Jayamu kreethanalu jaya shabdhamutho జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ

Song no: 70

జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ పాడండి - జయము జయమాయెను లెండి-జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున గూడ జయమే నిత్యమును సద్విలాస్



  • యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన యెల్ల వారికౌను వేడిన యెల్లవారికౌను - నమ్మిన యెల్ల వారికౌను = యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము - జయమని వ్రాసికొన్న జయము సద్విలాస్ ||జయ||



  • జయము రాకపూర్వంబే - జయమను జనులకు జయమౌను-స్తుతించు జనులకు జయమౌను - స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను = జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల యికనప జయ పదమేకల్ల సద్విలాస్ ||జయ||



  • అక్షయ దేహము దాల్చితినీవు - ఆనందమొందుమీ లక్షల కొలది శ్రమలు వచ్చిన - లక్ష్యము పెట్టకుమీ = నీవు - లక్ష్యము పెట్టకుమీ - సద్విలాస్ ||జయ||



  • తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు,తుక్కు, తుక్కు = అపాయమేమియురాదు నీకు అది నీకు లొక్కు- నిజముగ అది నీకు లొక్కు సద్విలాస్ ||జయ||



  • వచ్చివేసిన దేవుని సభకు - చేరుదమురండి = త్వరలో యేసును కలిసికొని విని - దొరలౌదమురండి - నిజముగా - దొరలౌదమురండి సద్విలాస్ ||జయ||

    1. jayamu keertanalu- jayaSabdamutO rayamuga paaDaMDi - jayamu jayamaayenu leMDi-jayamae kreestuni charitra yaMtaTa jayamae maraNamuna gooDa jayamae nityamunu sadvilaas^

    2. yaesukreestu prabhuvoMdina jayamae - ellavaarikaunu - kOrina yella vaarikaunu vaeDina yellavaarikaunu - nammina yella vaarikaunu = yaesu paerae mee chikkulapaina vaesikonna jayamu - jayamani vraasikonna jayamu sadvilaas^ ||jaya||

    3. jayamu raakapoorvaMbae - jayamanu janulaku jayamaunu-stutiMchu janulaku jayamaunu - smariMchu janulaku jayamaunu prakaTiMchu janulaku jayamaunu = jayamu jayamani kalavariMchina jayamae bratukella yikanapa jaya padamaekalla sadvilaas^ ||jaya||

    4. akshaya daehamu daalchitineevu - aanaMdamoMdumee lakshala koladi Sramalu vachchina - lakshyamu peTTakumee = neevu - lakshyamu peTTakumee - sadvilaas^ ||jaya||

    5. tupaaki baaMbu katti ballemu tukku,tukku, tukku = apaayamaemiyuraadu neeku adi neeku lokku- nijamuga adi neeku lokku sadvilaas^ ||jaya||

    6. vachchivaesina daevuni sabhaku - chaerudamuraMDi = tvaralO yaesunu kalisikoni vini - doralaudamuraMDi - nijamugaa - doralaudamuraMDi sadvilaas^ ||jaya||

    Kraisthava sangama Ghana karyamulu cheyu kalamu క్రైస్తవ సంఘమా - ఘనకార్యాములు చేయు - కాలము వచ్చెను

    "యేసుక్రీస్తు ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి, గొప్పకార్యాలు చేసే ఘనతనిచ్చాడు. "

    క్రైస్తవ సంఘమా - ఘనకార్యాములు చేయు - కాలము వచ్చెను తెలుసునా - 2
    క్రీస్తు ప్రభువు నీ - క్రియల మూలంబుగా - కీర్తి పొందునని తెలుసునా - 2
    కీడు నోడింతువు తెలుసునా - కిటుకు విడగొట్టుదువు తెలుసునా

    1. పరమ ధర్మంబులు - భాషలన్నిటి యందు - ప్రచురింతువని నీకు తెలుసునా - 2
    నరుల రక్షకుడొక్క - నజరేతు యేసని - నచ్చచెప్పుదువని తెలుసునా - 2
    నడిపింతువని నీకు తెలుసునా - నాధుని చూపింతువు తెలుసునా

    2. యేసుని విషయాలు - ఎరుగని మానవులు - ఎచటనుండరని తెలుసునా - 2
    యేసులో చేరని ఎందరో యుందురు - ఇదియూ కూడా నీకు తెలుసునా - 2
    ఇదియే నా దుఃఖము తెలుసునా - ఇదియే నీ దుఃఖము తెలుసునా

    3. నిన్ను ఓడించిన - నిఖిల పాపములను - నీవే ఓడింతువు తెలుసునా - 2
    అన్ని ఆటంకములు - అవలీలగా దాటి - ఆవలకు చేరెదవు తెలుసునా - 2
    అడ్డురారేవ్వరు తెలుసునా - హాయిగా నుందువు తెలుసునా

    4. ఏ జబ్బునైననూ - యేసు నామము చెప్పి - ఎగురగొట్టెదవని తెలుసునా - 2
    భూజనులు చావంగా - బోయి జీవము ధార - పోసి బ్రతికించెదవు తెలుసునా - 2
    పూని బ్రతికించెదవు తెలుసునా - పునరుత్థానమిదియే తెలుసునా

    5. బిడియమెందుకు నీకు - భీతి కలుగదు పరుల - పై తీర్పు తీర్చెదవు తెలుసునా - 2
    పుడమి యంతట వ్యాప్తి - పొందెదవు నీ యెదుట - బడి నిల్వదాయుధము తెలుసునా - 2
    జడియూ శత్రువు నీకు తెలుసునా - కడకు నీకే జయము తెలుసునా

    Albums

               

    Kummari o kummari jagadhuttpatthidhari కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీ

    Song no: 644

    కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీ జిగటమన్నై నా వంక చల్లగ చూడుమయ్యా......

    పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగిపొరలు పాత్రగా జేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండ సాక్షిగ నుండు పాత్రగజేసి సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరీ||

    విలువలేని పాత్రన్ నేను కొనువారు లెరెవ్వరూ వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి ఆటంకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా ||కుమ్మరీ||

    లోకాశతో నింజి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్ మనుష్యేచ్చలన్నియున్ స్థిరమనుచు నే మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను పట్టితీ ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితిన్ ||కుమ్మరీ||

    Prabhuva ne ninnu nammi ninnasrayinchinanu ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను

    Song no: 676

      ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు

    1. గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా||

    2. నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా||

    3. పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా||

    4. జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా||

    5. నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!||ప్రభువా||

    Madhura madhura madhuraseva yesu prabhu seva మధుర మధుర మధురసేవ యేసు ప్రభు సేవ

    Song no: 698

    మధుర మధుర మధురసేవ – యేసు ప్రభు సేవ
    1. దేవదూతకును లేని దైవజనుని సేవ – దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ

    2. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ – పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ

    3. ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ – ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ

    4. భాగ్యభోగనిధులు లేని భారభరితసేవ – బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ

    5. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ – సిలువనిందలను భరింప శిరమువంచి మరియు సేవ

    6. లోకజ్ఞానియపహశించు శోకమూర్తి సేవ – లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ

