- పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో||
- నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో||
- నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో||
- దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో||
- పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభో||
- ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో||
- కెరూబులను దూతలు సెరూపులను దూతలు తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో||
- నీ దపొస్తలుల మహిమగల సంఘము ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో||
- నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో||
- ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో||
- నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్||
- ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో||
Pahiloka prabho pahi loka prabho pahi yani పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని
Song no: #29
Mahima sarvonnathamaina dhaivamunaki మహిమ సర్వోన్నతమైన దైవమునకి
Song no: #28
- మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ||
- నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||
- ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||
- వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ర్వభో ||మహిమ||
- జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||
- ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||
- తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||
- పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||
- పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||
Randi yuthsahinchi padudhamu rakshana dhurgamu రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము
Song no: #26
- రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే||
- రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి||
- మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి||
- సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||
- ఆ ప్రభు సన్నిధి మోఁకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి||
- తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుఁగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి||
Bhumandalamunu dhani sampurnatha yunu lokamunu భూమండలము దాని సంపూర్ణత యును లోకమును
భూమండలము దాని సంపూర్ణత యును లోకమును భూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూ||
యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూ||
యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూ||
అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూ||
ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూ||
ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే ||భూ||
ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్ రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి ||భూ||
ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ ||భూ||
Subscribe to:
Posts (Atom)