకంబు కదిలింతును
రక్తంబుధార పోసెన్ - రిక్తులమైన మనకు

4. సదయుని రక్తముచే - హృదయాలంకారముచే
కలుగు నాహారమిదే - ఎల్లరకు శ్రేష్టాహారం

5. తల్లి ప్రేమకన్న మిగుల - తన ప్రేమ చూపె మనకై
నోటి మాటతోడ శత్రున్ - కోటల నశింపజేసెన్

6. నా యేసు రక్తచెమట - నాయప్పు యంతయున్ తీర్చెన్
ఎల్లరికి నగీకారమిదే - ఎల్లప్పుడు నా ధ్యానమున్

7. హల్లెలూయా గీతమును - ఎల్లపుడు చాటుచుందున్
ఎల్లరియందు తానే - ఎల్లప్పుడు వసించున్

Nirakara surupuda manohara karigithiva nakai vreladuchu నిరాకార, సురూపుడా, మనోహరా కరిగితివా నాకై వ్రేలాడుచు

Song no: 229

ఆయన తన సిలువ మోసికొని ... వెళ్ళెను యోహాను John 19:17

పల్లవి: నిరాకార, సురూపుడా, మనోహరా
కరిగితివా నాకై వ్రేలాడుచు - సిలువలో

1. వారుల దెబ్బలబాధ నొంది - వాడి మేకులతో గ్రుచ్చబడి
తీరని దాహము సహించితివి - సిలువలో

2. మానవులు ఏడ్చి ప్రలాపింప - భూరాజు లెల్లరు మాడిపోగా
శిష్యుల డెందములు పగుల - సిలువలో

3. అరచి ప్రాణము వీడిన సుతుడా - వైరి నే నీ పాదముల బడితిని
కోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో

4. కోరి సిల్వభారమును మోసితివి - పాపభారమును ద్రుంచితివి
ఘోర గాయములు పొందితివి - సిలువలో

5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్ - పెన్నుగ నీవు సహించితివి
నన్ను నీ చిత్తమున బిడ్డచేయ - సిలువలో

6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా - నీదు రక్తమును పారెనయ్యా!
తీరుగా నే రక్షణ పొందను - సిలువలో

7. ఒక్కడుగు నిత్య దేవినికే - ఒక్కడుగు సుతుడేసునకే
ఒక్కడుగు సత్య ఆత్మ నీకే - హల్లెలూయా

Mahathmudaina na prabhu vichithra silva juda మహాత్ముఁడైన నా ప్రభు విచిత్ర సిల్వఁ జూడ

Song no: 212

మహాత్ముఁడైన నా ప్రభు విచిత్ర సిల్వఁ జూడ నా యాస్తిన్ నష్టంబుగా నెంచి గర్వం బణంగఁ ద్రొక్కుదున్.

నీ సిల్వ గాక యో దేవా దేనిన్ బ్రేమింప నీయకు నన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును.

శిరంబు పాద హస్తముల్ నూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాదప్రేమ లీ గతిన్?

ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీట మేసు కుండినన్ ఈ భూకిరీటములన్నీ దానం దూగంగఁ జాలు నే?

లోకంబు నే నర్పించిన నయోగ్యమైన యీవి యౌ వింతైన యేసు ప్రేమకై నా యావజ్జీవ మిత్తును.

రక్షింపఁ బడ్డ లోకమా రక్షింపఁ జావుఁ బొందిన రక్షకుఁ డేసునిన్ సదా రావంబుతోడఁ గొల్వుమా





Silva yoddha jerudhun bidha hinayandhudan సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్

Song no: 211

సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్ లోకమున్ త్యజింతును పూర్ణముక్తి నొందుదున్ ||కర్త, నిన్నె నమ్ముదున్ కల్వరీ గొఱ్ఱెపిల్లా మోకరించి వేఁడెదన్ నన్నుఁ గావుమో ప్రభో!||

నిన్ నేఁజేరఁ గోరఁగా నన్ను ఁబాయు పాపము శుద్ధిఁజేతునంచును యేసు మాటనిచ్చెను.

నన్ను ను నా మిత్రులన్ లోక యాస్తిఁ గాలమున్ దేహయాత్మయంతయు నీకర్పింతునిప్పుడు.

యేసుమాట నమ్మెదన్ క్రీస్తు రక్త పుణ్యముఁ జూచి మ్రొక్కి యేసుతో నేను మృతినొందితిన్.

