Song no: 12
స్తుతులు ఘనసంస్తుతులు నీకే - మతిలో నాతండ్రి-ప్రతి
విషయ ప్రార్దన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి
- ప్రసవవేదన ప్రార్దన చేయు - వాలిమ్ము తండ్రి - నిసుపైన విజ్ఞాపన
ప్రార్దన - నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||
- ఆ స్తితియుంచుము నెరవేరుప - ర్యంతము నా తండ్రి - దుస్థితి
పోవుట భాగ్యములన్నిట - దొడ్డభాగ్యమె నా తండ్రి ||స్తుతులు||
raagaM: -
taaLaM: -
stutulu ghanasaMstutulu neekae - matilO naataMDri-prati
vishaya praardana samayaMbuna - kRtaj~nataa stOtramu taMDri
- prasavavaedana praardana chaeyu - vaalimmu taMDri - nisupaina vij~naapana
praardana - naerpu prasaadiMchumu taMDri ||stutulu||
- aa stitiyuMchumu neravaerupa - ryaMtamu naa taMDri - dusthiti
pOvuTa bhaagyamulanniTa - doDDabhaagyame naa taMDri ||stutulu||
Song no: 11
విజయ సంస్తుతులే నీకు - ప్రేమ స్వరూప - విజయ సంస్తుతులు నీకు = జయము లభించు నీకు - విశ్వమంతట సర్వ దీక్ష - ప్రజల వలన నిత్యమైన - ప్రణుతులు సిద్ధించు నీకు || విజయ ||
- నేడు మాపనులెల్లను దీవించుము - నిండుగా వర్ధిల్లును = చూడవచ్చిన వారికిని బహు - శుభకరముగా నుండునటుల - కీడు బాపుచు మేళ్ళను - సమ కూడ జేసిన నీకే కీర్తి || విజయ ||
- ఆటలాడుకొన్నను నీ నామమున - పాటల్ పాడు కున్నను = నాటకంబుల్ కట్టుకున్నను - నాట్యమాడుచు మురియుచున్నను - కూటములను జరుపుకున్నను - నీటుగను నీ కేను కీర్తి || విజయ ||
- పరలోకమున కీర్తి - దేవా నీకే ధరణియందున కీర్తి = నరుల హృదయములందు కీర్తి - పరమ దూతలందు కీర్తి - జరుగు కారయములందు కీర్తి - జరుగని పనులందు కీర్తి || విజయ ||
(chaaya : stuti chaeya raMDi, raMDi)
vijaya saMstutulae neeku - praema svaroopa - vijaya saMstutulu neeku = jayamu labhiMchu neeku - viSvamaMtaTa sarva deeksha - prajala valana nityamaina - praNutulu siddhiMchu neeku || vijaya ||
- naeDu maapanulellanu deeviMchumu - niMDugaa vardhillunu = chooDavachchina vaarikini bahu - Subhakaramugaa nuMDunaTula - keeDu baapuchu maeLLanu - sama kooDa jaesina neekae keerti || vijaya ||
- aaTalaaDukonnanu nee naamamuna - paaTal^ paaDu kunnanu = naaTakaMbul^ kaTTukunnanu - naaTyamaaDuchu muriyuchunnanu - kooTamulanu jarupukunnanu - neeTuganu nee kaenu keerti || vijaya ||
- paralOkamuna keerti - daevaa neekae dharaNiyaMduna keerti = narula hRdayamulaMdu keerti - parama dootalaMdu keerti - jarugu kaarayamulaMdu keerti - jarugani panulaMdu keerti || vijaya ||
Song no: 10
స్తుతి జేతుము నీకు - దేవ స్తుతి జేతుము నీకు = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము జేయుదమో తండ్రి || స్తుతి ||
- వేడుకొనక ముందే - ప్రార్ధన వినియుంటివి దేవా = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును స్తుతి గానము నీకిలలో || స్తుతి ||
- మనసును నాలుకయు నీకు - అనుదిన స్తుతి జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - ఘనతయు మహిమయు కలుగును గాక || స్తుతి ||
raagaM: kharahara priya
taaLaM: aadi
stuti jaetumu neeku - daeva stuti jaetumu neeku = gatiyiMchenu keeDellanu gaana - stuti gaanamu jaeyudamO taMDri || stuti ||
- vaeDukonaka muMdae - praardhana viniyuMTivi daevaa = naeDunu raepunu ellappuDu sama - kooDunu stuti gaanamu neekilalO || stuti ||
- manasunu naalukayu neeku - anudina stuti jaeyun^ = janaka kumaaraatmalaku stOtramu - ghanatayu mahimayu kalugunu gaaka || stuti ||
Song no: 8
దేవ యెహోవా స్తుతి పాత్రుండ - పరిశుద్ధాలయ పరమ నివాసా || దేవ ||
- బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే = సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతులొనరించగనున్న
|| దేవ ||
- నీదు పరాక్రమ కార్యములన్నియు నిరతము నీవే = నీదు ప్రభావ మహాత్యములన్నియు - నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే || దేవ ||
- స్వర మండల సితారలతోను బూరల ధ్వనితో = తంబురలతో నాట్యములాడుచు - నిను స్తుతియించుచు స్తోత్రము జేసెదము || దేవ ||
- తంతి వాద్య పిల్లన గ్రోవి మ్రోగెడు తాళము = గంభీర ధ్వనిగల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను రారే || దేవ ||
- పరమాకాశపు దూతల సేనలు పొగడగ మీరు = ప్రేమమయుని స్తోత్రము చేయగ - పరమానందుని వేగస్మరించను రారే || దేవ ||
- సూర్య చంద్ర నక్షత్రంబు గోళములారా = పర్వతమున్నగు వృక్షములారా - పశువులారా ప్రణుతించను రారే || దేవ ||
