Song no: 321
- ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్ ||ఆద||
- నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా
- సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు లొసగుము నీతి నిధుల సజీవుడా ||ఆద||
- ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి నా ప ద్బాంధవ విడిపించుమా ||ఆద||
- పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా మొరను గైకొని కలుషముల నెడబాపవే ||ఆద||
- పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా ||