Nenu padi sthuthinchedhanu na devuni krupanu నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను

Song no:
HD
    నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను } 2
    నా బలం ప్రభు యేసే నా ధైర్యం క్రీస్తేసే
    నా గానం ప్రభు యేసే నా రక్షణ  క్రీస్తేసే
    స్తుతియించెదను ఆరాధింతును అర్పింతును నా సర్వమును } 2

  1. నను ప్రేమించిన యేసయ్యకే ఆరాధనా
    నా పాపం కడిగిన యేసయ్యకే ఆరాధనా } 2
    ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా } 2
    నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను

  2. నాపై కృపచూపిన యేసయ్యకే ఆరాధనా
    నను అభిషేకించిన యేసయ్యకే ఆరాధనా } 2
    ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా } 2

  3. నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను } 2
    నా బలం ప్రభు యేసే నా ధైర్యం క్రీస్తేసే
    నా గానం ప్రభు యేసే నా రక్షణ  క్రీస్తేసే
    స్తుతియించెదను ఆరాధింతును అర్పింతును నా సర్వమును } 2 

Daveedhu kumaruda seeyunu raraja దావీదుకుమారుడా సీయోను రారాజా

Song no:
HD
దావీదు కుమారుడా సీయోను రారాజా
స్తుతులపైనా ఆసీనుడా నా యేసయ్యా } 2

స్తుతి స్తుతి నీకేనయ్యా సర్వోన్నతుడా
స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా } 2

1)ఏ స్థితిలో నేనున్నా స్తుతి నీకే స్తోత్రార్హుడా
ఏ సమయమందైన నిను ఆరాధింతును } 2
మొరపెట్టిన దినములన్నియు ఆలకించి ఆదరించి } 2
పచ్చిక గల చోట్లను నన్ను నిలిపియున్నావు } 2 || స్తుతి స్తుతి ||

2)నిట్టూర్పులో ఉన్నవేళలో నిలువ నీడనిచ్చావు
మారాను మార్చి మధురముగా చేసావు } 2
సిలువ శ్రమలు నాకై నీవు ప్రేమతో భరియించావు } 2
ప్రేమ పంచి చెంతను నిలిచి నీ తట్టు తిప్పావు
మరణించి మృతినే గెలిచి నిత్యజీవమిచ్చావు } 2 || స్తుతి స్తుతి ||

3)ఆదరించు వారు లేక గతి తప్పి నేనుండగా
నీ కృపను నాపై చూపి అక్కున నన్ను చేర్చుకొంటివే } 2
నా అడుగులో నీ అడుగేసి తొట్రిల్లక నను నిలిపి } 2
నీదు సాక్షిగా ఇలలో మాదిరిగా ఉంచావు } 2 || స్తుతి స్తుతి ||

Yevaru samipinchaleni thejassulo nivasinchu ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు

Song no: 123

    ఎవరూ సమీపించలేని
    తేజస్సులో నివసించు నా యేసయ్యా (2)
    నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
    నా కంటబడగానే (2)
    ఏమౌదునో నేనేమౌదునో (2) || ఎవరూ ||

  1. ఇహలోక బంధాలు మరచి
    నీ యెదుటే నేను నిలిచి (2)
    నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
    నిత్యానందముతో పరవశించు వేళ (2) || ఏమౌదునో ||

  2. పరలోక మహిమను తలచి
    నీ పాద పద్మములపై ఒరిగి (2)
    పరలోక సైన్య సమూహాలతో కలసి
    నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) || ఏమౌదునో ||

  3. జయించిన వారితో కలిసి
    నీ సింహాసనము నే చేరగా (2)
    ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
    నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) || ఏమౌదునో ||
    Evaru Sameepinchaleni
    Thejassulo Nivasinchu Naa Yesayyaa (2)
    Nee Mahimanu Dharinchina Parishuddhulu
    Naa Kantabadagaane (2)
    Emauduno Nenemauduno (2)

  1. Iehaloka Bandhaalu Marachi
    Nee Yedute Nenu Nilichi (2)
    Neevichchu Bahumathulu Ne Sweekarinchi
    Nithyaanandamutho Paravashinchu Vela (2)        ||Emauduno||

  2. Paraloka Mahimanu Thalachi
    Nee Paada Padmamula Pai Origi (2)
    Paraloka Sainya Samoohaalatho Kalasi
    Nithyaaraadhana Ne Cheyu Prashaantha Vela (2)        ||Emauduno||

  3. Jayinchina Vaaritho Kalisi
    Nee Simhaasanamu Ne Cheragaa (2)
    Evariki Theliyani O Krottha Perutho
    Nithya Mahimalo Nanu Piliche Aa Shubha Vela (2)        ||Emauduno||

Yenneno mellanu anubhavinchina nenu ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను

Song no: 126
HD
    ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను
    ఏమని ఎన్నని వివరించగలను
    యుగయుగాలలో ఎన్నెన్నో
    అనుభవించవలసిన  నేను  ఆ పౌరత్వము               
    కొరకే పోరాడుచున్నాను ॥2॥ || ఎన్నెన్నొ ||

