Rangu rangula lokamura chusthu chusthu vellamakura రంగు రంగులా లోకమురా చూస్తూ చూస్తూ వెల్లమాకురా

రంగు రంగులా లోకమురా
చూస్తూ చూస్తూ వెల్లమాకురా
ఆడపిల్లను ఎరగా చూపుతుందిరా
అందమైన జీవితం కాల్చుతుందిరా " 2 "
నీ కన్నవారి కళలను తుడిచేయకురా
నవమాసాలు మోసిన తల్లిని
మరచిపోకురా      " 2 " " రంగురంగులా "

నిను సృష్టించిన ఆదేవుడే
నిను చూసి దుఃఖించుచున్నాడురా
నీవు చేస్తున్న పాపములను చూస్తూ
అనుక్షణము కుమిలిపోతున్నాడుగా " 2 "
తన పోలికలో నిను చూడాలని
ఆశించి నిను సృష్టించాడుగా
నిను రక్షణలో నడిపించాలని
నీకై సిలువలో ప్రాణం విడిచాడుగా   " 2 "
                                 " రంగురంగులా "

నీ తలిదండ్రుల ప్రేమను మరచి
నీ ప్రేయసి కోసం పరితపిస్తున్నావుగా
నిన్ను కన్న పేగును తెంచుకుని
లోకాశలతో బ్రతుకుతున్నావుగా       " 2 "
ఈ లోక ప్రేమలో పడబోకురా
ఏ క్షణమైనా బలితీస్తుందిగా
దేవుని ప్రేమను రుచి చూసావంటే
నిను పరమునకు చేరుస్తుందిగా        " 2 "
                                " రంగురంగులా "

Janminchenu janminchenu loka rakshakudesu జన్మించెను జన్మించెను లోక రక్షకుడేసు

జన్మించెను జన్మించెను లోక రక్షకుడేసు
అపవాది క్రియలను లయపరచను 
దైవ పుత్రుడు భువిపై            " 2 "
కన్య మరియ గర్భమున
ఇమ్మానుయేలను నామమున" 2 "
పాప శాప రోగములపై
మనకు విజయము నిచ్చుటకై " 2 " 
                                  " జన్మించెను "
దావీదు పురము నందు
నేడు రక్షణ వచ్చేనంటూ          " 2 "
దూత తెల్పెను గొల్లలకు ప్రభు
వార్త జనులకు చాట మనుచూ " 2 "
కన్య మరియ గర్భమునా
ఇమ్మానుయేలను నామమునా"2"
పాప శాప రోగములపై
మనకు విజయము నిచ్చుటకై "2" 
                                " జన్మించెను "
తూర్పు జ్ఞానులు ప్రభుని కనుగొని
హృదయమార ప్రస్తుతించగా" 2 "
మరణచ్చాయల నుండి విడుదల
పొందిరి నిజ జ్ఞానులైరి        " 2 "
కన్య మరియ గర్భమునా
ఇమ్మానుయేలను నామమునా "2"
పాప శాప రోగములపై
మనకు విజయము నిచ్చుటకై " 2 " 
                              " జన్మించెను "

Sarwaloka nadhude paparahitha purnudai సర్వలోక నాధుడే పాపరహిత పూర్ణుడై

సర్వలోక నాధుడే పాపరహిత పూర్ణుడై
మానవాళి కొరకై ఇలా పుట్టినాడు
పరిశుద్ద జనకుడు పరమాత్మరూపుడే
నిన్ను నన్ను రక్షించ వచ్చినాడే

సర్వ భూజనులారా చప్పట్లు కొట్టుచు
శ్రీ యేసు జననాన్ని ప్రకటించుడి
సర్వ భూజనులారా గానాలు చేయుచు
సందడిగా ఆ నాధుని కొనియాడుడి     / సర్వలోక/

గోల్లలకు దూత తెల్పెశుభవర్తమానం
నింగిలోని తార తెలిపే జ్ఞానులకు మార్గం/2/
సూచనగా ఈ మరియ తనయుడు
ఇమ్మానుయేలుగా ఇలాకేగెను/2/
      /సర్వభూజనులా/
      /సర్వలోక నాధుడు/
సింహాసనం విడచి పరమ సౌఖ్యం మరచి
దీనుడుగా జన్మించి శ్రీయేసు నాదు/2/
పరవశించి పాడిరి దూతగణములు
రారాజే నరుడై ఏతెంచెనని/2/
     /సర్వభూజ//
     / సర్వ లోక నాధుడే/
సర్వలోక నాధుడే ....పాపరహితుడు
మానవాళికి....

