Song no: 625
- ఆత్మ! శృంగారించు కొమ్ము పాప గుహ వీడి పొమ్ము వెల్గులోని కింకరమ్ము తేజరిల్లు మీ దినము "రక్షణాధి కారవిందు నీకు జేయ బోవుముందు భూదినంబు లేలు ఱేడు నిన్ను జేర వచ్చు నేడు"
- పెండ్లి కూతురెట్లు భర్త నట్లు ప్రేమ జూపుకర్త నాయ నెంతో జాలిగుండె తోడ దల్పు దట్టు చుండె "నా ప్రియుండ! వేగరమ్ము ముద్దు బెట్ట నిమ్ము నన్ను" అందు హృదయంబుతోడ యేసునాద నాహ్వానించు.
- శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు జేయ గొండ్రు బల్ధనంబు సర్వ శ్రేష్ఠమౌ వరంబు లిచ్చు చుంటి యుచితంబు కాకయున్న నీ శరీర రక్తముల్గొనంగ నీర రాసులైన గనులైన జాలునా మరేవియైన?
- నిశ్చలంపు బ్రేమ నిన్ను చీల్చి భూమికంటె నన్ను మాకునైత్వదీయ ప్రాణ మిచ్చినాడ వట్లు గాన ఆమేన్. చిందబడ్డ నీ శరీర రక్త బిందు లింపుమీర రాత్రి భోజనాన మాక నంత ప్రేమ పెంచుగాక
- యేసు! జీవ భక్తమైన నీదు బల్ల గంటినైన వ్యర్థ నష్టతల్ల భింప నీకు, దీననే నశింప భూమి మీద బోలె మింట నిన్ను గూడి త్రాగి తింటి కీసు భోజనంబు నందు నీదు ప్రేమ జూపుమందు,