  1. స్వార్ధప్రియులు కానరానీ వెయ్యేళ్ళ  పాలనలో
    స్వస్ధబుద్ది గలవారే నివసించే రాజ్యమదీ    ॥2॥
    స్థాపించునే అతిత్వరలో నాయేసు ఆరాజ్యమును
    చిత్తశుధ్ధిగలవారే పరిపాలించే రాజ్యమదీ    ॥2॥ || ఎన్నెన్నొ ||

  2. భూనివాసులందరిలో గొర్రెపిల్ల రక్తముతో
    కొనబడిన వారున్న పరిశుధ్ధుల రాజ్యమదీ   ॥2॥
    క్రీస్తుయేసు మూలరాయియై
    అమూల్యమైన రాళ్ళమై ఆయనపై
    అమర్చబడుచూ వృధ్ధినొందుచు సాగెదము ॥2॥ || ఎన్నెన్నొ ||


Asraya dhurgamu neevani rakshana srungamu neevenani ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని

Song no: 137
HD
    ఆశ్రయదుర్గము నీవని
    రక్షణ శృంగము నీవేనని||2||
    నా దాగుచోటు నీవేనని
    నా సమస్తమును నీవేనని||2||

  1. నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక
    నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు
    మరణాంధకారములో బంధించబడిన నీ జనులను
    మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు || ఆశ్రయ ||

  2. నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా
    నీ ఆత్మతో నింపినావు - నాఆత్మకు తృప్తినిచ్చావు
    కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు
    ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు || ఆశ్రయ ||

  3. నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక
    నీ చేతితో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు
    ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను
    జ్ఞాప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు || ఆశ్రయ ||

Asrayadhurgama naa yesayya navajeevana margamuna ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమున

Song no: 150
    ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
    నవజీవన మార్గమున నన్ను నడిపించుమా!
    ఊహించలేనే - నీ కౄపలేని క్షణమును
    కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే 

  1. లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే
    ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే
    అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||

  2. నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే
    నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే
    అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||

  3. పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
    నీ శిక్షణలో అణుకువతోనే నీ కృపపొదెద
    అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||

  4. నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే
    ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది
    స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
    హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా! || ఆశ్రయ ||


    aaSrayadurgamaa naa yesayya
    navajeevana maargamuna nannu naDipiMchumaa!
    oohiMchalaenae - nee kRupalaeni kshaNamunu
    kOpiMchuchunae vaatsalyamu naapai choopinaavae

    lOkamaryaadalu mamakaaraalu gatiMchipOvunae
    aatmeeyulatO akshayaanubaMdhaM anugrahiMchitivae
    aMdukae ee stuti ghana mahimala stOtraaMjali                " aaSraya "

    naatO neevu chaesina nibaMdhanalanniyu neravaerchuchuMTinae
    neetO chaesina teermaanamulu sthiraparachitivae
    aMdukae ee stuti ghana mahimala stOtraaMjali                " aaSraya "

    paravaasinaitini vaagdhaanamulaku vaarasatvamunnanu
    nee SikshaNalO aNukuvatOnae nee kRpapodeda
    aMdukae ee stuti ghana mahimala stOtraaMjali                " aaSraya "

    nityanivaasivai nee mukhamuchoochuchu paravasiMchedanae
    ee nireekshaNayae uttaejamu nalO kaligiMchuchunnadi
    stutighana mahimalu neekae chellunu naa yaesayyaa
    hallaelooyaa - hallaelooyaa - hallaelooyaa!                  " aaSraya "

Aaradhana sthuthi aradhana athmatho sathyamutho ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో

Song no: 186
HD
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన

    తండ్రియైన దేవా-కుమారుడైన ప్రభువా - పరిశుద్దాత్మ దేవా
    త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన } 2

  1. సర్వసృష్టికి ఆధారుడా-సకలజీవుల పోషకుడా } 2
    సీయోనులోనుండి దీవించువాడవు
    సదాకాలము జీవించువాడవు

    సాగిలపడినే నమస్కరించి
    సర్వదా నిను కొనియాడేద-నిన్నే కీర్తించెద } 2 || తండ్రియైన ||

  2. సార్వత్రిక సంఘస్థాపకుడా-సర్వలోక రక్షకుడా } 2
    సిలువలో నీ రక్తమే నాకై కార్చితివి
    శిథిలము కాని నగరమును కట్టితివి

    స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి
    సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును } 2 || తండ్రియైన ||

  3. సర్వసత్యమునకు ఆధారమై-పరిశుద్ధయాజకుల సారధివై } 2
    యాజక రాజ్యములో నను చేర్చుటకై
    నిత్యయాజకత్వమును ధరింపజేసితివి

    మహిమతో పరిచర్య నే చేయుటకై
    నూతన కృపలను నే పొందెద-ఆత్మతో శక్తితో సాగేద } 2 || తండ్రియైన ||