Padana mounamugane stuthi keerthana పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి

Song no: 150
పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి - నీ పరాక్రమ కార్యములు = 2
యేసయ్యా నీతో సహజీవనము - నా ఆశలు తీర్చీ తృప్తి పరచెనే - 2

1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును = 2
నా విమోచనా గానము నీవే - నా రక్షణ శృంగము నీవే - 2

2. దీర్ఘ శాంతమూ - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే - నా వ్యామోహపు పొంగులన్నియూ = 2
నా ఓదార్పు నిధివీ నీవే - నా ఆనంద క్షేత్రము నీవే - 2

3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే
నీ తైలాభిషేకము నిండెనే - నా అంతరంగమంతయునూ = 2
నా మానస వీణవు నీవే - నా ఆరాధన పల్లకి నీవే - 2

Natho neevu matladinacho ne brathikedhanu prabho నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో నా ప్రియుడా


Song no:
నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో
నా ప్రియుడా.. నా స్నేహితుడా
నా ప్రాణనాధుడా ..... నా రక్షకా ఆ.. ఆ.. ఆ..

తప్పిపోయినను తరలి తిరిగినను
దొడ్డినుండి వేరై హద్దు మీరినాను
ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం
ఒక్కమాట చాలు || 3 || ప్రభో  ఆ.. ఆ..

చచ్చియుండి నేను చుట్టబడితి నేను
ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్
కానలేదు నిన్ను కానరాదు గమ్యం
లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నియాన్
ఒక్కమాట చాలు || 3 || ప్రభో  ఆ.. ఆ..

యుద్ధమందు నేను మిద్దిమీద నుండి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను
బుద్ధి వీడినాను హద్దు మీరినను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
 ఒక్కమాట చాలు || 3 || ప్రభో  ఆ.. ఆ..

కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను
వీడె నీదు ఆత్మ వీడె నీదు స్నేహం
గుడ్డి వాడనైతి తిరుగాలిసురుచుండి
దిక్కు లేకనే నీ దయను కోరుచుంటి
 ఒక్కమాట చాలు || 3 || ప్రభో  ఆ.. ఆ..

Papaniki naku ye sambandhamu ledhu పాపానికి నాకు ఏ సంబంధము లేదు

Song no:
    పాపానికి నాకు ఏ సంబంధము లేదు
    పాపానికి నాపై ఏ అధికారము లేదు
    పాపానికి నాకు ఏ సంబంధము లేదు
    పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు
    నా పాపములు అన్నీ నా ప్రభువు ఏనాడో క్షమియించి వేశాడుగా!
    మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట యిచ్చాడుగా!

    || నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద
    నే లేను నే లేను ధర్మశాస్త్రం క్రింద ||

  1. 1. కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు!
    కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు!
    కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు!
    కృప ఉందని నీతిని విడువొచ్చా!! – No
    కృప అంటే license కాదు, కృప అంటే freepass కాదు, పాపాన్ని చేసేందుకు!
    కృప అంటే దేవుని శక్తి, కృప అంటే దేవుని నీతి, పాపాన్ని గెలిచేందుకు!

    Grace is not a licence to sin
    it’s the power of God to overcome

  2. కృప ద్వారా ధర్మశాస్త్రముకు మృతుడను అయ్యా!
    కృప వలన క్రీస్తులో స్వాతంత్ర్యం నే పొందితినయ్యా!
    కృప ద్వారా ధర్మశాస్త్రముకు మృతుడను అయ్యా!
    కృప వలనే క్రీస్తులో స్వాతంత్ర్యం!!
    క్రియల మూలముగా కాదు, కృపయే నను రక్షించినది, నా భారం తొలగించినది
    కృప నన్ను మార్చేసినది, నీతి సద్భక్తులతోడ బ్రతుకమని బోధించినది

    Grace took away burden from me
    and taught me to live righteously

  3. పాపానికి మృతుడను నేనయ్యా! – హల్లెలూయా!
    కృప వలనే యిది నాకు సాధ్యం అయ్యిందిరా భయ్యా!
    పాపానికి మృతుడను నేనయ్యా! – హల్లెలూయా!
    కృప వలనే యిది నాకు సాధ్యం!!
    కృపను రుచి చూచిన నేను, దేవునికే లోబడుతాను, పాపానికి చోటివ్వను
    పరిశుద్ధత పొందిన నేను, నీతి సాధనములుగానే, దేహం ప్రభుకర్పింతును

  4. Yield your bodies (members) unto the Lord
    as instruments of righteousness

  5. ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
    ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు
    ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
    ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా!! – No
    ధర్మశాస్త్రం కొంతకాలమేగా, ధర్మశాస్త్రం బాలశిక్షయేగా, ప్రభునొద్దకు నడిపేందుకు!
    క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా, ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా, మనలను విడిపించేందుకు!