యేసు తాను వచ్చును నాకు నిచ్చు పూర్ణతన్ శుద్ధ సౌఖ్య మొందుదున్ జయస్తోత్ర మేసుకు.

Gayambutho nimdaru o shuddha sirassa గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరస్సా

Song no: 210


గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరస్సా! హా! ముండ్ల కిరీటంబు భరించు శిరస్సా! నీకిప్పుడు డపకీర్తి హాస్యంబు గల్గెఁగా కర్తా! ఘనంబు కీర్తి ఎన్నడు గల్గుఁగా

లోకంబు భీతి నొందు ప్రకాశపూర్ణుడా! ఆ యూదులైన వారు నీ మొము మీఁదను! నాఁడుమ్మి వేసినారా? నీ ముఖకాంతికి సమాన కాంతి లేదు కురూపి వైతివా.

నీవోర్చినట్టి బాధ నా క్రూర పాపమే! నాకోస మింత బాధ వహించినావుగా! దైవోగ్ర బాధ కేను పాత్రుండ నైతిని దృష్టించి నన్నుఁ జూఁచి కటాక్ష ముంచుమీ.

నేఁ బాపి నైతి గాని నన్ నీవు చేర్చుము! నీ నిత్యయూటనుండి మేళ్లన్ని పారును! నీ నోరు మాధుర్యంపు సుబోధఁ జెప్పెను నీ పావనాత్మ మోక్ష సుఖంబు లిచ్చును.

నా కోస మింత బాధ వహించి నందుకు! యధార్థమైన స్తుతి నిత్యంబు నీదగున్ నీ నామమందు నేను విశ్వాస ముంతును నా యంత్యకాలమందు నా యొద్దనుండుము.


Naa koraku chanipoyi nada aadha yakarundiru నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు

Song no: 209

నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు వంక దొంగలతోడ ||నా కొఱకు||

ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధార భూలోకమునఁదనివిఁ దీర నిట్టి పుణ్యాత్ము నేమఱక పూజింతు మీర ||నా కొఱకు||

కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నేఁ గల్గుటంగాన విన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నా కొఱకు||

కీటకమువంటి ననుఁ బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావ వాటమా తన కిటులఁ గావ నేను వర్ణింపఁ గన్నీరు వరదలైపోవ ||నా కొఱకు||

ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్ గొల్గొతా మనలను మారణంబగు నవస్థలను బెట్ట మాదృశాత్మన్గావ మౌనమైయిలను ||నా కొఱకు||

ఏమి బహుమతుల నర్పింతు నట్టి స్వామిమేళ్లల్ల నా స్వాంతమున నుంతున్ ప్రేమ భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బిడు కర్తను భజింతున్ ||నా కొఱకు||

చేయనిఁక పాప సంగతము నాఁడు సిలువపైఁ జచ్చిన శ్రీకరుని కతము పాయ కాబ్రభుసత్యవ్రతము నాధు ప్రాణాంత మౌదాఁక ప్రార్థింతు సతము ||నా కొఱకు||


Harshame yentho harshame kreesthunu karyamu harshame హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే

Song no: 208

హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే యెంతో హర్షమే హర్షమే తద్భక్తవరులకు నద్భుతంబగు యేసు క్రియలా కర్షమై హృదయంబు నందలి కలుషముం ధ్వంసింపఁజేయు ||హర్షమే||

ఆర్యుఁడై భాసిల్లు మన ప్రభు నార్త ధ్వనితో జీవమీయఁగ సూర్యరశ్మి దొలంగి యిరలై క్షోణియును గంపంబు నొందుట ||హర్షమే||

మారణముఁ దానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్ దారుణిం జీవించి మఱలను దామెరుసలేమందుఁ జొచ్చుట ||హర్షమే||

పొరిపొరిం గాసించు చొక త స్కరుఁడు వధ్యాస్తంభమున న నర్మువ కోస్వామియన న్బ్రభు కరుణతో మోక్షం బొసంగుట ||హర్షమే||

ఏలి కనువిడ సాలమోన్భూ పౌలు నా దేవాలయపు తెర జీలిపోవను రెండుగా జన జాల మాశ్చర్యమునఁ బొందుట ||హర్షమే||

సిలువపై యేసున్ శపించిన ఖలులకై దేవునిఁ బితాయని పిలిచి వీరింగావు మంచును బ్రేమతో జీవంబు విడుచుట ||హర్షమే||

నెయ్యమున విభుఁ డేసునాధుం డి య్యరులకై ప్రాణమీయఁగ వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు భీతినొందుట ||హర్షమే||

