23
రాగం -
(చాయ: )
తాళం -
Nuthanamainadhi nee vathsalyamu prathi dhinamu nannu నూతనమైనది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించేను
నూతనమైనది నీ వాత్సల్యము..
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2||
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును||2||
గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు ||2||
విడువని దేవుడవు
యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2||
||సన్నుతించెదను||
నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2|
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
||సన్నుతించెద||
నీ రెక్కలక్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు సంరక్షించావు||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు||2||
||సన్నుతించెదను||
Subscribe to:
Posts (Atom)