Sarvaloka nivasulara sarvadhikarini keerthinchedhamu సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించెదము

Song no: 152

    సర్వలోక నివాసులారా - సర్వాధికారిని కీర్తించెదము రారండి
    యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
    మన సంతోషము - పరిపూర్ణము చేయు
    శాంతి సదనములో నివసింతుము

  1. కరుణా కటాక్షము పాప విమోచన
    యేసయ్యలోనే ఉన్నవి
    విలువైన రక్షణ అలంకారముతో
    దేదీప్యమానమై ప్రకాశించెదము || సర్వలోక ||

  2. ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు
    మన దేవుని సన్నిధిలో ఉన్నవి
    పరిశుద్ధమైన అలంకారముతో
    కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము || సర్వలోక ||

  3. సమృద్ధి జీవము సమైక్య సునాదము
    జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి
    మృదువైన అక్షయ అలంకారముతో
    సద్భక్తితో సాగిపోదము || సర్వలోక ||

Sadhguna seeluda neeve pujyudavu sthuthi aradhanaku సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు

Song no: 159

    సద్గుణ శీలుడా నీవే  పూజ్యుడవు
    స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు
    సత్య ప్రమాణముతో  శాశ్వత కృపనిచ్చి
    నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2

    యేసయ్యా నీ సంకల్పమే
    ఇది నాపై నీకున్న అనురాగమే } 2

  1. సిలువ సునాదమును నా శ్రమదినమున
    మధుర గీతికగా మదిలో వినిపించి } 2
    సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి
    కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2 || యేసయ్యా ||

  2. నాతోడు నీడవై మరపురాని
    మహోప కార్యములు నాకై చేసి } 2
    చీకటి దాచిన -వేకువగా మార్చి
    బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే } 2 || యేసయ్యా ||

  3. నా మంచి కాపరివై మమతా సమతలు
    మనోహర స్థలములలో నాకనుగ్రహించి } 2
    మారా దాచిన మధురము నాకిచ్చి
    నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై } 2 || యేసయ్యా ||

Vandhanalu vandhanalu varalu panche వందనాలు వందనాలు వరాలు పంచే

Song no: 138
HD
    వందనాలు వందనాలు వరాలు
    పంచే నీ గుణ సంపన్నతకు } 2
    నీ త్యాగ శీలతకు నీ వశమైతినే
    అతి కాంక్షనీయుడా నా యేసయ్యా  } 2 || వందనాలు ||

  1. యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా } 2
    యాజక వస్త్రములతో ననుఅలంకరించి
    నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే } 2 || వందనాలు ||

  2. ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము } 2
    నీ వారసత్వపు హక్కులన్నియు
    నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి } 2 || వందనాలు ||


    Vandanaalu Vandanaalu varaalu panche nee guna sampannataku
    Nee tyaagaseelataku nee vasamaitine – ati kaankshaneeyudaa naa yesayyaa /2/vanda/

    2. Yajamaanuda neevaipu – daasudanaina naa kannulettagaa /2/
    Yaajaka vastramulatho nanu alankarinchi – nee unnata pilupunu sthiraparachitive /2/vanda/

    3. Aadyantamuleni amaratvame nee swantamu /2/
    nee vaarasatvapu hakkulanniyu naa aajnanu neraverchaga dayachesitivi /2/vanda/

Lemmu thejarillumu ani nanu utthejaparachina లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన

Song no: 141

    లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా !
    నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
    రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద !

  1. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
    శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి
    ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము || లెమ్ము ||

  2. శ్రమలలో నీను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
    జీవకిరీటమునే పొదుటకే - నను చేరదీసితివి
    ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత || లెమ్ము ||

  3. తేజోవాసుల స్వాస్థ్యము నేను అంభవించుతే నా దర్శనము
    తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నిను చూచి తరింతునే
    ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము || లెమ్ము ||


    lemmu taejarillumu ani - nanu uttaejaparachina naa yaesayyaa !
    ninnae smariMchukonuchu nee saakshigaa prakaaSiMchuchu
    raajaadhiraajuvani prabhuvula prabhuvani ninu vaenOLLa prakaTiMcheda !

