నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2) నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య (2)
||నిన్నే||
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా (2) కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2) కఠినాత్ములెందరో నన్ను కొట్టినా
||నిన్నే||
చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా (2) చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా (2) చెలిమే చితికి నన్ను చేర్చినా
||నిన్నే||
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు /2/
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా /2/
1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి /2/
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను /2/
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే /కృపా/
2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి /2/
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను /2/
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే /కృపా /
3.నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని /2/
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా /2/
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే /కృపా/
యేసయ్య! నీకృప నాకు చాలయ్య
నీకృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము
నేనూహించలేను యేసయ్య ...... "2"
పల్లవి :- యేసయ్య నీకృప నాకు చాలయ్య నీ కృపలేనిదే నేనుండలేనయ్యా ....... 2
మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరు రూపమిచ్చావు "2"
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది - నీ కృప "2" యేసయ్య
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకున్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు
నా ... ఆశ తీర ఆరాధన చేసె
అదృష్టమిచ్చింది - నీ కృప "2" యేసయ్య
బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప॥2॥
ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు ॥2॥
పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు
యేసయ్యా నా యేసయ్యా ॥4॥
1.నా జీవిత నావ సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరి కొట్టగా
కదల లేక నాకథ ముగించబోగా॥2॥
నీవు పద అంటూ నన్ను నడిపించావు
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్
నీ పాదాల చెంతనే వాలి పోయెదా ॥2॥
॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
2.నా జీవితమంతా ప్రయాసలు పడగా
శోధనల సంద్రములో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా॥2॥
ఆప్యాయత చూపి ఆదరించినావు
నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ
నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥
॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
గూడు చెదరిన పక్షుల చేరదీసే నాధుడా
త్యాగశీలుడా నికొందనాలయ
నా హృదయ పాలక స్తోత్రం యేసయ్య "2"
1.లోకమానువరణ్య యాత్ర భారమయేను
బహు ధురమాయేను
నా గుండె నిండా వెధనలే నిందియుండెను నింధించుచుండెను
కన్నీరే నాకు అన్న పానమాయేను "2"
ధీక్కు లేక నా బ్రతుకు ధురమాయేను
బహు ఘోరమయేను " గుండె “
2.మనిషి మనిషి నుర్వలేని మాయా లోకము శూన్య ఛాయాలోకము
మాటలతో గాయ పరిచే క్రూర లోకము అంధకార లోకము
ఒంటరి తనమే నాకు స్నేహమయేను "2"
ధీక్కు లేక నా బ్రతుకు ధురమాయేను-బహు ఘోరమయేను“గుండె”
3.కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అలుముకున్నవి
కన్నీరు కేరటమై యెధలో పొంగుచున్నది పొరలి సంద్రమైనధి
శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని "2"
పానర్పణముగా నేను పోయబడితిని-సీలువ సాక్షినైతిని " గుండె"
Ae Baadha Ledu Ae Kashtam Ledu Yesu Thodundagaa
Ae Chintha Ledu Ae Nashtam Ledu Prabhuve Manakundagaa
Digulela O Sodaraa Prabhuve Manakandagaa
Bhayamela O Sodaree Yese Manakundagaa
Hallelooya Hallelooya Hallelooya – Hallelooya (2)
||Ae Baadha||
శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడు మహిమా
నీ జీవితము ద్వారా కలుగునుగాక....... "2"
హల్లెలూయ ఆమేన్....హల్లెలూయ ఆమేన్. "2"
నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమా.. "2"
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు"2"
యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక "2" "హల్లెలూయ"
అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ "2"
వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు "2" "హల్లెలూయ"
John wesly
Song no:
సుందరమైన దేహాలెన్నో శిథిలము కాలేదా?
అంబరామాంటిన రాజులెందరో అలసిపోలేదా ?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏది శాశ్వతం కాదేదీ శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడుము “2” “సుందరమైన”
నెత్తుటి చారలను లికించిన రాజులెందరో
ఆ నెత్తుటిలోనే ప్రాణాలు విడచిపోయారు
అదికారా దహముతో మదమెక్కిన వీరులు
సమడి లోతుల్లోనే మూగబోయారు “2”
తపోబలము పొందిన ఋషులందరూ
మతాదికారులు మటాదిపతులు
ఈ కాల గర్బములోనే కలసిపోయారు
మరణ పిడికిళ్ళలో బందిలయ్యారు “ఈ కాల”
యేసు లేని జీవితం వాడబారిన చరితం “2”
క్రీస్తు ఉన్న జీవితం భూవిలో చరితార్దం “2” సుందరమైన”
ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్దం ఉంటుందా
పాప సంకేళ్లలో బందీలైన వారికి
ఆ దివ్య మోక్షం చేరుకునే భాగ్యం ఉంటుందా ? “ప్రాణం పోసిన”
శరీరాన్ని విడచిన మనుష్య ఆత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా
రక్తము కార్చిన యేసును విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? “2”
యేసు లేని జీవితం అంధకార బంధురం
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం “2” “సుందరమైన”
ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు (2)||ఎంతటి||
ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును
బలమిచ్చువాడవు నీవే (2)
అల్పుడను మంటి పురుగును
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును
నా కొరకై అర్పించినావు ||ఎంతటి||
నిను వెంబడించువారిని
నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో
నిలిచే నీ సేవకుని (2)
ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||
వినయముగల మనుష్యులను
వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి
గద్దె నుండి దించెదవు (2)
మాదు ఆశ్రయ దుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా
మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||