Sarwaloka nadhude paparahitha purnudai సర్వలోక నాధుడే పాపరహిత పూర్ణుడై

సర్వలోక నాధుడే పాపరహిత పూర్ణుడై
మానవాళి కొరకై ఇలా పుట్టినాడు
పరిశుద్ద జనకుడు పరమాత్మరూపుడే
నిన్ను నన్ను రక్షించ వచ్చినాడే

సర్వ భూజనులారా చప్పట్లు కొట్టుచు
శ్రీ యేసు జననాన్ని ప్రకటించుడి
సర్వ భూజనులారా గానాలు చేయుచు
సందడిగా ఆ నాధుని కొనియాడుడి     / సర్వలోక/

గోల్లలకు దూత తెల్పెశుభవర్తమానం
నింగిలోని తార తెలిపే జ్ఞానులకు మార్గం/2/
సూచనగా ఈ మరియ తనయుడు
ఇమ్మానుయేలుగా ఇలాకేగెను/2/
      /సర్వభూజనులా/
      /సర్వలోక నాధుడు/
సింహాసనం విడచి పరమ సౌఖ్యం మరచి
దీనుడుగా జన్మించి శ్రీయేసు నాదు/2/
పరవశించి పాడిరి దూతగణములు
రారాజే నరుడై ఏతెంచెనని/2/
     /సర్వభూజ//
     / సర్వ లోక నాధుడే/
సర్వలోక నాధుడే ....పాపరహితుడు
మానవాళికి....
Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages