Home Thalam - ఆది 🎹 Dhyanimpa ne chitthama varshamthamuna dhyanimpane ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే Dhyanimpa ne chitthama varshamthamuna dhyanimpane ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే personly June 06, 2018 0 share 600 సంవత్సరాంత్య ధానము రాగం-బిలహరి ( చాయా : కొనియాడ దరమె నిన్ను ) తాళం-ఆది ధ్యానింపవే చిత్తమా వర్షాంతమున ధ్యానింపవే చిత్తమా - ధ్యానింప నాసక్తి జ్ఞానంబుఁ గలిగించు = జ్ఞాన స్వరూపుఁడు జ్ఞానాత్మచే నీకు || ధ్యానింపవే || అరయ నీ తలఁపుల నఘము లగుపడు నీకుఁ } 2పరిశుద్ధుఁ డీక్షింప బహుగా గనుపడుచుండు || ధ్యానింపవే || పరికింపఁ బలుకులఁ పాప మగుపడు నీకు పరిశుద్ధుఁ డరయుఁ గ న్పడకుండు నే యది || ధ్యానింపవే || క్రియలను జింతింప మయిల గనపడు గాన భయ మొంది నమ్మికను బదవే క్రీస్తుని దరికి || ధ్యానింపవే || దేవుని ఘన ప్రేమ దినదినముఁ దలపోయ } 2 నీవు పొందఁగ వచ్చు నిక్కమైన శుద్ధి || ధ్యానింపవే || స్మరియింప నీలోన వర రక్షకుని పాట్లు భరియింప నోపుదువె పాప మొక నిమిషంబు || ధ్యానింపవే || హృదయంబు విమలాత్మ సదనంబుఁ గావింపఁ } 2 పదవే శ్రీఘ్రంబుగఁ పరమ జనకుని కడకు || ధ్యానింపవే || దేవుని సేవింపఁ దిరముగ నాశించి } 2 దేవాత్మ కొర కీవు దినము దేవుని వేఁడ || ధ్యానింపవే || || Yese Nija Devudu || Tags Andhra Kraisthava Keerthanalu 📖Gayathri 🎤Pulipaka Jagannadhamu ✍Ragam - బిలహరిThalam - ఆది 🎹 Facebook Twitter Whatsapp Newer Older