Yehova naa balama yadhardhamainadhi ni margam యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం

ly
0
Song no: 682

    యెహోవా నా బలమా
    యదార్థమైనది నీ మార్గం
    పరిపూర్ణమైనది నీ మార్గం  } 2 || యెహోవా ||

  1. నా శత్రువులు నను చుట్టిననూ
    నరకపు పాశములరికట్టిననూ  } 2
    వరదవలె భక్తిహీనులు పొర్లిన   } 2
    విడువక నను ఎడబాయని దేవా  } 2 || యెహోవా ||

  2. మరణపుటురులలో మరువక మొరలిడ
    ఉన్నతదుర్గమై రక్షనశృంగమై.   } 2
    తన ఆలయములో నా మొఱ్ఱ వినెను  } 2
    ఆదరెను ధరణి భయకంపముచే  } 2 || యెహోవా ||

  3. నా దీపమును వెలిగించువాడు
    నా చీకటిని వెలుగుగా చేయును   } 2
    జలరాసులనుండి బలమైన చేతితో } 2
    వెలుపల చేర్చిన బలమైన దేవుడు } 2 || యెహోవా ||

  4. పౌరుషముగల ప్రభు కొపింపగా
    పర్వతముల పునాదులు వణకెను  } 2
    తన నోటనుండి వచ్చిన అగ్ని } 2
    దహించివేసెను వైరులనెల్లన్  } 2 || యెహోవా ||

  5. మేఘములపై ఆయన వచ్చును
    మేఘములను తన మాటుగ జేయును  } 2
    ఉరుముల మెరుపుల మెండుగ జేసి  } 2
    అపజయమిచ్చును అపవాదికిని   } 2 || యెహోవా ||

  6. దయగలవారిపై దయ చూపించును
    కఠినులయెడల వికటము జూపును   } 2
    గర్విష్టుల యొక్క గర్వమునణుచును  } 2
    సర్వమునెరిగిన సర్వాధికారి  } 2 || యెహోవా ||

  7. నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
    ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి  } 2
    రక్షణ కేడెము నాకందించి.   } 2
    అక్షయముగ తన పక్షము జేర్చిన   } 2 || యెహోవా ||

  8. యెహోవా జీవముగల దేవా
    బహుగా స్తుతులకు అర్హుడ నీవే   } 2
    అన్యజనులలో ధన్యత చూపుచు  } 2
    హల్లెలూయ స్తుతిగానము చేసెద  } 2 || యెహోవా ||


Post a Comment

0Comments

Post a Comment (0)