Song no: #70
- దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా ||దేవ||
- వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా ||దేవ||
- పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు ||దేవ||
- వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా ||దేవ||
- భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా ||దేవ||
- కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు ||దేవ||
- మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా ||దేవ||