Song no: #31
- ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||
- నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||
- పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||
- కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||
- మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||
- నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||
- నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే ||ఓ||
- నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ|
- నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||
- ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||
- ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||