    7. దైవజనుడ మరువకోయి దైవపిలుపునోయి – దైవనీతివదలకోయి దేవుడు దీవించునోయి

    O prabhunda nin nuthinchuchunnamu vinayamuthoda ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ

    Song no: #31

      ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||

    1. నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||

    2. పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||

    3. కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||

    4. మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||

    5. నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||

    6. నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే ||ఓ||

    7. నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ|

    8. నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||

    9. ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||

    10. ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||

    Neeve yani nammika yesu naku niveyani nammika నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక

    Song no: 145

    నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు ||నీవే||

    పెడదారిని బోవగ నామీదికి ఇడుమలెన్నియొరాగ అడవిలోబడి నేను ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు ధన్యుమౌ మార్గంబు ||నీవే||

    కారుమేఘముపట్టగ నా మనస్సులో కటిక చీకటిపుట్టగ ఘోరాపదలుచేరి దారియని భ్రమపడగ తేరిచూడగల్గు తేజోమయ మార్గంబు ||నీవే||

    లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగజేయుచు వానినిఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు ||నీవే||

    నరలోకమునుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు స్థిరమైన మార్గంబు ||నీవే||

    Neevu na dhevumdavai yu nnavu yesu nadha నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ

    Song no: #71

      నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ గావవే ||నీవు||

    1. పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి సర్వ భూపతి ||నీవు||
    2. శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు నాయకా మోక్ష దాయకా ||నీవు||
    3. జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ జీవనా ||నీవు||
    4. జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ భాగిని ||నీవు||
    5. పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా కృపను జూపవా ||నీవు||

    Yevaru kreesthu vaipu nunnaru yeva resuni varu ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు

    Song no: 459

    ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు||

    నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుఁడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవఁజేయ ||నెవరు||

    లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ సైన్యమందుఁ జేగి సయితాను నెదిరించి గెలువ ||నెవరు||

    మరణమందు గూడ మాకుఁ గరుణఁ జూపిన యేసు నీ కొ మరులమై మేమందఱము నీ దరికిఁ జేరి యున్నాము ||ఎవరు||

    Deva dhasa palaka raja rave jeevamula pradhathavai దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై

    Song no: 396

    దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందఁగా దేవా దేవా దీన పోషకా ||దేవ||

    లోకబాధ యిరుకు శోధన నుండి స్వీకరించినావు త్ర్యేకదేవుఁడా స్తోత్రం స్తోత్రం స్తోత్ర మర్పణ ||దేవ||

    దిక్కు లేని పాపికొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందఁగా ||దేవ||

    కఠిను లంత కుటిలముజేసి నిన్నుఁ గట్టి కొట్టి నెట్టి నీకుఁ గొయ్య నెత్తిరా యిదే నా యెడఁ బ్రేమఁ జూపితి ||దేవ||

    ఇంత యోర్పు యింత శాంతమా నాకై పంతముతోఁ బాపికొరకుఁ బ్రాణ మియ్యఁగా పాపిన్ నీదగు దాపుఁ జేర్చవే ||దేవ||

    కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వమోయఁగా హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్ ||దేవ||

    Nee dhanamu ni ghanamu prabhu yesudhey నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

    Song no: 578

    నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా||

    ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా||

    పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||

    వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా! వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా ||

    కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||

    Na yanna ragadhe o yesu thandri na yanna ragadhe నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే

    Song no: 179

    నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే నా ప్రాణ ధనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తిబాట నా యన్న రాఁగదే నా యన్న సిలువలో నీ వాయాసపడిన నాఁటి నీ యంఘ్రియుగమునిపుడు నా యాసఁదీరఁజూతు ||నా యన్న||

    ఒక తోఁట లోపట నాఁడు పడిన సకల శ్రమ లిచ్చోట నికటమై యున్నట్లుగా నిట్టూర్పులతోఁ దలంతు నకట నా రాతి గుండె శకలంబై పోవునట్లుగా ||నా యన్న||

    పరమాశ్చర్యము గాదా యీలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకౌ ముల్లుల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకం దిచ్చెడు నీ కరుణన్ దర్శింతు నేఁడు ||నా యన్న||

    ఇచ్చక మిది గాదు మిగులఁ దలపోయ ముచ్చట దీరదు అచ్చి వచ్చిన నా యవతారుఁడ నీ ప్రక్క గ్రుచ్చు గాయము లోపల నేఁ జొచ్చి నీ ప్రేమఁ జూతు ||నా యన్న||

    తల వంచి సిగ్గున నేఁ జేయు నేర ముల నెంతు నాలోనఁ బలు మారు నీ గాయములఁ గెలికి నిన్ శ్రమపరచు నా ఖల దోషములకై యిపుడు పిలిపించి వేఁడుకొందు ||నా యన్న||

    Papamu dhalachu sumi pacchatthapamu bondhu sumi పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ

    Song no: 317

    పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ బొందు సుమీ దాపని యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ ||పాపము||

    పాపము చేయకు మీ యేసుని గాయము రేపకుమీ పాయక పాపము చేసిన మనసా కాయఁడు యేసు సుమీ ||పాపము||

    గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ ||పాపము||

    ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ ||పాపము||

    తెగువఁ బోరాడు సుమీ రిపునకు బెగ్గిలవద్దు సుమీ తెగువగు ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి పగతునిఁ గెల్వు సుమీ ||పాపము||

    అంతము వచ్చు సుమీ రక్షణ అంతలో వెదకు సుమీ అంత రంగుఁ డగు క్రీస్తు రక్షకుని చెంతను జేరు సుమీ ||పాపము||

    Jeevithanthamu varaku neeke seva salppudhunantini జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని

    Song no: 442

    జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||

    ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||

    అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||

    నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||

    నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||

    మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||

    పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||

    Lemmu thejarillumu neeku velugu vacchiyunnadhi లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది

    Song no: 465

    లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము||

    జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము||

    సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము||

    గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద క్షేత్రము గొప్పగజేతు ||లెమ్ము||

    నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు నిన్ను కారణముగ జేతు ||లెమ్ము||

    ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె ఎంతో బలమగు జనమగును ||లెమ్ము||

    Kalugunugaka devuniki mahima kalugunu gaka కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక

    Song no: #27

      కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు నున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దయ ||కలుగును||

    1. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము ||కలుగును||

    2. మహిమపర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిఁ దలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము ||కలుగును||

    3. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొఱ్ఱె పిల్ల మమ్మును కనికరించుము చల్లఁగ ||కలుగును||

    4. లోకపాపములు మోయుచుఁ బోవు యేసు రక్షకా వాసిగ జనకుని కుడివైపునఁ గూర్చుండి యేసూ మా ప్రార్థన నాలించి కనికరించు ||కలుగును||

    5. పరిశుద్ధుఁడవు ప్రభుఁడవు నీవో ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతోఁ తండ్రి యైన దేవునియందుఁబరిపూర్ణ మహిమతోఁ బ్రబలుచున్నామవామేన్ ||కలుగును||

    Yesuni premanu nemarakanu neppuda dhalachave యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే

    Song no: 173

    యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా||

    పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా ||యేసుని||

    కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా ||యేసుని||

    మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా ||యేసుని||

    ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా ||యేసుని||

    వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా ||యేసుని||

    Nakai chilina yuga yugamula sila mukthi na kimmu నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి నా కిమ్ము

    Song no: 417

    నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి నా కిమ్ము శ్రీ యేసువా లోక రక్షక నన్ను నీ లోపల దాగి వీఁకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా ||నాకై||

    చీలఁబడిన నీదు ప్రక్క విడిచి పారు జాలు జలము రక్తము చాల నా పాపపు తీర్పు పాపబలమ్ము చాలు రూపును మాపి నన్నుఁ బావనుఁ జేయు ||నాకై||

    నీదు న్యాయంబగు ప్రామన్య విధులను నాదు సత్కృతి తృప్తిగా నాదరింపవు పారమార్థకమైనట్టి నాదు నాసక్తి బాష్పమును బారిన నాకు ||నాకై||

    నేను జేసిన పాపములఁ ద్రుంప నెవరిని గాన నేరను యేసువా దీనుఁ డనై వచ్చి నీ మేటి సిల్వను మానక నే హత్తుకొనియెద సచ్చరిత ||నాకై||

    కట్టఁ బుట్టము లేక పుట్టముకై యాశ బుట్టి నీ యెడ వచ్చితి నెట్టి సహాయము లేక నీపై మదిఁ బుట్టి నీ సత్కృఋపఁ బొందఁజూచెద నయ్య ||నాకై||

    పరమకల్మషుఁడనై నే నీటి ఋగ్గకుఁ బరుగు లెత్తెద నిప్పుడు పరమ పావన నన్ను( గడుగుము లేకున్న మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర ||నాకై||

    Raja na deva nannu gava rave prabhu రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు

    Song no: 536

    రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు ||రాజా||

    తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింపఁ జల్లనైన మోక్ష మియ్య ||రాజా||

    బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన మోక్ష మొంద ||రాజా||

    మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి లోనై లేచితి వయ్య ||రాజా||

    దండి ప్రభుండు యే సండఁ జేరఁగ మాకు నిండు వేడుకతోను నిత్య మోక్షంబు నియ్య ||రాజా||

    Yentho sundharamainavi dhara girula pai nentho ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో

    Song no: 267

    ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో యందమైనవి సంత తంబుఁ బరమ ప్రేమను దెల్ప సంతస మందుచు సరిగ బ్రకటన జేయ అంతటను బనిఁ బూని ప్రభు న త్యంతముగఁ బ్రక టించి వసుధ న నంత మగు శుభవార్తఁ జాటెడు వింత యగు బోధకుల పాదము ||లెంతో||

    మందమతులగు వారలు మూర్ఖత్వంబు నొందు నెల్ల జనంబులు వందుచుఁ గుందుచు వన గిరి కందరము లందు నున్న సకల మౌ మోటుజన మెరుఁగఁ పొందుగాఁ ప్రభు యే సొసంగెడు సుందరం బగు సత్య వాక్యం బందుకొని చాటించుచుండెడు అంద మగు బోధ కుల పాదము ||లెంతో||

    మదిలోఁ ప్రభుని నమ్మిన పాపుల నెల్లఁ తుదిని మోక్ష పదమ్మున విదితమ్ముగాఁ జేర్చి ప్రీతిఁ జూపున టంచు ఇదిగో రమ్మని క్రీస్తు పద సన్నిధిని జేర్ప సదయులై శుభవార్తమానము ముదమునను మదిలోన నిడి కొని పదిలముగఁ ప్రకటించుచుండెడి విదితు లగు బోధకుల పాదము ||లెంతో||

    యేసు క్రీస్తు రారాజై యున్నాఁడనుచు భాసురంబుగఁ దెల్పుచు వాసిగాఁ ప్రభు యేసు వసుధ రక్షకుఁడనుచు యీ సువార్తను జాటి యిచట నెమ్మదినొంద దోసకారి జనంబు లందరి కీ సుమంగళ వార్తఁ దెలుపుచు దోస మంతయుఁ బాపు మన ప్రభు యేసుఁ జూపెడు వారి పాదము ||లెంతో||

    Neeve na priyudavu yesu prabhu nive na yedayudavu నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా

    Song no: 414

    నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే||

    పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా కొరకు విడిచితివి ||నీవే||

    నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై ||నీవే||

    నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ ప్రేమ నాకర్త ||నీవే||

    నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను విడుతు ||నీవే||

    సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు ||నీవే||

    నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు ||నీవే||

    Saranu jocchithi yesu nadhuda sakthihinatha శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె

    Song no: 421

    శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే ||శరణు||

    కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే ||శరణు||

    మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో ||శరణు||

    తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే ||శరణు||

    శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి మాయ లోకపు గాంతి నీరస మంచు నీ ||శరణు||

    Yevaru bhagyavamthu laudhu ravani lopala ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష

    Song no: 154

    ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||

    కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||నెవరు||

    దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరు||

    వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ బొంది నిత్య సంతోషింతు లని తెల్పె ||నెవరు||

    శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||

    పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||

    నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ||ఎవరు||

    Anna mana yesu prabhuni kanna rakshakudu ledu అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు

    Song no: 162

    అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన యఘము లన్ని సడలించి ప్రోచు ||నన్న||

    మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న||

    నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు నతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న||

    దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం పెక్కి వర్తించె నహహ ||యన్న||

    ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్న||

    మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు ||నన్న||

    Gyanu laradhinchiri yesu prabhuni జ్ఞాను లారాధించిరి యేసు ప్రభుని

    Song no: 114

    జ్ఞాను లారాధించిరి యేసు ప్రభునిఁ బూని పాపులఁ బ్రోవ మెనిఁ దాల్చిన తరి ||జ్ఞాను||

    చాల కాలము నుండి మేలు వార్త నాసక్తి నాలకించి నక్షత్ర కాల చిహ్నముఁ గూడి మేలు మేలని మ మ్మేలు వాఁడని మంచి బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞాను||

    దూర మనక యాత్ర భార మనక బయలు దేరి సంతోషముతోఁ జేరి మేలిమి బం గార మిచ్చిరి మన సార మెచ్చిరి జో హారు జోహారటంచు ||జ్ఞాను||

    ఈ దివసంబున బేత్లెహేమను నూర యూదుల రాజుగాఁ బాదుకొన్నయేసు నాధ స్వామిని స మ్మోద మిమ్మని య య్యూదజనుల మధ్య ||జ్ఞాను||

    ఈ సమయము మన మా సమయంబుగఁ జేసి స్తుతింపను జేరితి మిచ్చోట భాసురంబగు శ్రీ యేసు నాధుని హృద యాసనంబునఁ జేర్చి ||జ్ఞాను||

    Dhashama bhagamu lella dhevunivi dharalamuga niyya దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య

    Song no: 571

    దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ||

    దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్ దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ||

    పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ||

    ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ ||దశమ||

    ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||

    దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||

    Srusti pitha sarvonnatha samarpinthun sarvaswamun సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్