కీటకముతో సాటి యగునా ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని దామీట నేనిఁక మేటి జీవకిరీట మొందుట ||హర్షమే||


Karunasagara vivekava maranamomdha కరుణసాగర వీవేకావా మరణమొంద

Song no: 206

కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా ||కరుణ||

నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ గ ||నజరేతు||

మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా ||మరియయనే||

మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా ||మహిలోను||

పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె ||పరమతండ్రి||

Yemi nerambuleka ya maranasthambhamu nela moya ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ

Song no: 205

ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ నాయెను నా యేసు ఎంత ఘోరము లాయెను ఈ మానవులు యెరుషలేము బైటకు దీయ నేమి నేరము దోచెను ||ఏమి||

మున్ను దీర్ఘదర్శు లెన్నిన రీతిని కన్నెకడుపున బుట్టిన నా యేసు వన్నె మీరంగ బెరిగిన చెన్నైన నీ మేను చెమట బుట్టంగ నీ కిన్ని కడగండ్లాయెను ||ఏమి||

కన్నతల్లి యిట్టి కడగండ్లు గాంచిన కడుపేరీతినోర్చును నా యేసు గాంచనేలను గూలును నిన్నెరిగి నట్టివారు నీ పాట్లు గని యేడ్చు చున్నారలీ వేళను ||ఏమి||

అయ్యయ్యో యూదు లింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి పూని నా యేసు మోయ శక్యంబు గాని కొయ్యమూపు నెత్తి రయ్య నీ కెంత భార మయ్య వెతజూడ జాలను ||ఏమి||

పిల్ల లాట్లాడినట్లు ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి నా యేసు పల్లరుపు లధికమాడిరి ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము మీ దెల్లనుమిసిరి ||ఏమి||

కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చేజరిచి వేడ్కను నా యేసు అట్టి వారెవ్వరంచును విరగ భావంబునడిగి నెక్కిరించుచు నీ వెంబడి వత్తురేలను ||ఏమి||

ఏలడివారు నడువ మ్రోలవస్త్రంబులను నేల బరిచిన రీతిగా నా యేసు మ్రోలబరిచిరియట్లుగ ఏల యీ కోడిగంబు లేల నీమీద కంటు ఏమి నేరంబు లేదుగ ||ఏమి||

చాల బాధించి క పాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా యేసు జాలి రవ్వంత లేకను కాలు సేతులినుప చీలలతో బిగించ జిమ్మి రక్తంబు గారెను ||ఏమి||

నాదేవ నా దేవ నన్నెందుకై విడిచి నా వంచు మొరబెడితివి నా యేసు నమ్మితివి లోబడితివి వేదనధికంబాయె నే దిక్కులేనట్టు యూదాళి కగుపడితివి ||ఏమి||

అంధకారము దేశ మంతట గలిగెను ఆవరించెను సూర్యుని నా యేసు ఆలయపు తెరచినిగెను బంధ స్తంభమునుండి బహు గొప్ప శబ్దముతో బిలిచెద వేమిట్లను ||ఏమి||

ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను ఒనరంగ నా యాత్మను నా యేసు అని ప్రాణమును వీడెను ఏ తప్పిదంబు లేక నీ పాటునొందితివి ఎంతో వింతై నిలుచును ||ఏమి||

నీ చాత్ము డొకడు నిఱ్ఱ నీల్గి బల్లెంబుతోడ నీ ప్రక్క బొడిచె చావను నా యేసు నీరు నెత్తురు గారెను ఏచియున్నట్టి కస్తి కెట్లు నీ యొడలుసైచె నెంతో చోద్యంబు చూడను ||ఏమి||

పాపాత్ములకు పూట బడిన వల్లనే యింత పరితాపమరణమాయెను నా యేసు ఎరిగే యనుభవించెను నా పాప ఫలము నిన్ను వేపాట్లు బెట్టి చంప నోపితివయ్య ప్రేమను ||ఏమి||

ఎంత యమూల్యమైన దెంతయనంతమైన దెంతయగాధమైనది నా యేసు ఎంతో యుచితమైనది ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన మాకు ఏల కనుపర్చబడ్డది ||ఏమి||

ప్రేమాతిశయుడనేను ఏ మాత్రుడను నెన్న నా మానసమున కందను నా యేసు ప్రేమ సారంబు తెలియను పామరాళిని బ్రోచు క్షేమాధికారి నిన్ను యేమంచు వర్ణింతును ||ఏమి||


