-->

Rangu rangula lokamura chusthu chusthu vellamakura రంగు రంగులా లోకమురా చూస్తూ చూస్తూ వెల్లమాకురా

రంగు రంగులా లోకమురా
చూస్తూ చూస్తూ వెల్లమాకురా
ఆడపిల్లను ఎరగా చూపుతుందిరా
అందమైన జీవితం కాల్చుతుందిరా " 2 "
నీ కన్నవారి కళలను తుడిచేయకురా
నవమాసాలు మోసిన తల్లిని
మరచిపోకురా      " 2 " " రంగురంగులా "

నిను సృష్టించిన ఆదేవుడే
నిను చూసి దుఃఖించుచున్నాడురా
నీవు చేస్తున్న పాపములను చూస్తూ
అనుక్షణము కుమిలిపోతున్నాడుగా " 2 "
తన పోలికలో నిను చూడాలని
ఆశించి నిను సృష్టించాడుగా
నిను రక్షణలో నడిపించాలని
నీకై సిలువలో ప్రాణం విడిచాడుగా   " 2 "
                                 " రంగురంగులా "

నీ తలిదండ్రుల ప్రేమను మరచి
నీ ప్రేయసి కోసం పరితపిస్తున్నావుగా
నిన్ను కన్న పేగును తెంచుకుని
లోకాశలతో బ్రతుకుతున్నావుగా       " 2 "
ఈ లోక ప్రేమలో పడబోకురా
ఏ క్షణమైనా బలితీస్తుందిగా
దేవుని ప్రేమను రుచి చూసావంటే
నిను పరమునకు చేరుస్తుందిగా        " 2 "
                                " రంగురంగులా "

Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts