Neevu thappa naki lokamlo నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు||
గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)
కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు||
లోకమంత చూచి నను ఏడిపించినా
జాలితో నన్ను చేరదీసిన (2)
ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు||
నా తల్లి నన్ను మరచిపోయినా
నా తండ్రి నన్ను విడచిపోయినా (2)
తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||
Subscribe to:
Posts (Atom)