Song no: 431
- ఆహా నాకేమానందము శ్రీ యేసు నాచేఁ బట్టుచు సహాయుఁడై నాయన్నిటన్ సజీవుఁడై నడుపును. ||నా దారిఁ జూపును యేసు నా చేఁబట్టి నడుపును ఎన్నఁడు నెడబాయఁడు యేసె నా దారిఁ జూఁపును ||
- యేదే స్సుఖంబు లైనన్ సదా విచార మైనను బాధాంధకార మైనను ముదంబుతోడ నుందును.
- చింతేల నాకు నీ దయన్ సంతత మీవు తోడుగాన్ బంతంబు నీచేఁ బట్టుచు సంతృప్తితో నే నుందును.
- నా చావు వేళ వచ్చినన్ విచార మొందక ధృతిన్ నీ చేయి బట్టి యేసుఁడా నీ చారు మోక్ష మెక్కుదున్