Siluvalo vreladu prabhuve viluva kamdhaga సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ

Song no: 204

సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి మనకై కొనియెఁగల్వరి నిపుడు సాష్టాంగము లొనర్చుచు ||సిలువ||

కొరత చావయినను మరణము వఱకుఁదనుఁ దగ్గించుకొని మన కొఱకు దాసుండగుచు రిక్తుని కరణి నిట జీవము నొసంగెడు ||సిలువ||

తనను నమ్మినవారు చావక యనిశ జీవమునొంది బతుకను దన స్వపుత్రుని నిచ్చునంతఁగఁ దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువ||

పాప మెఱుగని వాని మనకై పాపముఁగ నొనరించి దేవుఁడు శాపగ్రస్తులలోన నొకఁడుగ మా ప్రభుండెంచంగఁ బడియెను ||సిలువ||

లోకమాంస పిశాచులని యెడి భీకారుల పొంగుఁ గృంగను శ్రీ కరుఁ డు మన దేవతనయుం డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువ||

ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన తావిదే మన పారమార్ధిక బలము కిరువగు ధీర శ్రేష్ఠుఁడు దిశలు ఘళ్లన ||సిలువ|| దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ||దశమ||

శరణు గలదిఁక పాపకోటికి స్వామి ద్రోహపు శత్రులకు సహ కరుణ రుధిర కణాగతంబున కలుష రహిత మనంత రక్షణ ||సిలువ||

మాకు ప్రేమ సారమయ్యెను మాకు జీవనాధారమయ్యెను మాకుఁ దృప్తి సునీరమయ్యెను మాకుఁ బరమ విచారమయ్యెను ||సిలువ||

నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సందియము లాత్మను క్రమ్ముదము మోక్షపురి బాట సు ఖమ్ము మన హృదయమ్ము లొందను ||సిలువ||

Yemdhu boyedhavo ha prabhuraya yendhu boyedhavo ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో

Song no: 203

ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో ఎందుఁ బోయెదవయ్య యీ దుర్మానవశ్రేణి బొందఁదగిన భరంబుఁ బూని రక్షక నీవు ||ఎందు||

వడగాలిలోను నీ నెమ్మోము వాడికందఁగను నొడలఁ జెమటయు నీరు నొడిసివర దయై పార నడుగులు తడఁబడ నయ్యా యిప్పుడు నీవు ||ఎందు||

మూఁపుపై సిలువ శత్రు స మూహముల్ నడువఁ కాపు ప్రచండమౌ కారెండ కాయఁగ నేపున నా పాప మీ పాటు పెట్టఁగ ||ఎందు||

విరువు గట్టివియో జనుల రక్షించు బిరుదలయ్యవియో పరమ రక్షకుండా నా పాపబంధము లవియో పరిశోదించెడి వారి పట్టుకొమ్మలవియో ||ఎందు||

ఆకాశమందు దూతలు కొల్వ నతితేజ మొందు ప్రాకటమైన నీ సదముల్ పగులురాల తాఁకునఁబగిలి ర క్త ధారలొల్కఁగను ||నెందు||

పరమందుఁగల్గు పరిమళముచేఁ బసమించి వెల్గు చిరమౌ దేహమునకు నా యెరుష లేమను నట్టి పురములోపలి మన్ను పూత మయ్యెనా ప్రభువా ||ఎందు||

ఒక పాలివెతలా రవ్వంతైన సుకరమౌ స్థితులా యకటా చెదరి గుండె లదరి ఝుల్ ఝుల్మని యొకటిఁ బొందక తాప మొంది కుందునే కర్త ||ఎందు||

Kalvari girijeru manasa silva sarasa కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస

Song no: 202

కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస ||కల్వరి||

సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ ||కల్వరి||

పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు గొట్టెద రేల కరుణాలవాల ||కల్వరి||

కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల గుచ్చెద రేల ||కల్వరి||

ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమి వేసెదరేల పాటించరేల ||కల్వరి||

ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె దేవ క్రూరునికైన ||కల్వరి||

పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత ఉత్కట బాధ ||కల్వరి||

స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ ||కల్వరి||

పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు దెల్పుము మానవాళికిన్ ||కల్వరి||

సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ శక్తినీయుము సిలువ ధ్యానమున ||కల్వరి||

Kalavari mettapai kalavara mettidho కలవరి మెట్టపై కలవర మెట్టిదొ

Song no: #201

    కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ లొందినీ ప్రాణము బెట్టితి ||కల||

