Nee prema balamainadhi yesayya nee prema నీ ప్రేమ బలమైనది యేసయ్యా నీ ప్రేమ విలువైనది


Song no: 43
నీ ప్రేమ బలమైనది యేసయ్యా
నీ ప్రేమ విలువైనది
మరణము కంటే బలమైన ప్రేమ
సముద్రము కంటే లోతైన ప్రేన

వెలకట్టలేనిది విలువైన ప్రేమది

ఎంతగానో నన్ను నీవు ప్రేమించవు
ఇంతగా ఎవ్వరు ప్రేమించలేదయ్యా
అర చేతులందు
నన్ను చెక్కి యున్నవయ్యా
నీ ప్రేమతోనే బ్రతికించినావయ్యా

శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావు
విడువక నా యెడల కృపచూపుచున్నావు
పర్వతములు తోలగిన
మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిన్ను విడిచిపోదన్నావు

Ninnu vidichi undalenayya nimishamaina నిన్ను విడిచి ఉండలేనయా నిముషమైన బ్రతుకలేనయ్యా


Song no: 42
నిన్ను విడిచి ఉండలేనయా
నిముషమైన బ్రతుకలేనయ్యా

తల్లి నన్ను మరచిన గాని
తండ్రి నన్ను విడిచిన
నన్ను నీవు మరువలేదయ్యా
నిన్ను విడిచి  వుండలేనయ్యా

ఎవ్వరు చూచిన చూడకపోయిన
నన్ను నీవు చూచినావు
నీ దయగల చూపులు
మరువలేదయ్యా
నిన్ను విడిచి వుండలేనయ్యా

ఎప్పుడైన ఎక్కడైన
ఏమివున్న లేకపోయిన
నన్ను నీవు విడువలేదయ్యా
నిన్ను విడిచి వుండలేనయ్యా

Yeri kori yennukuntivi kori kori hatthukuntivi ఏరి కోరి ఎన్నుకుంటిని కోరికోరి హత్తుకుంటిని


Song no: 41
ఏరి కోరి ఎన్నుకుంటిని
కోరికోరి హత్తుకుంటిని
నా యేసు ఉత్తముడని
రుచి చూసి యెరిగితిని

రక్తమిచ్చి నన్ను కొన్నాడు
ప్రాణమిచ్చి రక్షించాడు
సొత్తుగ నన్ను చేసుకున్నాడు
తన పాత్రగ నన్ను మలచుకున్నాడు

దారి తప్పిన నన్ను చూచాడు
వెదకి వచ్చి ఎత్తుకున్నాడు
బుజముల మీద నన్ను మోసాడు
తన మందలో నన్ను చేర్చుకున్నాడు

గాయ పడిన నన్ను చూశాడు
గాయములను తానె కట్టాడు
పొందిన దెబ్బలచే విడుదలిచ్చాడు
మంచి సమరయిడై ప్రేమ చూపాడు

Naa prana priyudavu neve yesayya నా ప్రాణ ప్రియుడవు నీవే యేసయ్యా


Song no: 40
నా ప్రాణ ప్రియుడవు
నీవే యేసయ్యా
నను కన్న దైవము నీవే యేసయ్య

దవళ వర్ణుడవు రత్నవర్ణుడవు
అందరిలో అతి కాంక్షనీయుడవు

పిలువగనే పలికే నా ప్రియుడా
వెదకగనే దొరికే నా విభుడా
నా ప్రాణమునకు సేదదీర్చి
నను ఇల నడిపిన నాయేసువా

నా పాపమునకు పరిహారముగా
నీ ప్రాణమునే దారపోసి
మరణము నుండి విమోచించి
జీవము నొసగిన నా క్రీస్తువా

Yepudayya ninnu nenu chudali ఎప్పుడయ్య నిన్ను నేను చూడాలి ఎపుడయ నిన్ను నేను చేరాలి


Song no: 39
ఎప్పుడయ్య నిన్ను నేను చూడాలి
ఎపుడయ నిన్ను నేను చేరాలి
నామది తపియించె నీ కొరకే ...ఆ...

దేనికి నీవు నిర్మాణకుడవో
దేనికి నీవు శిల్పకారివో
పునాదులు కలిగిన ఆ పట్టణమును
చూడాలని నేను చేరాలని
శుభ నిరీక్షణతో
ఎదురు చూచుచుంటిని

మంచి పోరాటము పోరాడితిని
నా పరుగును కడ ముట్టించితిని
నీతి కిరీటము నే పొందుటకు
పోరాడితి నేను పరుగెత్తితి
విశ్వాసమును కాపాడుకొంటిని

Yochinchuma o nesthama యోచించుమా ఓ నేస్తామా ఆలోచించుమా అన్వేషించుమా


Song no: 38
యోచించుమా ఓ నేస్తామా
ఆలోచించుమా అన్వేషించుమా
యేసే యేసే యేసే నీ జవాబు
ప్రియ యేసే యేసే యేసే నీ జవాబు

జగతికి పునాది
వేయకముందే వున్నవాడు
ఈ జగమంతా కలుగుటకు కారణమైన వాడు

సత్యం మార్గం జీవమై వున్నవాడు
సర్వలోకానికే ముక్తిని ఇచ్చిన వాడు

శాంతి సమాధానానికే
కర్తయై వున్నవాడు
నిత్య జీవమును
స్వస్థతను ఇచ్చువాడు

Sannihithuda snehithuda సన్నిహితుడా స్నేహితుడా సమీపస్తుడా నా ప్రాణనాధుడా


Song no: 37
సన్నిహితుడా స్నేహితుడా
సమీపస్తుడా నా ప్రాణనాధుడా
నా సఖుడా నా హితుడా
శ్రీమంతుడా సృజనాత్ముడా

వేళకాని వేళలో వెంబడించినావయా
దప్పిగొన్నానంటూ దాపుచేరినావయా
పరులు చూడ
పాపినంటూ త్రోసివేసినారయ
బందువులే దోషినంటూ
వెలివేసినారయా
స్నేహితుడా యేసయ్యా
శ్రీమంతుడా సృజనాత్ముడా

నా పాపశిక్షణంతా
నీవె భరియించావయా
వెలయిచ్చి విమోచించి
నీ సొత్తుగ చేసావయా
మధురమైన ప్రేమను చూపి
నన్ను మార్చితివయా
మలినమైన నా బ్రతుకును
మహిమగ మలిచావయా