- అగ్నియు మంచును సముద్ర ద్వీప కల్పము లారా = హిమమా వాయువు తుఫానులారా - మేఘములారా మహిమ పరచరారే || దేవ ||
- సకల జలచర సర్వ సమూహములారా = ఓ ప్రజలారా భూపతులారా - మహనీయుండగు దేవుని స్తుతి చేయన్ || దేవ ||
daeva yehOvaa stuti paatruMDa - pariSuddhaalaya parama nivaasaa || daeva ||
- balamunu keertiyu Sakti prasiddhata sarvamu neevae = sakala praaNulu stuti chelliMchaga - sarvada ninu stutulonariMchaganunna
|| daeva ||
- needu paraakrama kaaryamulanniyu niratamu neevae = needu prabhaava mahaatyamulanniyu - nityamu pogaDaga niratamu stOtramulae || daeva ||
- svara maMDala sitaaralatOnu boorala dhvanitO = taMburalatO naaTyamulaaDuchu - ninu stutiyiMchuchu stOtramu jaesedamu || daeva ||
- taMti vaadya pillana grOvi mrOgeDu taaLamu = gaMbheera dhvanigala taaLamulatO - ghanuDagu daevuni keertiMchanu raarae || daeva ||
- paramaakaaSapu dootala saenalu pogaDaga meeru = praemamayuni stOtramu chaeyaga - paramaanaMduni vaegasmariMchanu raarae || daeva ||
- soorya chaMdra nakshatraMbu gOLamulaaraa = parvatamunnagu vRkshamulaaraa - paSuvulaaraa praNutiMchanu raarae || daeva ||
- agniyu maMchunu samudra dveepa kalpamu laaraa = himamaa vaayuvu tuphaanulaaraa - maeghamulaaraa mahima paracharaarae || daeva ||
- sakala jalachara sarva samoohamulaaraa = O prajalaaraa bhoopatulaaraa - mahaneeyuMDagu daevuni stuti chaeyan^ || daeva ||
Song no: 354
క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా
యేసు చెంతకు రమ్ము ప్రియుడా
జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్
- ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చును
నీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవు
యుగ యుగములవరకు
|| క్రీస్తు ||
- ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చును
జీవాహారము భుజించిన - ఆకలిగొనవెప్పుడు
యుగ యుగములవరకు
|| క్రీస్తు ||
- ఆయనే జీవ మార్గము - స్వర్గరాజ్యమును చేరను
ఆయన నంగీకరించిన - తండ్రియొద్దకు చేరెదవు
యుగములు రాజ్య మేలను
|| క్రీస్తు ||
- ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను
నీ వందు ప్రవేశించిన - చేరుదువు నిశ్చయముగ
నిత్యసుఖము లొందెదవు
|| క్రీస్తు ||
- ఆయనే నిత్య సత్యము - సర్వలోకమును రక్షింప
ఆయనను స్వీకరించిన - నిత్య శిక్షనుండి తప్పించున్
సదా ఆయనతో నుందువు
|| క్రీస్తు ||
Song no: 120
హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి } 2
- పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ } 2
పాపుల పాపము తొలగించుటకు } 2
నిత్యజీవము నిచ్చెన్ } 2
|| హృదయ ||
- సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై } 2
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు } 2
నిత్య నిరీక్షణ నిచ్చెన్ } 2
|| హృదయ ||
- ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే } 2
తిరిగి వెళ్ళకు పాపమునకు } 2
నిలువకు పాపములో } 2
|| హృదయ ||
- అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం } 2
కాపాడు మా జీవితముల } 2
ఇదియే మా వినతి } 2
|| హృదయ ||
Song no: 202
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ } 2
అనుపల్లవి : గడచిన కాలమెల్ల - కంటిపాపవలె } 2
కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ } 2|| స్తోత్రించి ||
- పాపమును బాపినాడు హల్లెలూయ - మన
శాపమును మాపినాడు హల్లెలూయ } 2
కన్నతల్లివలెనె - కనికరించెను మమ్ము } 2
యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రించి ||
- తల్లియైన మరచినను హల్లెలూయ - తాను
ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ } 2
ఎల్ల యీవుల నిచ్చి యుల్లాస మొసగును } 2
కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రించి ||
- శోధన కాలములందు హల్లెలూయ - మన
వేదన కాలములందు హల్లెలూయ } 2
నాథుడు యేసు మన చెంతనుండ నిల
} 2
చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రించి ||
- ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు
ఘోరముగ లేచినను హల్లెలూయ } 2
దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి } 2
ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
|| స్తోత్రించి ||
- సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను
సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ } 2
చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు } 2
చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్
|| స్తోత్రించి ||