    Song no: 447

    సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్

    భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే బలశౌర్యములు నీవే ||సృష్టి||

    మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||

    వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టి||

    పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు ||సృష్టి||

    మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా యెహోవా మా తనువుల్ మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||

    మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? మోక్ష నాధా యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టి||

    తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్ దాత వీవే నేతవీవే దేవాది దేవుండవే ||సృష్టి||

    Sri yesune bhajinchu na manasa శ్రీ యేసునే భజించు నా మనసా

    Song no: #79

      శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు||

    1. యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు ||శ్రీ యేసు||
    2. నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి వచ్చిన ||శ్రీ యేసు||
    3. స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన ||శ్రీ యేసు||
    4. నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ డగు ||శ్రీ యేసు||
    5. మూఁడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము నొందిన ||శ్రీ యేసు||

    Dhathruthyamunu galigi perugudhama dhanamu దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము

    Song no: 573

    దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు గుదమ ||దాతృ||

    శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ ||దాతృ||

    సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ ||దాతృ||

    గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ ||దాతృ||

    సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ ||దాతృ||

    ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ ||దాతృ||

    విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము ||దాతృ||

    దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ ||దాతృ||

    పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ||దాతృ||

    వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ ||దాతృ||

    వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృ||

    Deva sahayamu nimmu jeevampu దేవా సహాయము నిమ్మా జీవంపు

    Song no: 376

    దేవా సహాయము నిమ్మా జీవంపు టూటలు ద్రావుట కిమ్మా ||దేవా||

    గడియ గడియకు నెగసెఁ నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక బాణములు ఎగతెగని శోధనములు నీవు పడఁగొట్టి వేగమె దృఢభక్తి నిమ్మా ||దేవా||

    కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు సాతాను సాధనములు నేను దాఁటి నీ రెక్కల చాటున నుండ ||దేవా||

    దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ||దేవా||

    మా యావువుదినములు చెట్టు చాయవలెఁ దరుగుచు మంటి పాలౌను చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు ||దేవా||

    మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా ||దేవా||

    Veerula mayya jaya veerula mayya వీరుల మయ్యా జయ వీరుల మయ్యా

    Song no: 359

    వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల||

    మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై బడిన ధ్వజము విడమాయా ||వీరుల||

    పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా ||వీరుల||

    అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ కొకింత సిగ్గు పడ మయా ||వీరుల||

    భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ మైనఁ బెట్టువారము ||వీరుల||

    O ho ho ma yannalara yudhyogimpamdi yipude ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే

    Song no: 231

    ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచుఁ క్రీస్తుని దయను గోరండి ||ఓహో||

    అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ బోకమునుపే ప్రభువును వేడండి ||ఓహో||

    మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు ||ఓహో||

    అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును ||ఓహో||

    కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్ ||ఓహో||

    నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును ||ఓహో||

    ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర ||ఓహో||

    కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను ||ఓహో||

    కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే ||ఓహో||

    ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను ||ఓహో||

    జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతఁడు ||ఓహో||

    Pilla naina nannu judumi priya maina yesu పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియ మైన యేసు

    Song no: 538

    పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియ మైన యేసు పిల్ల నైన నన్నుఁ జూడుమీ చల్లని రక్షకుఁడ వనుచు సత్య వార్తఁ దెలుపుచుండ నుల్ల మందు నిన్ను నమ్మి కల్ల లేక వేఁడుకొందుఁ ||బిల్ల నైన||

    నిన్ను నమ్మి యున్నవాఁడను ఘన దేవ తనయ నన్ను దాఁచు నీ నీడను తిన్నని హృదయంబు నాకుఁ జెన్నుగా నొసంగి యిపుడు సన్నుతింప నిమ్ము నన్ను సాధు వైన నిన్నుఁ దలఁచి ||పిల్ల నైన||

    ప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా స్వరూప ప్రేమలోన నడచు చుంటివి ప్రేమ లేని నన్నుఁ బ్రోవఁ బ్రేమచేత బ్రాణ మిచ్చి ప్రేమఁ జూపు మనుచు నన్నుఁ బ్రీతి చేత బోధింపఁ ||బిల్ల నైన||

    పరమ జనకు చిత్త మెప్పుడు పరమేశ పుత్ర బిరబిరగను జేయఁగా నిమ్ము కరుణ మీర నాత్మచేత వరవరంబు లొసఁగి నాకు నరిలలోన నిన్నుఁ గొలువ ధరణిమీఁద నన్ను నిలుపఁ ||బిల్లనైన||

    బలము మీర నన్ను నిలుపుము తుల లేనివాఁడ బలము గల్గు నీదు చేతుల నిలను నీకు ఫలము లిచ్చి యెలమి నిన్ను గొప్పఁ జేయ సలలిత ముగ నడువ నిమ్ము చక్కని నీ మార్గమందుఁ ||బిల్లనైన||

    Dhyanimpa ne chitthama varshamthamuna dhyanimpane ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే

    600 సంవత్సరాంత్య ధానము
    రాగం-బిలహరి ‌‌‌( చాయా : కొనియాడ దరమె నిన్ను ) తాళం-ఆది

    Goppa deva naku thandrivi yakashamandhu గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు

    Song no: #60

      గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము ||గొప్ప||

    1. నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేఁడుకొందు ||గొప్ప||
    2. చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప||
    3. విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు చుందును బలుకులందుఁబనులయందు బలముఁ జూపి నిన్నుఁ గొలిచి యిలను నిన్నుఁ బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని ||గొప్ప||
    4. మీఁది రాజ్యమందుఁ జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్నుఁ గరుణచే సోదరులను గూడికొనుచు మోద మొప్పఁగ నీదు సేవఁ బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప||

    Nannenthaga preminchithivo ninnethaga dhushinchithino నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో



    Samipinchuma samipinchuma o priya janama సమీపించుమా సమీపించుమా ఓ ప్రియ జనమా



    Jayaho jayaho jaithra yathra jayabheri జయహో జయహో జైత్ర యాత్ర

    ॥ కోరస్ ||
    జయహో జయహో … జైత్ర యాత్ర జయభేరి మోగింది చూడు...
    యేసుని వెంబడించగా ... విజయమే వరించింది చూడు...
    జయహో జయహో … జైత్ర యాత్ర జయభేరి మోగింది చూడు...
    ॥ పల్లవి ||
    క్రైస్తవ జీవితం ఒక సుదూర ప్రయాణం
    క్రీస్తును పోలి అడుగెయ్యమనే సందేశం
    దొరకునుగా పరలోక రాజ్య స్థానం
    ధన్యమౌనుగా... తరియించునుగా నీ జన్మం

    సంసార సాగరంలో తుఫానులే ఎదురైనా... కష్ట నష్టాలే క్రుంగదీసినా...
    యేసుని మాటతో శాంతము... యేసుని వాక్కులో సమాధానము... (2)
    సాగించు నీ ప్రయాణం...చేరుకో నీ గమ్యం... తరియించునుగా నీ జన్మం

