Papam bali korithey thana sodharulamdharininani thane పాపం బలికొరితే తన సోదరులందరిననీ

పాపం బలికొరితే...తన సోదరులందరిననీ...
తానే బలి ఆయెను...ఆత్యాగం ఎందుకనీ
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు...
యేసు వలె నీ బ్రతుకులోన చూపించు...
తన దేహమునే రొట్టెలు ముక్కలు గావించి.
నీ ఆకలి తీర్చే ఆహారంగా అందించి.
తన రక్తమునే ద్రాక్షారసముగ చిందించి...
నీ దాహం తీర్చే పానీయముగా అర్పించి..
బలైపోయాడు ప్రభువు సిలువలో.
బలికోరుతున్నాడు అదే ప్రభువు నీ బ్రతుకులో.
ఇదే ఇదే ప్రభువు బల్ల పరమార్థం||2||
      ||పాపం||

దేవుని స్వరూపం ఎందుకునీ...
సమానంగా ఉన్నాగాని..
విడువలేనిదా భాగ్యమని...
ఎంచుకొనక తగ్గించుకొని..ఆ.ఆ.|2|
దాసుని స్వరూపము ధరించుకొని..
తనను తానే రిక్తుని చేసుకొని..
సిలువమరణమునకప్పగించుకొని..
విధేయతను తను కనుపరచుకొని...
ఆకారంలో మనుష్యుడుగా కనిపించాడు.
పానార్పణముగాతానే పోయబడినాడు.
ప్రాణము లక్ష్యము చేయక నీకై నిలిచాడు..
నీ పాపములకు ప్రాయాచిత్తంచేశాడు..
ప్రాణం పెట్టాడు ప్రభువు ప్రేమతో..
ప్రాణం పెట్టబద్ధులు అంటున్నాడు తన వారితో..||ఇదే||

రొట్టె పట్టుకుని విరిచాడు...శిష్యులందరికి ఇచ్చాడు....
ద్రాక్షారసమును పంచాడు....పనిని జ్ఞాపకం చేశాడు....
వివేచనతో తిని తాగమన్నాడు...
సువార్త భారం మోయమన్నాడు...
ప్రాణాన్నే ద్వేషించమన్నాడు ...
తనను పోలి జీవించమన్నాడు..
పాపుల పాదాలే పరిశుద్ధుడు కడిగాడు...
నీ కొరకై తానెంతో తగ్గించుకున్నాడు...
తన రూపాన్నే నీలో చూడాలన్నాడు ..
అందుకే తనను తిని త్రాగమన్నాడు...
లోకమందు ఉన్నదా ఇంతటి ప్రేమా..
ఈ ప్రేమ లేకపోతే ఇది క్రైస్తవ్యమా?...||ఇది||

Nuthana yerushalem na gruhamu yeppudu velli నూతనయెరూషలేం నా గృహము ఎప్పుడువెళ్లి నే చేరెదను

నూతనయెరూషలేం నా గృహము
ఎప్పుడువెళ్లి నే చేరెదను
రారాజునగరమే ఆ పురము రమ్యమైన సీయోనే!
దానిఉన్నత వాస స్థలము
చరణములు

1.స్పటికమువలె బంగారు వీధులు
ముత్యపుగుమ్మముల్ ఆ పట్టణముకు
ధగధగమెరుయును దానిలో వెలుగు
దానిలోచేరుటే నా హృదయ వాంచ (నూతన)

2.క్రీస్తు యేసే మూలరాయిగాను
అపోస్తులేపునాదుల రాళ్లగా కట్టిరి
అమూల్యరత్నములతో అలంకరింపబడె
ఆరమ్య నగరమే నా నిత్యవాసం  (నూతన)

౩.దుఃఖమువేదన కన్నీరే లేదు
ఆదేసమునందు మరణమే లేదు
నాప్రతి బాష్పబిందువు తుడుచున్
నాదేవునితోనే కాపురముండెదన్  (నూతన)

4.ఆ నగరములో ప్రకాశించుటకు
సూర్యచంద్రులుదానిలో లేరు
గొఱ్ఱెపిల్లప్రభుయేసే దానిలో దీపము
పెండ్లికుమర్తెగామహిమలో వసింతున్ (నూతన)

5. సీయోను సౌందర్యం ఆ నగర మహిమ
సీయోనేశాశ్వత శోభాతిశయము
ఆదివ్య పురములో చేర్చుము త్వరగా
ఆకాంక్షతోనేను కనిపెట్టి జీవింతున్ (నూతన)

Nuthana yerushalem dhigi vacchuchunnadhi నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది

Song no: 51

    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
    స్వర్గమునందున్న- దేవుని యొద్దనుండి
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 

  1. శోభ కలిగిన - ఆ దివ్య నగరము
    వర్ణింప శక్యము - కానిదియే -2
    బహు సహస్రముల - సూర్యుని కంటె -2  
    ప్రజ్వలించుచున్నది - మహిమవలెను
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

  2. పరిపూర్ణమైన -సౌందర్యమును .
    పృథ్వికి - ఆనందముగాను -2 
    భూరాజులందరు - మహిమ తెచ్చెడి -2  
    మహిమగల నగరము – ఇదియే
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

