Deenuda Ajeyuda adharana kiranayama దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా

Song no:
    దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
    పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
    జీవదాతవు నీవని శృతిమించి పాడనా
    జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
    అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
    స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే || దీనుడా ||

  1. సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
    గమనములేని పోరాటాలే తరుముచుండగా
    నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
    హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
    సంతోషము నీవే అమృత సంగీతము నీవే
    స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే || దీనుడా ||

  2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
    నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
    విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
    కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
    కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
    విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా || దీనుడా ||

  3. ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
    స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
    ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
    అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
    ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
    ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా || దీనుడా ||

    Deenudaa ajaeyuDaa aadaraNa kiraNamaa
    poojyuDaa paripoorNuDaa aanaMda nilayamaa
    jeevadaatavu neevani SRtimiMchi paaDanaa
    jeevadhaaravu neevani kaanukanai poojiMchanaa
    akshaya deepamu neevae naa rakshaNa SRMgamu neevae
    svaraarchana chaesida neekae naa stutularpiMcheda neekae || Deenuda ||

  1. sammatilaeni suDiguMDaalae aavariMchagaa
    gamanamulaeni pOraaTaalae tarumuchuMDagaa
    nirupaedanaina naayeDala saMdaehamaemi laekuMDaa
    haetuvaelaeni praema choopiMchi siluvachaaTunae daachaavu
    saMtOshamu neevae amRta saMgeetamu neevae
    stutimaalika neekae vajrasaMkalpamu neevae || Deenuda ||

  2. satya pramaaNamu neravaerchuTakae maargadarSivai
    nityanibaMdhana naatO chaesina satyavaMtuDaa
    virigi naligina manassutO hRdayaarchanae chaesaeda
    karuNaneeDalO kRpaavaaDalO neetO uMTae chaalayyaa
    kartavyamu neevae kanula paMDuga neevaegaa
    viSvaasamu neevae vijayaSikharamu neevaegaa || Deenuda ||

  3. oohakaMdani unnatamainadi divyanagaramae
    spaTikamu pOlina suMdaramainadi neeraajyamae
    aa nagaramae lakshyamai mahimaatmatO niMpinaavu
    amaralOkaana neesannidhilO krotta keertanae paaDedanu
    utsaahamu neevae nayanOtsavaM neevaegaa
    ullaasamu neelO oohalapallaki neevaegaa || Deenuda ||



Nallo Nivasinchey Na Yesayya నాలో నివసించే నా యేసయ్య

Song no:
    నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపాద నీవేనయ్యా } 2
    మారని మమతల మహనీయుడ } 2
    కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య } 2 || కీర్తించి నిన్నే ||

  1. మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం } 2
    నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను } 2
    ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను } 2 || కీర్తించి నిన్నే ||

  2. వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం
    నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే
    ఏమని వర్ణింతును నీ కృపలను || కీర్తించి నిన్నే ||

  3. మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం } 2
    సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింతును } 2
    భువినేలు రాజ నీ నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం || కీర్తించి నిన్నే ||


    Nallo Nivasinchey Na Yesayya - Manohara Sampadha Neveynayya
    Marani Mamathalla Mahaneyuda } 2
    Keerthinchi Niney Ganaparathunayya
    Manasara Niney Preminthunayya !! || Nallo Nivasinchey ||

  1. Madhuramainadhi Ne Sneha Bandham - Mahimaga Nanu Marchina Vainam } 2
    Ne Chupulley Nanu Kachenu - Ne Bahuvey Nanu mosenu } 2
    Yemichi Ne Runamu Ney Therchanu
    Keerthinchi Niney Ganaparathunayya
    Manasara Niney Preminthuanayya || Nallo Nivasinchey ||

  2. Vinayabhavamu Ganathaku Mullam - Nuthana Jeevamullo Nadupu Margam } 2
    Na Vinapam Vinavulley - Arudhinchelley Ne Varamulley } 2
    Yemani Varninthu Ne Krupallanu
    Keerthinchi Niney Ganaparathunayya
    Manasara Niney Preminthunayya !! || Nallo Nivasinchey ||

  3. Mahimagalladhi Ne Dhivya thejam - Thejovasulla Parishuda Swasthyam } 2
    Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu } 2
    Yesayya Ninu chuchi Harshinthuney
    Bhuvinellu Raja Nekey Na Vandhanam
    Dhivinellu Raja Velladhi Vandhanam!! || Nallo Nivasinchey ||

Nalugakunda Godhumalu నలుగకుండ గోధుమలు

Swasthatha Parachu Yehovaa Neeve స్వస్థతపరచు యెహోవా నీవే

Song no:
    స్వస్థత పరచు యెహోవా నీవే
    నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా } 2
    మా ఆరోగ్యం నీవే ఆదరణ నీవే ఆనందం నీవెగా } 2 || స్వస్థత ||