    నెమ్మది గల మనస్సులో అలజడులే చెలరేగినా... ఆరోగ్యమే క్షీణించినా...
    యేసుని సన్నిధిలో ధైర్యము... యేసుని రక్తములో స్వాస్థ్యము... (2)
    సాగించు నీ ప్రయాణం...చేరుకో నీ గమ్యం... తరియించునుగా నీ జన్మం

    ప్రాణమనుకున్న స్నేహితులే వంచించినా... కన్నీటి పాలు చేసినా...
    ప్రాణమర్పించిన యేసునితో స్నేహము... యేసుని ప్రేమలో ఓదార్పు... (2)
    సాగించు నీ ప్రయాణం...చేరుకో నీ గమ్యం... తరియించునుగా నీ జన్మం

    Yesu yela vivarinthunu napai nikunna prema యేసూ ఎలా వివరింతును నాపై నీకున్న ప్రేమ

    ॥ పల్లవి ॥
    యేసూ ఎలా వివరింతును.... నాపై నీకున్న ప్రేమ
    కను పాపను కాపాడే కను రెప్పకున్న ప్రేమ
    దోసెడు నీళ్ళైన దాయని కురుయు మబ్బుకున్న ప్రేమ
    సరితూగునా ఈ ఇలలో ఏ ప్రేమ అయినా (2)
    నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
    ఆరాధనా .... ఆరాధనా .... నీ ప్రేమకే నా ఆరాధనా ....

    ఛళ్ళు ఛళ్ళు మని కొరడా దెబ్బలు గాయపరుచుచున్నా
    దున్నుతున్న వీపు రక్తము చిందించి … ఏరులై పారుతున్నా
    శిరస్సున ముళ్ళ కిరీటం ఈటెలై పొడుచుకుపోతున్నా (2)
    అణువైన తగ్గలేదు ప్రభూ ----- నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
    -- ఆరాధనా --

    మోయలేని సిలువ భారము మోసినా ... ఉమ్మి వేయబడినా
    సీలలే అర చేతిని చీల్చినా... ఖడ్గములై గుండెను కోసినా
    కడ సారి దప్పిక దీర్చ నీళ్ళైన కరువయినా (2)
    కాస్త అయిన తరిగిపోలేదు ప్రభూ ------ నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
    -- ఆరాధనా --

    పాపపు మార్గము ఎంచినా ... అపరాధిని అయినా
    నీ నామము వ్యర్థముగా వాడినా ... కలుషములే పలికినా
    నిన్ను యెరుగనని అబద్ధమాడినా ... నీ గుణమే శంకించినా (2)
    ఒక్క క్షణమైనా వీడిపోలేదు ప్రభూ ------ నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
    -- ఆరాధనా --

    Ninu veedi nenundalenu yesayya నిను వీడి నేనుండలేను యేసయ్యా

    ॥ పల్లవి ॥ నిను వీడి నేనుండలేను
    యేసయ్యా ... నిను వీడి నేనుండలేను
    నా హృదయములో నిను కొలిచెదను
    నా పాటతో నిను ఆరాధింతును
    యేసయ్యా ... నిను వీడి నేనుండలేను

    నీదు ప్రేమ తోటలో ఓ పూవునై పరిమళించాను
    నీదు కరుణ సంద్రములో ఓ బాటసారినై పయనించాను
    నీలో ఒదిగాను.... నిన్నే పూజింతును
    యేసయ్యా ... నిను వీడి నేనుండలేను                    ॥ యేసయ్యా ||

    నీదు రుధిరములో ఓ పాపినై గతియించాను
    నీదు త్యాగములో ఓ సాక్షినై ఉదయించాను
    నీలో లీనమయ్యాను... నిన్నే ప్రార్థింతును
    యేసయ్యా... నిను వీడి నేనుండలేను                       ॥ యేసయ్యా ||

    నీదు ముఖ కాంతిలో ఓ దీపమునై ప్రకశించాను
    నీదు ఆలయములో ఓ సంకీర్తనై ఆలపించాను
    నీలో తేజరిల్లాను ... నిన్నే సేవింతును
    యేసయ్యా... నిను వీడి నేనుండలేను                   ॥ యేసయ్యా ||

    Srustini sryjinchina mahimanvithuda సృష్ఠిని సృజించిన మహిమాన్వితుడా

    సృష్ఠిని సృజించిన మహిమాన్వితుడా - కూరుపికై కదిలొచ్చిన కరుణామయుడా
    నా హృదయ తలుపు తడుతున్న సదయుడా
    స్తుతిగానమే నా అర్పణ - నేనౌతును నీ దర్పణ
    ఆరాధనా ... ఆరాధనా ... ఆరాధనా నీకే

    తల్లి గర్భమందే నన్నెరిగి - ఊపిరూదిన యేసయ్యా.. మృత్యుంజయుడా
    ముదిమి వరకు నన్ను నువ్వెత్తుకుంటానని - మాటనిచ్చిన నీతిసూర్యుడా నిత్య తేజుడా
    నా తండ్రివి నీవే, కాపరి నీవే ... ప్రేమ స్వరూపుడా
    నా ఖ్యాతివి నీవే, ఘనము నీవే ... ఆశ్చర్యకరుడా                ॥ ఆరాధనా ||

    అయిదే రొట్టెలు రెండే చేపలు - వేలాది ఆకలి దీర్చిన సమకూర్చు దేవుడా … నా పోషకుడా
    జీవపు ఊటలు నాలో పొంగించి - దప్పిక దీర్చిన అతి శ్రేష్ఠుడా… మంచి సమరయుడా
    నా జీవాహారము నీవే, నా జీవ జలమూ నీవే... నాదు సజీవుడా
    అత్యున్నతుడా నీవే, మహోన్నతుడా నీవే … అద్భుతాకరుడా      ॥ ఆరాధనా ||

    గుడ్డి వాడికి చూపు ఇచ్చిన కుంటివాడికి నడకనిచ్చిన - నా యేసయ్యా… స్వస్థ పరుచు దేవుడా
    లాజరా అని పిలిచి మరణములో నుండి లేపిన యేసయ్యా అద్భుతాలు చేయువాడా…
    విజయవీరుడా
    నా మార్గము నీవే, నా దుర్గము నీవే ... నన్ను ఆదరించువాడా
    నా క్షేమము నీవే, నా సర్వమూ నీవే ... నా సర్వోన్నతుడా         ॥ ఆరాధనా || 

    Anandhame mahanandhame nee accshrya premanu ఆనందమే మహానందమే - నీ ఆశ్చర్య ప్రేమను

    Song no:

    ॥ కోరస్ ||
    క్రీస్తులోనే ఆనందం ... క్రీస్తులోనే సంతోషం ... ఎల్లప్పుడూ ఉన్నది.
    ॥ పల్లవి ॥
    ఆనందమే ... మహానందమే - నీ ఆశ్చర్య ప్రేమను చాటింప
    ఆనందమే ... మహానందమే

    నా కనులకు సృష్టిని చూచే శోభమే - నా వీనులకు నీ స్వరమును వినే యోగమే (2)
    ఆనందమే మహానందమే … యేసయ్య ఏమివ్వగలనయ్యా … (2)
    నీ ఋణగ్రస్తుడునయ్యా...
    ఆనందమే ... మహానందమే - నీ అద్భుత ప్రేమను రుచి చూడ (2)

