Song no:
- నీవే హృదయ సారధి ప్రగతికి వారధి
- మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి
చిగురాశల దిశగా నను పయనింపజేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే || నీవే హృదయ ||
- నీవు లేని జీవితం ప్రళయసాగరమే
దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి || నీవే హృదయ ||
- చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు
చాటింతును నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా || నీవే హృదయ ||
నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా
- Neeve hrudhaya saaradhi pragathiki vaaradhi
- Madhilo chedhu gnaapakaala vilaya vedhika koolchi
chiguraasala disagaa nanu payanimpa jesinaa
nee maatalu sthiraparachenu viswaasa premalo
kalanainaa anukoni anuraaga bandhamaithive || Neeve hrudhaya ||
- Neevu leni jeevitham pralaya saagarame
dhikku thochani samayamulo neeve dhiksoochivai
chukkaaniga nadipinchumu aathmeeya yaathralo
kanupaapaga nanu kaachina naa manchi kaapari || Neeve hrudhaya ||
- Cheranaithi koranaithi sneha soudhamu
chirudivvega dharicheri cherchaavu sannidhi
chaavainaa brathukainaa nee kosame prabhu
chaatinthunu nee premanu pranuthinthu prema saagaraa || Neeve hrudhaya ||
nee snehame soubhaagyamu samkshema santhakam
naa paatake soundharyamu neeve yesayyaa