  3. ధగధగ మెరయు - సూర్యకాంతం వలె  
    జ్వలించుచున్న- దైవనగరమందు -2  
    నీతిమంతులే - సూర్యునివలెను -2  
    నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

Nuthnavathstharam vinuthnavathsaram yethenchi yunnadhi నూత్నవత్సరం వినూత్నవత్సరం ఏతెంచియున్నది మనకోసం

నూత్నవత్సరం వినూత్నవత్సరం
ఏతెంచియున్నది మనకోసం
చిరుచీకి తెరలు తీసిపారిపోవగా
తొలిభానుడు తొంగిచూసి పలకరించగా
అ.ప. : హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయయంచుసాగిపోదామా
ఇన్నినాళ్ళలో మనలగాచిన
కృపలుతలచుకుంటూ నడచిపోదామా

1. మరలమరలవత్సరాలువచ్చుచున్నవి
పాతగిలిపోయిమరలిపోవుచున్నవి
దినదినమున నూతనమైన కృపలుకురియుచు
దాయాకిరీటములు మనకుఅమరుచున్నవి

2. గడియగడియగడచుచుగతియించుచున్నది
యేసురాజురాకడ ఏతెంచనున్నది
గడువుపెట్టక ఇంకతడవుచేయక
వడివడిగాసంధింపను సిద్ధాపడుదామా.

Nuthana keerthana padedhanu deva ninu koniyadedhanu నూతన కీర్తన పాడెదను దేవా నిను కొనియాడెదను

నూతన కీర్తన పాడెదను దేవా నిను కొనియాడెదను అన్నివేళలో- అన్ని తావులలో 
నీ మేళ్ళను తలుచుకుంటూ- నీవే దయాలుడవంటూ

1.అనుదినము నీ  రక్షణవార్తను ప్రకటన చేసెదను     అన్యజనులలో నీ మహిమనునీ ప్రచురము చేసెదను     నీ నామమునకు తగిన మహిమును చెల్లించెదను    
నీ ఆవరణములలో చేరి నిను సెవించెదను

2. జనములలో నీ ఆశ్చర్యక్రియలను తెలియజేసెదను     పరిశుద్ధమైన నీ నామములో సంతోషించెదను    
నీ  పాదపీటము ఎదుటస్తుతలనర్పించెదను    
నీ గుణములను పాడినమస్కరించెదను

Nadipinchuchunnadu najareyudu nadaka nerppuchunnadu నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు

నడిపించుచున్నాడు నజరేయుడు
నడక నేర్పుచున్నాడు ననువిడువని డేవుడు (2)
గాడాందకారములైన కన్నీటిలోయలైన
కష్టాల తీరములైన కటినమైన మార్గములైనా |నడిపిం |

1.నాకాళ్లు తడబడగా నడువలేక నిలబడగా (2)
అడుగులో అడుగేసి చేతిలోచెయ్యేసి (2)
ఊసు చెప్పినాడు బాస చేసినాడు  
బాస చేసినాడు ఊసు చెప్పినాడు
ఆదరించే దేవుడు నాయోసయ్యా
ఆశీర్వదించే దేవుడు నాయేసయ్యా (2) | నడిపిం |

2.ముదిమిలో బలముడిగీ నిలువలేక తూలిపోగా (2)
చంకలో ఎత్తుకొనీ ముద్దులతో ముంచెత్తీ (2)
ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు
ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా
ప్రేమచూపే దేవుడు నా యేసయ్యా (2) | నడిపిం |

Chintha yendhukamma yesayy chentha vundaga చింత ఎందుకమ్మా యేసయ్య చెంత ఉండగా

చింత ఎందుకమ్మా యేసయ్య చెంత ఉండగా
దిగులు ఎందుకమ్మా దారిచూపే దైవము ఉండగా |2|
కన్నీరే పన్నీరవ్వదా తన కృప ఉంటే నీ తోడుగా
చీకటి బ్రతుకున నీవు చూడగలవు వెలుగుల పండగ |2|
విడిచిపెట్టుము నీ భయము ఇక యేసయ్య తోడు కడదాకా|2|
నీ భారము యెహోవా మీద మోపుము..మోపుము..
ఆయనే నిన్ను ఆదుకొనును..ఆదుకొనును

గాయపరచకుంటే  వెదురు వేణువవ్వద్దులే
ఆ గాయాలలో నుండే స్వరములెన్నో వచ్చునులే |2|
గుండె గాయాన్ని తలచి వేదనను రేపుకోకూ |2|
దేవుని సన్నిధి చేరి వాక్యంతో ఆదరణ పొందు
సువార్త స్వరమును పలికి వేణువుగా మ్రోగుతావు
సత్యమార్గాన్ని చూపే సాధనంగా వెలుగొందుతావు
         |చింత ఎందుకమ్మా|

రాగాలు పలుకని వీణగా మిగిలి పోయినా
బంధాల తీగలన్ని తెగిపడి చేదిరిపోయినా|2|
కలలు కన్నీరైపోతే లోకాన్ని విడిచిపోకు |2|
ప్రేమను పంచె దైవం చేతులు చాపెను నీ కొరకు
యేసయ్య శాశ్వత ప్రేమతో బంధాలను ఐక్యాపరచును
నిన్ను ప్రేమతో తాకి చింతను తొలగించును
         |చింత ఎందుకమ్మా|