Song no: #84
- ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||
- ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||
- నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో||
- కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె ||ఇదిగో||
- మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో||
- జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము ||ఇదిగో||