Song no:114
ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము (2) || ఆనందమే ||
- పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే (2) || ఆనందమే ||
- గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే (2) || ఆనందమే ||
- నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు (2)
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము (2) || ఆనందమే ||
Aanandame Paramaanandame
Aashrayapuramaina Yesayyaa Neelo (2)
Aapathkaalamulannitilo Aadarinchina
Akshayudaa Neeke Sthothramu (2) ||Aanandame||
Pachchika Gala Chotla Parunda Jesithive
Jeeva Jalamulu Thraaganichchithive (2)
Naa Praanamunaku Sedadeerchithive
Neethiyu Shaanthiyu Naakichchithive (2) ||Aanandame||
Gaadaandhakaaramu Loyalalo Nenu
Sancharinchinaa Deniki Bhayapadanu (2)
Nee Duddu Karrayu Nee Dandamunu
Anudinam Anukshanam Kaapaadune (2) ||Aanandame||
Naa Shathruvula Yedute Neevu
Naaku Vindunu Siddhamu Chesaavu (2)
Neetho Nenu Nee Mandiramulo
Nivaasamu Cheseda Chirakaalamu (2) ||Aanandame||