Sandhadi cheddhama santhoshiddhama సందడి చేద్దామా సంతోషిద్దామా

Song no:
HD
    సందడి చేద్దామా – సంతోషిద్దామా
    రారాజు పుట్టేనని
    గంతులు వేద్దామా – గానము చేద్దామా
    శ్రీ యేసు పుట్టేనని (2)
    మనసున్న మారాజు పుట్టేనని
    సందడి చేద్దామా – సంతోషిద్దామా
    మన కొరకు మారాజు పుట్టేనని
    సందడి చేద్దామా…
    సందడే సందడి…
    సందడే సందడి సందడే సందడి
    సందడే సందడి (4)

  1. బెత్లహేములో సందడి చేద్దామా
    పశుశాలలో సందడి చేద్దామా
    దూతలతో చేరి సందడి చేద్దామా
    గొల్లలతో చూచి సందడి చేద్దామా (2)
    మైమరచి మనసారా సందడి చేద్దామా
    ఆటలతో పాటలతో సందడి చేద్దామా
    శాలలో చేరి క్రీస్తుని చూచి
    సంతోషించి సందడి చేద్దామా
    సందడే సందడి…
    సందడే సందడి సందడే సందడి
    సందడే సందడి (4)

  2. అర్ధరాత్రిలో సందడి చేద్దామా
    చుక్కను చూచి సందడి చేద్దామా
    దారి చూపగ సందడి చేద్దామా
    గొర్రెల విడిచి సందడి చేద్దామా (2)
    మైమరచి మదినిండా సందడి చేద్దామా
    మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా
    శాలలో చేరి క్రీస్తుని చూచి
    సంతోషించి సందడి చేద్దామా
    సందడే సందడి…
    సందడే సందడి సందడే సందడి
    సందడే సందడి (4)

  3. రాజును చూచి సందడి చేద్దామా
    హృదయమార సందడి చేద్దామా
    కానుకలిచ్చి సందడి చేద్దామా
    సాగిలపడి సందడి చేద్దామా (2)
    మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా
    మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా
    శాలలో చేరి క్రీస్తుని చూచి
    సంతోషించి సందడి చేద్దామా
    సందడే సందడి…
    సందడే సందడి సందడే సందడి
    సందడే సందడి (8)
    || goto ||

Yesayya puttinadu ielalona యేసయ్య పుట్టినాడు ఇలలోనా

Song no:
HD
    యేసయ్య పుట్టినాడు ఇలలోనా
    రాజులరాజుగా జన్మించాడమ్మా } 2
    బెత్లహేము పురములోనా బాలయేసుగా
    పశువుల శాలలోన పవళించాడమ్మ } 2 || యేసయ్య ||

  1. కన్యమరియగర్భమందు పుట్టినాడమ్మ
    పాపలోక రక్షుడై వచ్చి నాడమ్మా
    యేసు కన్యమరియగర్భమందు పుట్టినాడమ్మ
    పాపలోక రక్షుడై వచ్చి నాడమ్మా
    ఇమ్మానుయేలుగ తోడుండేయేసయ్య
    ఇహపరలోకాలు సంతోషించే నేడమ్మ } 2
    యేసయ్య పుట్టిన రోజు పండుగ నేడు
    Happy Happy Christmas
    Merry merry Christmas } 2 || యేసయ్య ||

  2. పాపశాప బందకాలు విడుదల నిచ్చే
    యేసయ్య పుట్టాడు భువిపైన నేడు
    పాపశాప బందకాలు విడుదల నిచ్చే
    యేసయ్య పుట్టాడు అవనిలో ఈరోజు
    ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త
    నిత్యుడగుతండ్రి,సమాదానకర్త } 2
    యేసయ్య పుట్టిన రోజుపండగ నేడు
    Happy happy Christmas
    Merry merry Christmas } 2 || యేసయ్య ||

Athyunnatha simhasanamupai aasinudavaina అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా

Yehova nee namamu yetho balamainadhi యెహోవా నీ నామము ఎంతో బలమైనది

Nee mata jeevamu galadhayya yesayya నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా

Palle pallena suvartha panule jaragali పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి

Song no:
HD

l

e

r

పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి   (2)
ప్రజలందరూ ప్రభుని నమ్మాలి – పరలోకమే ఉన్నదని తెలియాలి
మరణించిన మనిషికి బ్రతుకు ఉందని – మహనీయులకు తెలియాలి
క్రీస్తు ద్వారానే స్వర్గముందని – ప్రతి మనిషి తెలుసుకోవాలి  (పల్లె పల్లెనా)
1.పెందలకడ నీవు లేచి – అందరితో నీవు కలిసి
క్రీస్తు మరణం పునరుత్థానం  – ప్రకటించుచు పనులు చేస్తూ
అందమైన లోకముందని  – ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి
నిత్యజీవం పొందుకొనుమని – ప్రకటించుచు సాక్ష్యార్థమై
క్రీస్తేసులా ప్రభుని ఘనపరచి  – జీవితంలోనా మాదిరి చూపి
నిందారహితుడవై క్రియలు చేయుచు  – సత్యముగా బ్రతకాలి
ఎదుటి వారికి మేలు చేయుచు  – కీడు చేయక బ్రతకాలి
పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి
2.గొప్ప గొప్ప సభలు చేసి – వేల మందిని కూర్చోబెట్టి
తండ్రి ప్రేమను తెలియచేసి  – మనిషి ప్రేమ చిన్నదనియు
మనసులోన ఉన్న మలినం  – వాక్యముతో పారద్రోలి
మాయలోకం మనదికాదని  – మంచి అంటే వాక్యమేనని
పేతురు, పౌలులా వాక్యము తెలిపి  – వాస్తవమైనా జీవితం ఉందని
సందేహములో ఉన్నవారిని  – సత్యములో నడపాలి
అగ్నిలో నుండి రక్షించే  – ఆదరణ నీవు చూపాలి
పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి
|| goto ||

Punarudthanuda naa yesayya maranamu gelichi brathikinchithivi పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

Song no:
HD
    పునరుత్థానుడ నా యేసయ్యా ॥2॥
    మరణము గెలిచి బ్రతికించితివి నన్ను॥2॥
    స్తుతిపాడుచు నిన్నే ఘనపరుచుచూ}
    ఆరాధించెద నీలో జీవించుచూ }॥2॥

  1. నీకృప చేతనే నాకు }
    నీ రక్షణ భాగ్యం కలిగిందని }॥2॥
    పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు॥2॥
    నా విమోచకుడవు నివేనని }
    రక్షణానందం నీద్వారా కలిగిందని }॥2॥
    ॥స్తుతపాడుచు॥
  2. నే ముందెన్నడూ వెళ్లని }
    తెలియని మార్గము నాకు ఎదురాయెనే } ॥2॥ సాగిపో నా సన్నిధి }
    తోడుగా వచ్చుననిన }॥2॥
    నీ వాగ్దానమే నన్ను బలపరిచేనే }
    పరిశుద్దాత్ముని ద్వార నడిపించెనే }॥2॥
    ॥స్తుతపాడుచు॥
  3. చెరలోనైనా స్తుతిపాడుచు }
    మరణము వరకూ నిన్ను ప్రకటించేద}॥2॥
    ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ॥2॥
    యేసు మేఘాలపై త్వరగ }
    రానుండగా నిరీక్షణ కోల్పోకు నాప్రాణమా } ॥2॥ ॥స్తుతపాడుచు॥