Song no: 1
- దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములయందు నిలిచియుండక
- యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు || దుష్టుల ||
- కాలువ నీటియోర నతడు నాటబడి కాలమున ఫలించు చెట్టువలె యుండును || దుష్టుల ||
- ఆకు వాడని చెట్టువలె నాతడుండును ఆయన చేయునదియెల్ల సఫలమగును || దుష్టుల ||
- దుష్టజనులు ఆ విధముగా నుండక పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు || దుష్టుల ||
- న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులు నీతిమంతుల సభలో పాపులును నిలువరు || దుష్టుల ||
- నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును నడుపును దుష్టుల దారి నాశనమునకు || దుష్టుల ||