    నా పాదాలకు నీ మర్గాన నడిచే ప్రాప్తమే - నా ఆత్మకు నీ చిత్తము జరిగింప సంతోషమే (2)
    నా భాగ్యమే ... మహభాగ్యమే … యేసయ్య ఏమివ్వగలనయ్యా … (2)
    నీ ఋణగ్రస్తుడునయ్యా...
    నా భాగ్యమే ... మహాభాగ్యమే - నీ అద్భుత ప్రేమను  రుచి చూడ (2)

    నా జీవితానికి నీ వాక్యము ఆధారమే - నేనును నా కుటుంబము నీ సేవకే అంకితమే (2)
    నా తరమా ... నా తరమా … యేసయ్య... ఏమివ్వగలనయ్యా ... (2)
    నీ ఋణగ్రస్తుడునయ్యా...
    నా తరమా ... నా తరమా - నీ తెరచిన ప్రేమను వర్ణింప (2)

    Rajuvayaa maharajuvayaa రాజువయా మహరాజువయా

    Song no:

    JESUS IS THE KING OF KINGS - HE IS MY KING
    JESUS IS THE LORD OF LORDS - HE IS MY LORD
    రాజువయా   ... మహరాజువయా.......రాజువయా ... మహరాజువయా.......
    KING OF THE KINGS ... HE IS MY KING
    LORD OF THE LORDS ... HE IS MY LORD

    భువి నుండి దివి కెగసిన దేవుడు... తండ్రి యొద్ద ఆశీనుడైన రారాజు (2)
    నిను పూజించు వారు ... ఈ లోకాన ఉన్న ధన్యులు
    ప్రేమ నీ ఆయుధము...   కృపయే నీ మకుటము.
    KING OF THE KINGS ... YOU ARE MY KING
    LORD OF THE LORDS ... YOU ARE MY LORD
    JESUS IS THE KING OF KINGS - HE IS MY KING
    JESUS IS THE LORD OF LORDS - HE IS MY LORD

    సాతానును జయించావు, విజయవీరుడై ... వారిని విమోచించావు (2)
    కరములను చాచావు ... హృదయానికి  హత్తుకున్నావు.
    ప్రేమ నీ ఆయుధము...   కృపయే నీ మకుటము.
    KING OF THE KINGS ... YOU ARE MY KING
    LORD OF THE LORDS ... YOU ARE MY LORD

    స్థుతులకు పాత్రుడవు నీవయ్యావు ... శుద్దాత్మను బహుమానముగా ఇచ్చావు.
    ప్రార్ధన ఆలకించావు... నీ రాజ్యంలో కోటలు కట్టిoచ్చావు.
    ప్రేమ నీ ఆయుధము...   కృపయే నీ మకుటము.
    KING OF THE KINGS ... YOU ARE MY KING
    LORD OF THE LORDS ... YOU ARE MY LORD
    రాజువయా   ... మహరాజువయా.......రాజువయా ... మహరాజువయా.......
    KING OF THE KINGS ... YOU ARE MY KING
    LORD OF THE LORDS ... YOU ARE MY LORD

    Dharani loni dhanamu lella dharanipalai povunu ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును

    Song no: 291

    ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను నిరత ముండెడి ధనమును ||ధరణి||

    యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని వేగము దివ్య వరముగ నమ్మికన్ ||ధరణి||

    విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న నీకుఁ గల్గు వేద నాధికంబుపో ||ధరణి||

    పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ మిచ్చిన పరమధాముని నమ్ముమీ ||ధరణి||

    తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు ||ధరణి||

    దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు మిత్ర నేట నెచట వెదకినన్ ||ధరణి||

    Neevu thodai yunna jalu yesu nithyamu నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది

    Song no: 413

    నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవు ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి ||నీవు||

    నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నిను నమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేత నిలలోన ||నీవు||

    నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల ||నీవు||

    నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీనుఁ డేడి జీవుల కును గల్గు జీవంబు లిచ్చుచు జీవాధారము లొసఁగి జీవులఁ బ్రోచెడి ||నీవు||

    నీవంటి ధనవంతుఁడేడి యేసు నా వంటి ధనహీనుఁ డేడి ప్రోవులై యున్నవి యీవులు నీయందు నీవువాని నొసంగి నిరతంబు ననుఁ గావు ||నీవు||

    Yesu kreesthu mathasthu danaga nerigi manudi jagamu యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి మనుఁడీ జగము

    Song no: 360

    యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి మనుఁడీ జగము లోపల వాసిగాఁ ప్రభు యేసు దాసులె పరమునందు ని వాసులగుదురు ||యేసు||

    యేసు క్రీస్తును నమ్మి యాయన దాసుఁడై వర్తించు నాతఁడె భాసు రంబుగఁ గ్రైస్తవుం డని ప్రాకటంబుగఁ బరగుచుండును ||యేసు||

    ఎల్ల సమయములందు ధాత్రిని యేసు నడతలఁ జూచి నడఁచుచు నుల్లమున రక్షకునిఁ దాల్చిన యోర్పరియె క్రైస్తవుఁడు సుమ్ము ||యేసు||

    క్రీస్తు నన్ను గొనెను గావున క్రీస్తువాఁడను నేన టంచును క్రైస్తవుండు గొల్చు నాతని వాస్తవమ్ముగ నాత్మ తనువుల ||యేసు||

    రాజులు యాజకులు శుద్ధులు రాజనందను లనెడు పేళ్ళను రాజ రాజగు దేవుఁ డొసఁగెను రాజితంబుఁ క్రైస్తవులకును ||యేసు||

    క్షయము లేనిది శుద్ధమైనది వ్యయము లేనిది నిత్యమైనది దయను యేసుఁ డొసంగు భాగ్యముఁ దప్పకుండఁ క్రైస్తవులకును ||యేసు||

    Ghana bhava dhupakruthu lanu matiki ne vinuthinthunu ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును

    Song no: #68

      ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత||ఘన||

    1. ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా||ఘన||

    2. జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా||ఘన||

    3. మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన||

    Deva dhivya nantha prabhava mampahi ghana దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన

    4
    రాగం - (చాయ: ) తాళం -

    Siluve na saranayenu ra nee siluve సిలువే నా శరణాయెను రా నీ సిలువే

    Song no: 198

      సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే||

    1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే||

    2. సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా ||నీ సిలువే||

    3. సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపఁగఁ జాలును రా ||నీ సిలువే||

    4. పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను నిలచినాఁడను రా ||నీ సిలువే||

    5. శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||నీ సిలువే||

    Yema ccshryamu priyulala kreesthu maranamu ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము

    Song no: 184

    ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార ఆ మహాత్ముఁడు మరణ మగు రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క జనుని చందము గాదు ఈ మహిని గల పాప జీవుల పై మహాకృపఁ జూపి నిత్య క్షేమ మొసఁగెడు కొరకు బలు శ్రమ చే మృతుండైనాఁడు స్వేచ్ఛను ||ఏమాశ్చర్యము||

    కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేఁడెను ||ఏమాశ్చర్యము||

    కడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు పట్టు వడె దానంతట తాను చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్లఁ బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా ||ఏమాశ్చర్యము||

    ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థలఁ బెట్టిరి నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి వారిఁ గరుణించి యెరుఁగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేఁడు కొనియెను ||ఏమాశ్చర్యము||

    Yesu vanti priya bandhudu nakika niha paramulalo యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న

    Song no: 174

    యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న ||యేసు||

    ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు ||యేసు||

    ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము ||యేసు||

    తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ గుందము ||యేసు||

    ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసు||

    మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును ||యేసు||

    తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||

    అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు||

    Mangalambani padare kresthuku jaya మంగళంబని పాడరే క్రీస్తుకు జయ

    Song no: #75
      మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ ||మంగళ||

    1. ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి||మంగళ||

    2. సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద దేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకు ముదముతో గనుపడిన ప్రభునకు||మంగళ||

    3. ధరణి న్గొల్చెడి దాసజ నములనుఁబ్రోచు దైవ తనయుఁడని నిజ మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి( జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు||మంగళ||

    Elantidha yesu prema nannu thulanadaka thanadhu ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు

    Song no: 165

    ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి జూపినదా ||ఈలాటిదా||

    ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచును నే దరిఁ గానకు డన్ కనికరముఁ బెంచి నా యందు వేగఁ గొని పోవ నా మేలు కొర కిందు వచ్చె ||ఈలాటి||

    పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను మునిఁగి కుములుచు నేడు పునగుందు నపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి నీతిఁజూపించె ||ఈలాటి||

    నెమ్మి రవ్వంతైన లేక చింత క్రమ్మిపొగలుచు నుండ గా నన్ను ఁ జూచి సమ్మతిని ననుఁ బ్రోవఁ దలఁచి కరముఁ జాఁచి నా చేయిబట్టి చక్కఁగా బిలిచె ||ఈలాటి||

    పనికిమాలిన వాఁడనైన నేను కనపరచు నాదోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ మును నాకుఁ జూపె ||ఈలాటి||

    నా కోర్కె లెల్ల సమయములన్ క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటి||

    శోధనలు ననుఁ జుట్టినపుడు నీతి బోధ నా మనసులోఁ బుట్టించి పెంచి బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణఁ జూపెనా యహహ యేమందు ||ఈలాటి||

    Lelemmu kraisthavuda neelo melkoni లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని

    Song no: 365

    లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని ||లేలెమ్ము||

    విడువకు యుద్ధము నుడువకబద్ధము యొడయుఁడు నీకడ నుండును బాయఁడు ||లేలెమ్ము||

    విడువకు ధైర్యము వదలకు కవచము సదయుఁడు క్రీస్తుఁడు సత్ఫల మిచ్చును ||లేలెమ్ము||

    బెదరకు మేరికి వదలకు దారిని నది యిది కానిది యాత్మను బెట్టక ||లేలెమ్ము||

    ప్రార్థన సారము వర్ధిలఁ గోరుము సార్థక కాలము వ్యర్థము చేయక ||లేలెమ్ము||

    భావములోనన్ దేవుని ప్రేమన్ నీవది వేఁడుచు నెమ్మదిఁ గూడుచు ||లేలెమ్ము||

    యేసుని సిలువ నెదుట బెట్టుకో మోసము నొందవు యేసుని కాపున ||లేలెమ్ము||

    Yesu nama mentho madhuram yesu nama యేసు నామ మెంతో మధురం యేసు నామ

    Song no: 137

    యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు ||యేసు||

    స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ ద్రుంచు ప్రభు ||యేసు||

    నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు ప్రభు ||యేసు||

    ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు ప్రభు ||యేసు||

    మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ ప్రభు ||యేసు||

    శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు ప్రభు ||యేసు||

    Sndhiyamu veedave naa manasa ya nandhamuna gudave సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే

    Song no: 390

    సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము లింకేల నిను సుఖ మొందఁ జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము లందుఁ గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము||

    చింత లిఁక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడఁ బోకుము ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము||

    పాపములు వీడుము నీ విఁకఁ బశ్చా త్తాపమున గూడుము ఏపు మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబుఁ గోరక పాపులందఱు దిరిగి వచ్చెడు కోపుఁ గోరెడు కర్త దరిఁ జని ||సందియము||

    నేరముల నెంచుకో యేసుని కరుణా సారముఁ దలంచుకో భార ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరిఁ జేర విశ్రమ మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కఁగా విని ||సందియము||

    నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందుఁ చిత్తమ్ముగాఁ కాయమ్ము బలియుడు నీప్రభునిఁ గని ||సందియము||

    ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపముఁ దోమి ని న్నకళంకుఁ జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిఁక ||సందియము||

    Painamai yunnanaya nee padhambujamula పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల

    Song no: 486

    పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల సన్నిధికిఁ ప్రభు యేసు నాతో నుండవే నీవు దీనుఁడు భవ దా ధీనుఁడ ననుఁ గృప తో నడిపించు మె దుట నదె సింహ ధ్వానముతో మృతి వచ్చు చున్నది దాని భయోత్పా తము దొలఁగింపవె ||పైనమై||

    సరణిలో నేఁబోవునపుడు శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా పరుగు కడ్డముగా నిలిచునేమో మరణపు ముళ్లను విరుచుటకును ద ద్దురవస్థలు వెసఁ దొలఁగించుటకును గరుణానిధి నా సరస నుండుమీ శరణాగతునకు మరి దిక్కెవ్వరు ||పైనమై||

    దేవా నీ దక్షిణ హస్తముతో దీనులను బట్టెద వెరవకుఁ డను నీ వాగ్దాత్తమున కిది సమయంబు ఆ వచనము నా జీవాధారము దైవము తల్లియుఁ దండ్రియు దాతవు నీవే సర్వము నిను నమ్మితి నా త్రోవ ప్రయాణము తుదముట్టించుము ||పైనమై||

    పొదుగా నీ భక్తియందు డెంద మానందించు నపుడు సందియము లెన్నెన్నో చనుదెంచి తొందర నిడు నా త్రోవను తద్గా ఢాంధత మిశ్రమ లణఁగించుటలై సుందరమగు రవి చందంబున నా ముందట నడువవె ముదమునఁ బ్రభువా ||పైనమై||

    కాలం బయ్యెను రారమ్మనుచు నీల మేఘాకృతితో వచ్చి కాలదండము జిరజిర ద్రిప్పుచు చాల భయానక లీలన్ మృత్యువు మ్రోల న్నిలిచిన వేళను దాలిమి దూలి చనుం గా బోలు భవత్కరు ణాలింగన సుఖ మత్తఱి నొసఁగవె ||పైనమై||

    నీ దివ్య రూపధ్యానంబు నిర్మలాత్మాంతర సౌఖ్యంబు నా దేవుని ప్రేమామృత సారంబు నీ దాసుని కవి నిరత మొసంగుచు నా దారిని గల సేదలు దీర్పును నాదియు మధ్యము నంతము లేని పు నాదులుగల నీ సౌధము జేర్పవె ||పైనమై||

    ఎండమావుల కీడైనట్టి యిహ సౌఖ్యములు త్వరగాఁబోవు నీ నిండు దరుగని నిత్యానందంబు దండిగ నీయం దుండిన వారి క ఖండామృత సౌ ఖ్యము లిచ్చెదవట తండ్రీ భవ దు త్తమ దాసుల నీ వుండిన చోటనె యుంచుము చాలును ||పైనమై||

    Yesu namame pavanamu maku యేసు నామమే పావనము మాకు

    Song no: 138

    యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన ||యేసు||

    సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు. ||యేసు||

    భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు ||యేసు||

    దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల ||యేసు||

    పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు||

    Popove yo lokama chalinka jalu nee pondhu పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు

    Song no: 484

    పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు మే మొల్లము పాపేచ్ఛలున్నంత సేపు నొపఁగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి ||పోపోవే||

    సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇఁ క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగఁ గ్రీస్తు పద భక్తి మా కెబ్బఁ ||బోపోవే||

    నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి దొలఁగి నిన్నుఁ జేరి దుఁఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుఁడై ననుఁబిల్చెఁ ||బోపోవే||

    ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి జూపి లోభము బుట్టించి ననుఁబట్టి పరిమార్చితివి యింక మరి యేమున్నది చాలుఁ ||బోపోవే||

    ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ గర్వముచే నీ యండఁ జేరితిఁగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు డిపు డిచ్చుఁ ||బోపోవే||

    Dhasula prarthana dhappika yosagedu దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు

    Song no: 373

    దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట ||దాసుల||

    జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస మిడునఁట ||దాసుల||

    మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్ హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల కోర్కె లిచ్చునట ||దాసుల||

    ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్ వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత రక్షణు(డట ||దాసుల||

    Yehova maa thandri gada yesundu ma yanna gada యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ

    Song no: 435

    యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||

    మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||

    అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||

    పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||

    తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||

    పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||

    కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||

    Yerimgi yerigi chedi pothivi manasa ieka ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక

    Song no: 319

    ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ ||యెఱిఁగి||

    ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున బడితివి ||యెఱిఁగి||

    సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ జాటుగ జరిగెడి పని యేది ఇఁక జెవి గుసగుస లెల్లను దిక్కులఁ బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని ||యెఱిఁగి||

    ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో ||యెఱిఁగి||

    గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో ||యెఱిఁగి||

    పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు బశ్చాత్తాపముపడి యిక జాలించుము కలు షపు యత్నంబు ||యెఱిఁగి||

    అపరిమిత దయా శాంతులు గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి నీ యపవిత్రతఁ గని హా యని యేడ్వుము ||యెఱిఁగి||

    Devudicchina Divya vakya mi dhenu దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను

    Song no: 252

    దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవుఁ డిచ్చిన||

    భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవుఁ డిచ్చిన||

    సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవుఁ డిచ్చిన||

    ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు దోసములు నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు ||దేవుఁ డిచ్చిన||

    పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు రేనియుఁ తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని శరణు బొందను ||దేవుఁ డిచ్చిన||

    దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుఁ డిచ్చిన||

    మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

    నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

    మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు ||దేవుఁ డిచ్చిన||

    Manasanandhamu bondhuta kannanu mari ye మనసానందముఁ బొందుట కన్నను మరి యే

    Song no: 489

     మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై యుండును ||మన||

    దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును ||మన||

    సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||

    తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన ||మన||

    క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు ||మన||

    పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ గును ||మన||

    Paapula Yedala Kreesthuni priya mettidho పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో


    Song no: 187 

    పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె ల్వరిగిరిపై నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||బాపుల||
    యెరుషలేము న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా రల నోదార్చెను ||బాపుల||
    శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||
    తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్ కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||
    మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ ||బాపుల||

    Sakalendriyamulaaraa chala mee pani dhire సకలేంద్రియములారా చాల మీ పని దీరె


    Song no: 485 

    సకలేంద్రియములారాచాల మీ పనిదీరె నిఁక నన్ను విడిచిపోవు టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచేఁ జిక్కి తిని మీ రి దొలంగుఁడు యేసు నా క్షకుఁడు వచ్చెను నన్ను గావను ||సకలేంద్రియములారా||
    పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ వశముగా దిఁకను మించి మీ రెదిరింపలేరు లఁచి చూడుఁడు దేవ కృపలో నుంచి ననుఁ గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి ||సకలేంద్రియములారా||
    శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి పొమ్మిఁక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది ||సకలేంద్రియములారా||
    కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో ముసు కయ్యె నిఁకను ఘనముగల దేవుని కుమారుఁడు తన కృపాసన మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచెఁ జూడుఁడు ||సకలేంద్రియములారా||
    రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి నావు పసఁ దరిగి ముది వైతి విపు డో రసనమా యిఁకఁ దీరె నీ పని వెసను నే నిపు డేసుకరుణా రసముఁ గ్రోలుచుఁ బ్రొద్దుఁ బుచ్చెద ||సకలేంద్రియములారా||
    తను వాద్యంతము మూయఁ దగిన త్వగింద్రియమా నిను సోకునట్టి న్నియు గ్రహించితివి మునుపుగల నీ జిగిబిగియు నణం గెను గదా వ్రేలాడెఁ దిత్తులు చనుము నీ వెందైన నేనే సుని స్వరూపముఁ దాల్ప బోయెద ||సకలేంద్రియములారా||
    ఘ్రాణేంద్రియమ నీవు కడు వాసనలఁ దగిలి ప్రాణానిలము చేతఁ బ్రబలితి విఁకను నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడఁ బోదు విఁక నా త్రాణపతి యగు క్రీస్తుచేతను బ్రాణ మర్పింతును సుఖింతును ||సకలేంద్రియములారా||
    కడు దవ్వు పయనంబు నడిచి వచ్చితి నింక నిడుపు లే దా త్రోవ నికటమై వచ్చెన్ నడుమ నడుమ నడ్డుపడియెడ నిడుమ లన్నియు గడిచిపోయెను జడుతు నా మృతి నదికి నా నా వికుఁడు వచ్చెను నన్నుఁ గావను ||సకలేంద్రియములారా||
    వెనుకఁ దీరిన మార్గ మున కంటె ముందుండి కనుపించు నా త్రోవ కఠినమైన యుండు ఘన తరంగ ధ్వనుతో భీ కర మరణ నది పాఱు చున్నది క్షణము మాత్రమె దాని పని యా వెనుక నావలి యొడ్డు జేరెద ||సకలేంద్రియములారా||
    సంపారంబునం దేమి సౌఖ్యము గలదు ఆశ మాత్రమె గాని యది చిరము గాదు యేసు క్రీస్తుఁడు తండ్రి దేవుఁడు భాసురం బగు నిర్మలాత్మయు దాసులకు దమ దివ్య మగు కృప జేసి నిత్య నివాస మిత్తురు ||సకలేంద్రియములారా||