Neevu mosina siluvanu nenu dhoshamu chesina నీవు మోసిన సిలువను నేను దోషము చేసిన తులువను కాను

Song no:

    యేసయ్యా... యేసయ్యా...
    యేసయ్యా.. యేసయ్యా..
    నీవు మోసిన సిలువను నేను.. దోషము చేసిన తులువను కాను.. (2)
    సంతషించనా నిను కలిసినందుకు..
    అలమటించనా నిని వీడినందుకు.. || నీవు మోసిన ||

    1. మూడులు విసరగా తగిలెను రాళ్ళు.. చిందిన రుధిరమే ఆనవాళ్ళు.. (2)
    జీవరహితము పొందితి వార్తా..
    జీవన దాత ఎందుకీ వ్యధా.. || నీవు మోసిన ||

    2. దోషులు కసిగా కొరడా విసరగా.. చీలేను దేహమే నాగటి ఛాళ్ళై.. (2)
    సుందర రూప రూపము లేకా..
    ఎండిన భూమిలో మొలిచిన మొక్కా.. || నీవు మోసిన ||
    3. మరణ వేదికనై విలపించితిని.. అరుణ వర్ణమై తరియించితిని.. (2)
    రుధిరం తాకి చిగురించితిని..
    అధరంతోను నిను ముద్దాడితిని.. || నీవు మోసిన ||

Ullasinchi pata pade pavurama ఉల్లాసించిపాటపాడేపావురమా

Song no:

    ఉల్లాసించి పాట పాడే పావురమా
    ఓ.. ఓ... పుష్పమా షారోనుపుష్పమా
    వాగ్దానదేశపు అభిషేకపద్మమా } 2
    లెబానోను పర్వత సౌ०దర్యమా } 2

  1. పాలు తేనెలు ప్రవహించే -పరిమళవాసనలు విరజిమ్ము
    జీవజలాల్లో విహరించి -జీవఫలాలు ఫలియి०చి
    ఉల్లాసించి పాట పాడే పావురామా
    నా పావురమా నా షారోను పుష్పమా
    నా పావురమా నా షాలేము పద్మమా ||ఓ..||

  2. జల్దరు వాసనలు శ్వాసించి -జగతికి జీవము అంది०చి
    సంధ్యారాగము సంది०చి సుమధుర స్వరమును వినిపించు
    ఉల్లాసించి పాట పాడే పావురామా
    నా పావురమా నా షారోను పుష్పమా
    నా పావురమా నా షాలేము పద్మమా

Mukha dharshanam chalayya naku nee mukha dharshanam ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా

Song no:

    ముఖ దర్శనం చాలయ్యా
    నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
    సమీపించని తేజస్సులో
    నివసించు నా దైవమా (2)
    నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

  1. అన్న పానములు మరచి నీతో గడుపుట
    పరలోక అనుభవమే
    నాకది ఉన్నత భాగ్యమే (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

  2. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
    మహిమలో చేరుటయే
    అది నా హృదయ వాంఛయే (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

  3. కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
    గానము చేసెదను
    ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||

    Mukha Darshanam Chaalayyaa
    Naaku Nee Mukha Darshanam Chaalayyaa (2)
    Sameepinchani Thejassulo
    Nivasinchu Naa Daivamaa (2)
    Nee Mukha Darshanam Chaalayyaa (2)
    Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)

  1. Anna Paanamulu Marachi Neetho Gaduputa
    Paraloka Anubhavame
    Naakadi Unnatha Bhaagyame (2)
    Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)

  2. Parishuddha Parachabadi Paripoornatha Nondi
    Mahimalo Cherutaye
    Adi Naa Hrudaya Vaanchaye (2)
    Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)

  3. Kotlakoladi Deva Doothala Samoohamutho Koodi
    Gaanamu Chesedanu
    Prabhuvaa Nithyamu Sthuthiyinthunu (2)
    Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Mukha||

Vadipokamundhey nannu vaduko poddhu valipokamundhey వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే

Song no:

    వాడిపోకముందే నన్ను వాడుకో
    పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో } 2
    వాడుకో యెసయ్యా - నీ కాడి నే మోస్తా  } 2 ||వాడిపోకముందే||

  1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
    నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే } 2 || వాడుకో ||

  2. నీవిచ్చిన జీవితనికి వెలుగులింక పోకముందే
    నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే } 2  || వాడుకో ||

  3. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
     నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే } 2  || వాడుకో ||

  4. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
     నాకున్న అవకాశం చేజారి పోకముందే } 2  || వాడుకో ||

Levanetthu shuddhathmuda levanetthu parishuddhuda లేవనెత్తు శుద్దాత్ముడా లేవనెత్తు పరిశుద్దుడా

Song no:

లేవనెత్తు శుద్దాత్ముడా లేవనెత్తు పరిశుద్దుడా
రోషంఉన్నసేవకులంరోషంఉన్నవిశ్వాసులం

1.ప్రజ్వలించేజ్వలలుగాప్రకాశించేజ్యోతులుగాప్రవహించేఊటలుగాప్రహర్షించేజనములుగాఆరిపోనిదివ్వెలుగాఓడిపోనిసైన్యముగా(2)
లేవనెత్తులేవనెత్తులేవనెత్తుము నడిపించునడిపించునడిపించు (2)
రోషంఉన్న .... 2

శాంతినిచ్చేదూతలుగాసిలువమోసేవీరులుగా సత్యమునకుబాటలుగాకాడిమోసేయోధులుగా పరిమళించేతైలముగాక్రీస్తుయేసునిసాక్షులుగా (2) లేవనెత్తులేవనెత్తులేవనెత్తుము నడిపించునడిపించునడిపించు(2) రోషంఉన్న....

Prematho nee patanu padukovalani charanamai ప్రేమతో నీ పాటను పాడుకోవాలని చరణమై నీపాటలో

Song no:

ప్రేమతో  నీ పాటను పాడుకోవాలని
 చరణమై నీపాటలో నిలిచిపోవాలని
 కుమారునిగా నా తండ్రి నీలో సాగిపోవాలని
 ఆశ నా ఆశ  " ప్రేమతో  నీ పాటను"

1.నీవే ప్రేమై నిలిచినదేవా  నన్నాదరించావు నిండుగా
నాక్షేమమే నీవు కోరగా  ఆనందమే జీవితం ఆనందమే నా జీవితం"2"
ఎంతో పరిశుద్ధము దేవా నీ నామము
ఆశ్రయించి,నిన్నాశ్రయించి గానమే చేసెదా  " ప్రేమతో  నీపాటను "

2. నీవే ఘనత నీవే మహిమ నీవేకదా నాకు సన్నిధి
నీ ప్రేమ నాలోన ఉన్నది నీ కోసమే నా హృది
దేవా నీకోసమే నా హృది "2"
నీవే నా సర్వము నీవే నా విజయము
ప్రేమలోనే నీ ప్రేమలోనే ఉంది సంతోషము " ప్రేమతో  నీ పాటను

Neekanna yevaru vunnarayya lokamlo నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో నాకన్నీ నీవే నా యేసయ్య

Song no:

    నీకన్నా- ఎవరు ఉన్నారయ్యా లోకంలో
    నాకన్నీ నీవే నా - యేసయ్య (2)

    నా తల్లి నీవేనయ్యా - నా తండ్రి నీవేనయ్యా (2)
    మంచి స్నేహితుడైన నీవే - యేసయ్యా
    నిజ బంధువుడైన నీవే - యేసయ్యా (2) || నీకన్నా ||

  1. పాపమందు నేను - పడిపోయి ఉన్న వేళ
    లేవనెత్తినవు - కృప చూపినావు దేవా (2)
    నా పాపము తొలగుటకొరకై రక్తం కార్చితివి
    నన్ను శుద్ధిని చేయుట కొరకై సిలువ సహించితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||

  2. ఆకలైన వేళ  - ఆహారమిచ్చినావు
    దాహమైన వేళ - జీవజలములిచ్చినావు (2)
    నా శాపము తొలగించుటకై సమాధి చేరితివి
    నన్ను మహిమకు మార్చుటకొరకై మరణం గెలిచితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||

  3. వ్యాది యందు నేను - పడి కృంగియున్నవేళ
    పరము నుండి నాకై - దిగి వచ్చినావు దేవా (2)
    నీ గాయములందు ఉన్న స్వస్థత నిచ్చితివి
    నీ రెక్కల క్రింద నన్ను నిత్యము దాచితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||