  1. తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను గుందితి ||కల||

  2. పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు ||కల||

  3. దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల||

  4. జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి ||కల||

  5. శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు? ||కల||

Chediyulu gumpugudiri kreesthu jada gani చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని

Song no: 200

చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని తాల్మి నీడిరి ఆడికలనోర్చి నేఁడు మన పాఁలి వాఁడుసిలువ ను న్నాడు గదె యంచు ||చేడియలు||

వారి మొగములు వాడెను యేసు వారి వెత లెల్ల జూడను నీరు దృక్సర సీరుహములందు జార తమ కొన గోరులను మీటి ||చేడియలు||

రొమ్ములను జేతు లుంచుచు చింత గ్రమ్మి నిట్టూర్పు లిచ్చుచు కొమ్మలట నిల్పు బొమ్మలన చేష్ట లిమ్ముచెడి యబ్బు రమ్ముతో నిల్చి ||చేడియలు||

Sirulella vrudha kaga parikimchi nakunna సిరులెల్ల వృధ కాగ పరికించి నాకున్న

Song no: 199

సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న గురువముఁ దిరస్కరింతున్ వెర మహిమ రారాజు మరణాద్భుతపు సిలువ నరయుచున్నట్టి వేళన్ ముఖ్యము లైన ||సిరు లెల్ల||

ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు మృతియందుఁ గాక మరి మురియ నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై త్యజించెదను ||సిరు లెల్ల||

చారు మస్తక హస్త పాదములవలన వి చారంబు దయయుఁ గలసి సారెఁ బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు కిరీటం బౌన ||సిరు లెల్ల||

వాని నిజ రక్తంబు వస్త్రంబువలె సిలువ పై నతని తనువు గప్పె ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై తిని నా కీ లోకము మృతంబయ్యె ||సిరు లెల్ల||

Ayyo nadhagu ghorapapamu gadha bharamai అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై

Song no: 197


అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యము వీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో||

నిరతము దూతానీక మూడిగము నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు నిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో||

కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను లారఁ చూచుకొన నేరనట్టి యల మేరి గర్భమున దూయఁబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||

మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా ||రయ్యో||

కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ ||మయ్యో||

ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైనిఁ బెట్టి నీ కండ్ల కొక్క గంతఁ గడ గండు పెట్టఁ గారణము నిజముగా ||నయ్యో||

ఈపు ప్రాణమును నీవిగ నొసఁగ నీటెతోడఁ బ్రక్కను బొడుచుట హా భావమందుఁ దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ ||మయ్యో||



Siluvalo na yesu vadhiyimpabadenu సిలువలో నా యేసు వధియింపబడెను

Song no:

సిలువలో నా యేసు వధియింపబడెను
నాదు పాపముకై నీదు శాపముకై " 2 "
లోక రక్షణకై మోక్ష మార్గముకై  " 2 "
పరిశుద్ధుడు పరిపూర్ణుడు
రక్షకుడు యేసే     " 2 "


వధియింపబడిన దేవుని గొర్రెపిల్ల
పాపములను కడుగా
పరిశుద్ధుడు రక్తము కార్చెను " 2 "
 మార్గము  సత్యము జీవము యేసే " 2 "
                    " సిలువలో నాయేసు "


మరణపు ముళ్ళు విరిచి
వేధనలను తొలగించేన్
మృత్యుంజయుడై లేచెన్
తన జీవం నాకిచ్చేను
సజీవుడు అభిశక్తుడు నిత్య జీవము క్రీస్తే
               
సిలువలో నా యేసు వధియింపబడెను
నాదు పాపముకై నీదు శాపముకై " 2 "
లోక రక్షణకై మోక్ష మార్గముకై  " 2 "
పరిశుద్ధుడు పరిపూర్ణుడు
రక్షకుడు యేసే     " 2 "
మార్గము  సత్యము జీవము యేసే " 2 "
సజీవుడు అభిశక్తుడు నిత్య జీవము క్రీస్తే
                      " సిలువలో నాయేసు "


yennadu ganchedhamo yesuni nennadu ఎన్నడు గాంచెదమో యేసుని నెన్నడు

Song no: 195


ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నఁడు||

అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు||

వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట బల్లెము దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు||

చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ ట మన దగు నేరము గాచెనఁట ||యెన్నఁడు||

ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ ట యెహోవా కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు||

అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||

Yesunadhuni suluvapaini vesi sramabondhinchinadhi యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది

Song no: 194


యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే దుస్సహ వాసమే ||యేసు||

కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే పాపపు పలుకులే ||యేసు||

మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే దుష్క ర్మంబులే ||యేసు||

పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే దోసపు పడకలే ||యేసు||

దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా సక్తియే యందను రక్తియే ||యేసు||

హెచ్చుగ లోహిత పతనముగఁ గ్రుచ్చిన కుంతంబు నా పా పేచ్ఛలే హృదయదు రేచ్ఛలే ||యేసు||

పావనగాత్రంబు క్షతమయ మై వెతలపాల్జేసినది నా దేహమే యఘ సం దోహమే ||యేసు||

దీనిఁగని నా మానసాబ్జము లోని కలుషము దూరపర్చక నడుతునా ధారుణిఁ గడుతు నా ||యేసు||

aidhu gayamu londhinava nakora kaidhu ఐదు గాయము లొందినావా నాకొర! కైదు

Song no: 192


ఐదు గాయము లొందినావా నాకొర! కైదు గాయము లొంది నావా ఐదు గాయముల నా యాత్మఁ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే ||ఐదు||

గార మైన నీ శ రీర రక్త మిలను ధారయై కారినదా నా నేరమా యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా ||ఐదు||

అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై రాలెనే యీ చంద మూహింప నా డెందమ్ము భీతిచేఁ గొందలమై తూలెనే ||ఐదు||

ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొఱ్ఱె పిల్లవు నీవేగదా నా వల్లనా నీ కింత యల్లాట పుట్టెనే చెల్ల తాళునె నా యెద ||ఐదు||

భంగమౌనట్టి దు ష్పాపులఁ గావ నీ ప్రాణ మర్పించితివా యీ సంగతిఁ జూడ నీ సాహస మింక నే భంగి నీ జగతి మరవ ||ఐదు||

ఆయాసమైన నీ యాపదలెల్ల నే నాలోచింపఁగ నాత్మలో నెడ బాయక తద్దివ్య పాదసరోజముల్ భాసిల్లు నా యాత్మలో ||ఐదు||

తల్లికైన మరి తండ్రి కైన నన్న దమ్ముల కైన లేదే కన్న పిల్లలకైన నీ ప్రేమఁ పోల్చుద మన్నఁ బృథివిలోఁ గానరాదే ||ఐదు||

ఈ ప్రీతి నీ యోర్మి నీ మహాత్మ్యం బిల నెవ్వ రూహింతు రొగి నో హో ప్రభువా తద్ద యోత్కట గాంభీర్య మూహింప నీకే తగు ||ఐదు||

Aha yenthati sramabondhithi vayyo ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో

Song no: 190


ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో దాహ మాయెను నీకు సిల్వపై ద్రోహు లందరు గూడి రయ్యయ్యో నీదు దేహంబు బాధించి రయ్యయ్యో ||యాహా||

దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా ||ఆహా||

కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||

కాలుసేతులయందు వారలు ఇనుప చీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి సుమంతైన జూపక వారు గేలిజేయుచు బాధపెట్టిరా ||ఆహా||

బాధ తగ్గింపరాణువవారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనస్సు దానినొల్లక గొప్ప వేదనలను భరియించెనే ||ఆహా||





Vandhanam neeke vandhanam parishuddha sirama వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం

Song no: 189
(చాయ: చూడరే క్రీస్తుని)
వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె ||వందనం||

సుందరుఁడ నీ శిరసు హేళనఁ బొందె ముండ్ల కిరీట ముంచగ నెందుఁ జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్నుఁ గొలిచెద నందముగ మహిమ ప్రభువా ||వందనం||

భీకరుఁడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి నుమి వేయఁబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము ||వందనం||

మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా నాలో చించఁగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి పోయెను మరణ బలమున ||వందనం||

సిలువ యెదుటను నిపుడు నేనిఁక నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక పిలిచెద నిన్నేఁ గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా యేసు నినుఁ జేతులతో నాపెద ||వందనం||

నిన్ను నేఁ గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విఁక ని న్నెటుల నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నునిఁ జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే ||వందనం||

మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగఁ గృపతో వరబలుండా నా విరోధుని కరకు శరములఁ ద్రుంచ రావె శూరుఁడా దేవకు మారుఁడా అటు నీ మరణ రూపము సిలువపై నా తరుణమునఁ జూపుము యెహోవా ||వందనం||