  1. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము
    వదలిపోవును వ్యాధి బాధలన్ని
    శ్రమ పడువారిని సేదదీర్చి
    సమకూర్చుము వారికి ఘన విజయం || స్వస్థత ||

  2. పాపపు శాపము తొలగించుము
    అపవాది కట్లను తెంచివేయుము
    క్రీస్తుతో నిత్యము ఐక్యముగా
    నీ మహిమలో నిత్యము వసింపనిమ్ము || స్వస్థత ||

    Swasthata paracu yehōvā nīvē
    nī raktantō mam'mu kaḍugu yēsayyā} 2
    mā ārōgyaṁ nīvē ādaraṇa nīvē ānandaṁ nīvegā} 2 || svasthata ||

  1. okka māṭa mātraṁ nīvu selavim'mu
    vadalipōvunu vyādhi bādhalanni
    śrama paḍuvārini sēdadīrci
    samakūrcumu vāriki ghana vijayaṁ || svasthata ||

  2. pāpapu śāpamu tolagin̄cumu
    apavādi kaṭlanu ten̄civēyumu
    krīstutō nityamu aikyamugā
    nī mahimalō nityamu vasimpanim'mu || svasthata ||

Solipoyina Manasaa Neevu సోలిపోయిన మనసా నీవు

Song no:
    సోలిపోయిన మనసా నీవు
    సేదదీర్చుకో యేసుని ఒడిలో
    కలత ఏలనో కన్నీరు ఏలనో
    కర్త యేసే నీతో ఉండగా
    ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు } 2
    యేసులో నీ కోరిక తీరునుగా || సోలిపోయిన ||

  1. యేసు ప్రేమను నీవెరుగుటచే
    దూరమైన నీ వారే } 2
    కన్న తల్లే నిను మరచిననూ
    యేసు నిన్ను మరువడెన్నడు } 2

  2. శ్రమకు ఫలితం కానలేక
    సొమ్మసిల్లితివా మనసా } 2
    కోత కాలపు ఆనందమును
    నీకొసగును కోతకు ప్రభువు } 2

  3. ఎంత కాలము కృంగిపోదువు
    నీ శ్రమలనే తలచుచు మనసా } 2
    శ్రమపడుచున్న ఈ లోకమునకు
    క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ } 2

  4. సోలిపోకుము ఓ ప్రియ మనసా
    సాగిపో ఇక యేసుని బాటలో
    కలత వీడు ఆనందించు
    కర్త యేసే నీతో ఉండగా
    కలతకు ఇక చావే లేదు } 2
    యేసు కోరికనే నెరవేర్చు || సోలిపోయిన ||


    Solipoyina Manasaa Neevu
    Sedadeerchuko Yesuni Odilo
    Kalatha Elano Kanneeru Elano
    Kartha Yese Neetho Undagaa
    Prabhuvu Nee Cheyi Veedadu Ennadu } 2
    Yesulo Nee Korika Theerunugaa || Solipoyina ||

  1. Yesu Premanu Neeverugutache
    Dooramaina Nee Vaare } 2
    Kanna Thalle Ninu Marachinanu
    Yesu Ninnu Maruvadennadu } 2

  2. Shramaku Phalitham Kaanaleka
    Sommasillithivaa Manasaa } 2
    Kotha Kaalapu Aanandamunu
    Neekosagunu Kothaku Prabhuvu } 2

  3. Entha Kaalamu Krungipoduvu
    Nee Shramalane Thalachuchu Manasaa } 2
    Shramapaduchunna Ee Lokamunaku
    Kreesthu Nireekshana Neevai Yundaga } 2

  4. Solipokumu O Priya Manasaa
    Saagipo Ika Yesuni Baatalo
    Kalatha Veedu Aanandinchu
    Kartha Yese Neetho Undagaa
    Kalathaku Ika Chaave Ledu } 2
    Yesu Korikane Neraverchu || Solipoyina ||



Neevunnavane nenunnanaya నీవున్నావనే నేనున్నానయ్యా

నీవున్నవనే నేనున్నానయ్యా
నీవున్నావనే జీవిస్తున్నానయ్యా

ఈ లోకంలో నీవు లేకపోతే నేను ఉండగలనా

ఈ లోక ప్రేమలు అశాశ్వతం 
ఈ లోక ప్రేమలు కొంతకాలమే

నీ ప్రేమ ఎడబాయనిది 
నీతో నా బంధం వీడనిది యేసూ

Kraisthavudaa Sainikudaa క్రైస్తవుడా సైనికుడా