Vinuma yesuni jananamu kanuma వినుమా యేసుని జననము కనుమా

ly
0
Song no:
HD
    వినుమా యేసుని జననము
    కనుమా కన్య గర్భమందున (2)
    పరమ దేవుని లేఖనము (2)
    నెరవేరే గైకొనుమా (2)

    ఆనందం విరసిల్లె జనమంతా
    సంతోషం కలిగెను మనకంతా
    సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత
    చిరజీవం దిగివచ్చె భువికంతా || వినుమా ||

  1. గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట
    చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి
    మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన
    ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా || వినుమా ||

  2. పాపులనంతా రక్షింపగా
    పరమును విడిచె యేసు (2)
    దీనులకంతా శుభవార్తేగా (2)
    నడువంగ ప్రభువైపునకు (2) || ఆనందం ||

  3. అదిగో సర్వలోక రక్షకుడు
    దివినుండి దిగివచ్చినాఁడురా (2)
    చూడుము యేసుని దివ్యమోమును (2)
    రుచియించు ప్రభుని ప్రేమను (2) || ఆనందం ||


    Vinumaa Yesuni Jananamu
    Kanumaa Kanya Garbhamanduna (2)
    Parama Devuni Lekhanamu (2)
    Neravere Gaikonumaa (2)
    Aanandam Virasille Janamanthaa
    Santhosham Kaligenu Manakanthaa
    Soubhaagyam Pranaville Prabhu Chentha
    Chirajeevam Digi Vachche Bhuvikanthaa ||Vinumaa||

    Gollalochche Dootha Dwaaraa – Saagilapadi Mrokkiranta
    Chukka Choochi Gnaanulu Vachchiri – Yesunu Choochi Kaanukalichchiri
    Manakosam Puttenanta – Pashuvula Paakalona
    Entha Masthu Devudanna – Rakshanane Thechchenannaa ||Vinumaa||

    Paapulananthaa Rakshimpagaa
    Paramunu Vidiche Yesu (2)
    Deenulakanthaa Shubhavaarthegaa (2)
    Naduvanga Prabhu Vaipunaku (2) ||Aanandam||

    Adigo Sarvaloka Rakshakudu
    Divinundi Digi Vachchinaaduraa (2)
    Choodumu Yesuni Divya Momunu (2)
    Ruchiyinchu Prabhuni Premanu (2) ||Aanandam||

Post a Comment

0Comments

Post a Comment (0)