    unnata pilupunu nirlakshyaparachaka neetO naDuchuTae naa bhaagyamu
    SaaSvata praematO nanu praemiMchi nee kRpachoopitivi
    idiyae bhaagyamu- idiyae bhaagyamu - idiyae naa bhaagyamu           " lemmu "

    SramalalO neenu iMtavarakunu neetO niluchuTae naa dhanyata
    jeevakireeTamunae poduTakae - nanu chaeradeesitivi
    idiyae dhanyata - idiyae dhanyata - idiyae naa dhanyata                    " lemmu "

Mahaghanudavu mahonnathudavu parishuddha sthalamulone మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే

Song no: 139

    మహాఘనుడవు మహోన్నతుడవు
    పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)

    కృపా సత్య సంపూర్ణమై
    మా మధ్యలో నివసించుట న్యాయమా
    నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)

  1. వినయముగల వారిని
    తగిన సమయములో హెచ్చించువాడవని (2)
    నీవు వాడు పాత్రనై నేనుండుటకై
    నిలిచియుందును పవిత్రతతో (2)
    హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) || మహా ||

  2. దీన మనస్సు గలవారికే
    సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)
    నీ సముఖములో సజీవ సాక్షినై
    కాపాడుకొందును మెళకువతో (2)
    హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) || మహా ||

  3. శోధింపబడు వారికి
    మార్గము చూపించి తప్పించువాడవని (2)
    నా సిలువ మోయుచు నీ సిలువ నీడను
    విశ్రమింతును అంతము వరకు (2)
    హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) || మహా ||

mahaa ghanudavu mahonnathudavu
parishuddha sthalamulone nivasinchuvaadavu (2)
krupaa sathya sampoornamai
maa madhyalo nivasinchuta nyaayamaa
nanu parishuddhaparachute nee dharmamaa (2)
vinayamugala vaarini
thagina samayamulo hechchinchuvaadavani (2)
neevu vaadu paathranai nenundutakai
nilichiyundunu pavithrathatho (2)
hallelooyaa yesayyaa neeke sthothramayaa (2) ||mahaa||

deena manassu galavaarike
samruddhigaa krupanu dayacheyuvaadavani (2)
nee samukhamulo sajeeva saakshinai
kaapaadukondunu melakuvatho (2)
hallelooyaa yesayyaa neeke sthothramayaa (2) ||mahaa||

shodhimpabadu vaariki
maargamu choopinchi thappinchuvaadavani (2)
naa siluva moyuchu nee siluva needanu
vishraminthunu anthamu varaku (2)
hallelooyaa yesayyaa neeke sthothramayaa (2) ||mahaa||

Na sthuthula paina nivasinchuvada నా స్తుతుల పైన నివసించువాడా

Song no: 147

    నా స్తుతుల పైన నివసించువాడా
    నా అంతరంగికుడా యేసయ్యా (2)
    నీవు నా పక్షమై యున్నావు గనుకే
    జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)

  1. నన్ను నిర్మించిన రీతి తలచగా
    ఎంతో ఆశ్చర్యమే
    అది నా ఊహకే వింతైనది (2)
    ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
    ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) || నా స్తుతుల ||

  2. ద్రాక్షావల్లి అయిన నీలోనే
    బహుగా వేరు పారగా
    నీతో మధురమైన ఫలములీయనా (2)
    ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
    విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) || నా స్తుతుల ||

  3. నీతో యాత్ర చేయు మార్గములు
    ఎంతో రమ్యమైనవి
    అవి నాకెంతో ప్రియమైనవి (2)
    నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
    పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) || నా స్తుతుల ||

Prabhuva nee kaluvari thyagamu chupene ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే

Song no: 148

    ప్రభువా నీ కలువరి త్యాగము
    చూపెనే నీ పరిపూర్ణతను
    నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే || ప్రభువా ||

  1. నీ రక్షణయే ప్రాకారములని
    ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2
    లోకములోనుండి ననువేరు చేసినది
    నీదయా సంకల్పమే - 2 || ప్రభువా ||

  2. జీవపు వెలుగుగ నను మార్చుటకే
    పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2
    శాశ్వత రాజ్యముకై నను నియమించినది
    నీ అనాది సంకల్పమే - 2 || ప్రభువా ||

  3. సంపూర్ణునిగా నను మార్చుటకే
    శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2
    పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
    నీ నిత్యసంకల్పమే - 2 || ప్రభువా ||