Song no: #61
-
ఘనుఁడైన యెహోవా గద్దె ముందట మీరు వినతు లిప్పుడు చేయుడి యోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనం బొప్పుచుండనో జనులార ||ఘనుఁడైన||
- ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించు సంహరించు ననియున్ నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే మక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె మృత్తుచే మానవులఁగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరఁ దిరుగఁదన దొడ్డిఁబెట్టెనో జనులారా ||ఘనుఁడైన||
- మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలో మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ సహితముగను భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ బొందైన నీ నగరి కా ధామంబులను గాన సన్నుతి వితతిపూరి తమ్ములుగఁ జేయు దేవా యో జనులారా ||ఘనుఁడైన||
- ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ తగ విరహితాద్యంతమై స్థిరమైన కాలంబువలెనె యున్న దయదయ పొరలిపోవుచు నున్నవత్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు సత్యంబు నిలిచియుండున్ వర శిలా ఖండ పర్వతము తోడను సాటి వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులారా ||ఘనుఁడైన||