Chudare kreesthuni judare na sukhulara chudare చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే

Song no: 188

చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో ||చూడరే||

మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది ||చూడరే||

మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ బ్రాణము లుండునే యిఁకఁ ||జూడరే||

ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ జేసిరి ||చూడరే||



Papulayeda kree sthuni priya mettidho parikimpare పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె

Song no: 187

పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||బాపుల||

యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా రల నోదార్చెను ||బాపుల||

శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||

తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్ కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||

మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ ||బాపుల||

Apu darchakadhu luppongiri prabhuni viparithanuga అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి

Song no: 185

అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు సిల్వమానిపైఁ బ్రభుని వేయుట కొప్పి ||రపు డర్చ||

యెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమ సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ గొట్టి ||రపు డర్చ||

చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తము నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె ||నపు డర్చ||

గడి దొంగ లిరువురుని బట్టిరి ప్రభుని కుడి యెడమలను సిల్వఁ గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు బాధలను మరియ కొడు కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె ||నపు డర్చ||

Siluvanu mosithiva na korakai kalavari metlapaiki సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి

Song no: 183
( చాయా: ఎంతో దుఃఖముఁ బొందితివా )
సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా యాత్మలోఁ బలుమాఱు దలఁపఁగాఁ దాలిమి లేదాయెను హా యీ జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువఁజాల ||సిలువ||

1. ఘోరమైనట్టి యీ భారమైన సిలువ ధరియించి భుజముపైని నా దురితముల్ బాపను కరుణచేఁ జనుదెంచి మరణము నొందితివా ||సిలువ||

2. కలువరి మెట్టపైఁ కాలు సేతు లెల్ల చీలలతోఁ గ్రుచ్చిపట్టి యా సిలువకుఁ గొట్టఁగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా ||సిలువ||

3. మెట్టపైన నిన్నుఁ పెట్టిన బాధ నేఁ బట్టి తలంపఁగను ఆహా పట్టైన నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను ||సిలువ||

3. పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపఁగను హానా మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి ||సిలువ||



Ento duḥkhamum bonditiva ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో

Manasa yesu marana badha lensi padave మనస యేసు మరణ బాధ లెనసి పాడవే

Song no: 180

మనస యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరుఁ జూడవే యా ఘనునిఁ గూడవే నిను మనుప జచ్చుటరసియే మరక వేఁడవే ||మనస||

అచ్చి పాపములను బాప వచ్చినాఁడఁట వా క్కిచ్చి తండ్రితో నా గెత్సెమందున తాఁ జొచ్చి యెదను నొచ్చి బాధ హెచ్చుగనెనఁట ||మనస||

ఆ నిశోధ రాత్రి వేళ నార్భటించుచు న య్యో నరాంతకుల్ చేఁ బూని యీటెలన్ ఒక ఖూని వానివలెను గట్టి కొంచుఁబోయిరా ||మనస||

పట్టి దొంగవలెను గంత గట్టి కన్నులన్ మరి గొట్టి చెంపలన్ వడిఁ దిట్టి నవ్వుచున్ నినుఁ గొట్టి రెవ్వ రదియు మాకుఁ జెప్పుమనిరఁ ట ||మనస||

ముళ్లతోడ నొక కిరీట మల్లి ప్రభుతలన్ బెట్టి రెల్లు కఱ్ఱతో నా కల్ల జనములు రా జిల్లు మనుచుఁ గొట్టి నవ్వి గొల్లు బెట్టిరా ||మనస||

మొయ్యలేక సిల్వ భరము మూర్ఛ బోయెనా అ య్యయ్యో జొక్కెనా యే సయ్య తూలెనా మా యయ్యనిన్ దలంపగుండె లదరి పోయెనా ||మనస||

కాలు సేతులన్ గుదించి కల్వరి గిరిపై నిన్ గేలిఁజేయుచు నీ కాళ్లమీఁదను నినుప చీలలతోఁ గ్రుచ్చి నిన్ను సిల్వఁ గొట్టిరా ||మనస||

దేవ సుతుఁడ వైతి వేని తెవరంబుగా దిగి నీవు వేగమే రమ్ము గావు మనుచును ఇట్లు గావరించి పల్కు పగర కరుణఁజూపెనా ||మనస||