Bethlehemulo na chinna yesu బేత్లెహేములో నా చిన్ని యేసు

బేత్లెహేములో నా చిన్ని యేసు...
దూతగానంతో నా చిన్ని యేసు....
లోకాన్నేలే నా చిన్ని యేసు...
అతి సుందరుడు యేసయ్య /2/

నాలో పాపాన్నితొలగించి...
శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
నాలో పరిశుద్ధత నింపి
శక్తితో నన్నునడిపి గమ్యాన్ని చేరుస్తాడు
రారాజు నా యేసు వెలశాడు  ఈరోజు ||2||

మనసున్నవాడు నా మంచి యేసు
మనుష్యకుమారుడు నా మంచి యేసు
మహోపకారుడు నా మంచి యేసు
మానవాళి రక్షిప వచ్చాడే   ||2||   /నాలో పాపాన్ని/


నన్ను ప్రేమించే నా మంచి యేసు
నన్ను బ్రతికించెను నా మంచి యేసు
నన్ను కొనిపోవా నా మంచి యేసు
నాకొసమే ఇలా వచ్చాడే    ||2||   /నాలో పాపాన్ని/

పరిశుద్ద దేవుడు నా మంచి యేసు
పాపిని క్షమించును నా మంచి యేసు
పరలోకం చేర్చును నా మంచి యేసు
పరమ రక్షకుడు వచ్చాడే    ||2||
నాలో పాపాన్ని తొలగించి...
శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
నాలో పరాశుద్ధత నింపి
శక్తితోనన్ను నింపి గమ్యాన్ని చేరుస్తాడు
బాధలు పక్కన పెట్టి యేసయ్యకు జై కొట్టు
బాధలు పక్కన పెట్టి యేసయ్య ముచ్చట్లు చెప్పు ||2||
           /నాలో పాపాన్ని/

Vandhanalu yesu neeke vandhanalu వందనాలు యేసు నీకే వందనాలు యేసు

వందనాలు యేసు నీకే వందనాలు యేసు
కాంటిపాపలా కాచినందుకు వందనాలు యేసు కన్నతండ్రిలా సాకినందుకు వందనాలు యేసు/2/

1.నిన్న నేడు ఎన్నడు మారని
మా మంచివాడా యేసు నీకే వందనం/2/
మంచివాడా మంచి చేయువాడా
నీ హస్తాలతో నన్ను చెక్కుకుంటివి/2/
    /వందనాలు/

2.దీనా దశలో నేను ఉన్నప్పుడు
నా నీడ నన్ను విడిచి పోయినప్పుడు/2/
చెంత చేరి నా చింత తీర్చి
నీ వింతైన ప్రేమలో ముంచెత్తితివి/2/
     /వందనాలు యేసు/

Bosi navvula chinnari yesayya peavalinchinava pasula salalo బోసి నవ్వుల చిన్నారి యేసయ్యా

బోసి నవ్వుల చిన్నారి యేసయ్యా
ప్రవళించినావా పశుల శాలలో    || 2 ||
రారాజువు నీవే  మమ్మనేలు వాడనీవే  || 2 ||
రక్షించువాడవు పరముకుచేర్చు వాడవు   || 2 ||
చింత లేదు నీవు ఉండగా  || బోసి నవ్వుల ||

వేదన లేదు దుఃఖము లేదు
దీనుల కన్నీరు తుడిచావయ్యా   || 2 ||
కన్య మరియ ఒడిలో పసిపాపల
చిరునవ్వు చల్లగా వినిపించగా   || 2 ||
దూత సైన్యమే  స్తోత్రములు చేసిరి-
యుదులరాజు వచ్చేనని చాటిరి    || 2 ||
శ్రమలన్నీ తీరేను రక్షణ దొరికేను
మా హృదయాలు పరవశించెను
                   / బోసినవ్వుల/

సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు
దోషము లేని ప్రేమనీదయ్యా    || 2 ||
దివిని వీడి భువికి నరావతారిగా
పరమతండ్రి తనయుడై అవతరించగా    || 2 ||
జ్ఞానులు గొల్లలు నిన్ను పూజించిరి
కానుకలర్పించి నిన్ను స్తుతించారు     || 2 ||
శ్రమలన్నీ తీరేను రక్షణ దొరికేను
మా హృదయాలు పరవశించెను/ బోసి/

Thurupu dhikkuna chukka butte dhutalu pataalu pada vacche తూరుపు దిక్కున చుక్క బుట్టేదూతలు పాటలు

Song no:
HD
    తూరుపు దిక్కున చుక్క బుట్టే
    దూతలు పాటలు పాడ వచ్చే } 2
    చలిమంట లేకుండా వెలుగే బుట్టే } 2
    చల్లని రాతిరి కబురే దెచ్చే } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2

  1. గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
    కొలిచినారు తనకు కానుకలిచ్చి
    పశువుల పాక మనము చేరుదాము
    కాపరిని కలిసి వేడుదాము } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు/2/

  2. చిన్నా పెద్దా తనకు తేడా లేదు
    పేదా ధనికా ఎపుడు చూడబోడు
    తానొక్కడే అందరికి రక్షకుడు
    మొదలు నుండి ఎపుడు వున్నవాడు } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2

  3. మంచి చెడ్డ ఎన్నడూ ఎంచబోడు-
    చెడ్డవాళ్లకు కూడా బహు మంచోడు
    నమ్మి నీవు యేసును ఆడిగిచూడు-
    తన ప్రేమను నీకు అందిస్తాడు } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2 || తూరుపు దిక్కున ||