Song no:
- కదిలిందికరుణరథం సాగిందీ క్షమాయుగం
మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపథం
కదిలింది కరుణరథం సాగిందీ క్షమాయుగం
మనిషి కొరకు దైవమే... మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగే కాంతిపథం
కదిలింది కరుణరథం...
మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది
పరిశ ద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది
దీనజనాళికై దైవకుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి
పాప క్షమాపణ పొందిన హృదయాలు
నిలువునా కరిగీ నీరయ్యాయి నీరయ్యాయి
నాయనలారా నాకోసం ఏడవకండి మీకోసం
మీకోసం పిల్లలకోసం ఏడవండి
ద్వేషం అసూయ కార్పణ్యం ముళ్ళకిరీటమయ్యిందీ
ప్రేమ సేవ త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది ఒలికింది
తాకినంతనే స్వస్థతనొసగిన తనువుపై కొరడా ఛెళ్ళంది
అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది
ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా
చెదిరిపోయిన మూగ గొర్రెలు
చెల్లాచెదరై కుమిలాయి
చెల్లాచెదరై కుమిలాయి
పరమ వైద్యునిగ పారాడిన పవిత్ర పాదాలు
నెత్తురు ముద్దగ మారాయి...
అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ధరించి ముద్దాడింది
శిలువను తాకిన కల్వరి రాళ్ళు
కలవరపడి కలవరపడి కలవరపడి అరిచాయి అరిచాయి || ||
No comments:
Post a Comment