E dhinam sadha naa yesuke somtham ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత

Song no:
    ఈ దినం సదా నా యేసుకే సొంతం
    నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును } 2
    రానున్న కాలము – కలత నివ్వదు } 2
    నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును || ఈ దినం ||

  1. ఎడారులు లోయలు ఎదురు నిలచినా
    ఎన్నడెవరు నడువని బాటయైనను } 2
    వెరవదెన్నడైనను నాదు హృదయము } 2
    గాయపడిన యేసుపాదం అందు నడచెను } 2  || ఈ దినం ||

  2. ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
    యుద్ధకేక నా నోట యేసు నామమే
    విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
    యెహోవా నిస్సియే నాదు విజయము || ఈ దినం ||


Song no:
    Ee Dinam Sadaa Naa Yesuke Sontham
    Naa Naadhuni Prasannatha Naa Thoda Nadachunu } 2
    Raanunna Kaalamu – Kalatha Nivvadu } 2
    Naa Manchi Kaapari Sadaa – Nannu Nadupunu } 2       || Ee Dinam ||

  1. Edaarulu Loyalu Eduru Nilachinaa
    Ennadevaru naduvani Baatayainanu } 2
    Veravadennadainanu Naadu Hrudayamu } 2
    Gaayapadina Yesu Paadam Andu Nadachenu } 2     || Ee Dinam ||

  2. Pravaaham Vole Shodhakundu Eduru Vachchinaa
    Yuddha Keka Naa Nota Yesu Naamame } 2
    Virodhamaina Aayudhaalu Yevi Phalinchavu } 2
    Yehovaa Nissiye Naadu Vijayamu } 2     || Ee Dinam ||


Yakobu bavi kada yesayyanu chusanammma యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా


Song no:

యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా
ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2)
దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2)
నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2)       ||యాకోబు||

అయ్యా నే సమరయ స్త్రీనిమీరేమో యూదులాయె
మీకు మాకు ఏనాడైనాసాంగత్యము లేకపాయె (2)
నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2)
చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2)       ||యాకోబు||

అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే
నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2)
అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2)
లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2)       ||యాకోబు||

నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే
ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2)
వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2)
ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2)       ||యాకోబు||

నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు
తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2)
గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2)
తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2)       ||యాకోబు||

Sonthamai povali naa yesuku సొంతమైపోవాలి నాయేసుకు మిళితమైపోవాలి


Song no:
సొంతమైపోవాలి నాయేసుకు - మిళితమైపోవాలి నా ప్రియునితో
సొంతమై మిళితమై యేసుతో యేకమై
ఎగిరివెళ్ళిపోవాలి నా రాజుతో - లీనమైపోవాలి ప్రేమలో

1.నా ప్రియుడు నా కొరకు చేతులుచాచి
నా వరుడు కలువరిలో బలిఆయెను
బలియైనవానికే నా జీవితం - అర్పించుకొనుటే నా ధర్మము
ధర్మము మర్మము యేసుతో జీవితం

2.పరదేశిగా నేను వచ్చానిలా - తన ప్రేమ కీర్తిని చాటాలని
ప్రియుని (ప్రభువు) కోసమే బ్రతికెదను
కాపాడు కొందును సౌశీల్యము (సాక్ష్యము)
యేసుతో జీవితం పరమున శాశ్వతంకు

Nithya prematho nannu preminchen నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినది


Song no:
నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్     *"2"*
తల్లి ప్రేమను మించినది *(లోక)*
నిన్ను నేను ఎన్నడు విడువను         *"2"*
నిత్యము నీతోనే జీవింతున్                               సత్య సాక్షిగా 
                           *(1)*
నిత్య రక్షణతో - నన్ను రక్షించెన్       *"2"*
ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై
నీ పోలికగా ఉండుటకై                   *"2"*
నా సర్వము నీకే అర్పింతున్
పూర్ణానందముతో నీకే అర్పింతున్ 
                            *(2)*
నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్ *"2"*
మేఘ రధములపై రానైయున్నాడు
యేసురాజుగా రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి            *"2"*
స్వర్గ రాజ్యములో యేసున్
సత్యదైవం యేసున్      *"నిత్య ప్రేమతో"*