Palle pallena suvartha panule jaragali పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి

ly
0
Song no:
HD

l

e

r

పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి   (2)
ప్రజలందరూ ప్రభుని నమ్మాలి – పరలోకమే ఉన్నదని తెలియాలి
మరణించిన మనిషికి బ్రతుకు ఉందని – మహనీయులకు తెలియాలి
క్రీస్తు ద్వారానే స్వర్గముందని – ప్రతి మనిషి తెలుసుకోవాలి  (పల్లె పల్లెనా)
1.పెందలకడ నీవు లేచి – అందరితో నీవు కలిసి
క్రీస్తు మరణం పునరుత్థానం  – ప్రకటించుచు పనులు చేస్తూ
అందమైన లోకముందని  – ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి
నిత్యజీవం పొందుకొనుమని – ప్రకటించుచు సాక్ష్యార్థమై
క్రీస్తేసులా ప్రభుని ఘనపరచి  – జీవితంలోనా మాదిరి చూపి
నిందారహితుడవై క్రియలు చేయుచు  – సత్యముగా బ్రతకాలి
ఎదుటి వారికి మేలు చేయుచు  – కీడు చేయక బ్రతకాలి
పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి
2.గొప్ప గొప్ప సభలు చేసి – వేల మందిని కూర్చోబెట్టి
తండ్రి ప్రేమను తెలియచేసి  – మనిషి ప్రేమ చిన్నదనియు
మనసులోన ఉన్న మలినం  – వాక్యముతో పారద్రోలి
మాయలోకం మనదికాదని  – మంచి అంటే వాక్యమేనని
పేతురు, పౌలులా వాక్యము తెలిపి  – వాస్తవమైనా జీవితం ఉందని
సందేహములో ఉన్నవారిని  – సత్యములో నడపాలి
అగ్నిలో నుండి రక్షించే  – ఆదరణ నీవు చూపాలి
పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి
|| goto ||

Post a Comment

0Comments

Post a Comment (0)