తన్నుఁ జంపు శత్రువులకు దయను జూపెనా తన నెనరు జూపెనా ప్రభు కనికరించెనా ఓ జనక యీ జనుల క్షమించు మనుచు వేఁ డెనా ||మనస||

తాళలేని బాధ లెచ్చి దాహ మాయెనా న న్నేలువానికి నా పాలి స్వామికి నే నేల పాపములను జేసి హింస పరచితి ||మనస||

గోడు బుచ్చి సిలువపైన నేడు మారులు మా ట్లాడి ప్రేమ తో నా నాఁడు శిరమును వంచి నేఁడు ముగిసె సర్వ మనుచు వీడె బ్రాణము ||మనస||

మరణమైన ప్రభుని జూచి ధరణి వణఁకెనా బల్ గిరులు బగిలెనా గుడి తెరయుఁ జీలెనా దివా కరుఁడు చీఁక టాయె మృతులు తిరిగి లేచిరి ||మనస||

ఇంత జాలి యింత ప్రేమ యింత శాంతమా నీ యంతఃకరుణను నేఁ జింత చేయఁగా నీ వింత లెల్ల నిత్య జీవ విధము లాయెనా ||మనస||


Aa yandhakarapu reyilo kreesthu padu nayasamulu ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు

Song no: 178

ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు దలఁచరే సాయంతనము శిష్య నమితితో భోజనముఁ జయఁగూర్చున్న ప్రభువు భక్తుల కనియె ||నా యంధ||

ఒకఁడు మీలో నన్ను యూద గణముల చేత లకు నప్పగింపఁ దలఁ చెన్ మొక మిచ్చకము గల్గు మూర్ఖుఁడగు యూదాను మొనసె వీడనుచుఁ దెలిపి యికఁ మిమ్ముఁగూడియుం డకయుందునని రొట్టె విరిచి స్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని భక్షించుఁడని పిదప నొక పాత్ర నాన నిచ్చెన్ ద్రాక్షారసం ||బా యంధ||

తన మేని గురుతు రొ ట్టెను జేసి పాపవిమో చనమైన రక్తమునకు నొనరంగ ద్రాక్షారస మును గురుతుగాఁ దెలిపి నెనరుగల కర్త యపుడు చనె గెత్సెమను వన స్థలిలోన శిష్యుల నునిచి తానొక్కరుండు మనసు వ్యాకులము చే తను నిండియుండఁగా ఘనుడు ప్రార్ధించెఁదండ్రిన్ గాఢముగాను ||ఆ యంధ||

శ్రమచేతఁ దన శరీ రము నుండి దిగజారెఁ జెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపా పముఁ జూచి నిట్టూర్పులప్పటప్పటికిఁ బుచ్చి క్రమముగా దూత తన కడ కరుగుదెంచి శాం తముఁ బల్కి చనిన పిదపం తమ మనంబులఁ బోలు తమసమున యూద సై న్యము లేగుదెంచె నపుడు గెత్సెమను పనికి ||నా యంధ||

పరశాంతి శీల స ర్వజ్ఞతలు గల ప్రభుం డెరిఁగి తనకున్న పాట్లు పరిపంధి గణముతోఁ బలికె మీరిచ్చోట నరయుచున్నా రెవనిని నరులు నజరేతు యే సను వాని ననఁగఁ దా నెఱిఁగించె నేనేయని గురుదీప శిఖల సో కు పతంగముల భంగి ధరణిపైఁ బడిరి వారల్ దర్పము లణఁగి ||యా యంధ||

తన శిష్యులను విడువుఁ డని రిపులచేఁ దానె పట్టువడియెన్ కినిపి పేతురు యాజ కుని దాసు కర్ణంబు దునుమంగ క్రీస్తుఁడపుడు కనికరంబున స్వస్థ తను జేయు నావిభుని కరములను విరిచి కట్టి వెనుక ముందరఁ జుట్టు కొని యెరూషలేము పుర మునకుఁ దీనుకఁ బోయిరి రాణువవార ||లా యంధ||


Viluvaina nee dhehamu parishuddhathmaku alayam విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

Song no:
విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం
విలువైన నీ దేహముతో దేవుని మహిమ పరచూ

యౌవ్వన కాలామున ప్రభు కాడినీ మోయుము
విశ్వాసం ముందు యోధుడవై దేవునీ మహిమపరచూ
విలువైన నీ దేహమూ

ఆత్మా ప్రాణా దేహమూ అర్పించుకో క్రీస్తుకై
పవిత్ర మైన హృదయాలు కలిగి దేవునీ మహిమపరచూ (2)