Yesayya yesayya na manchi yesayya యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా
Song no:
- యేసయ్యా యేసయ్యా
- శోధనలోన వేదనలోన
రోదనలోన బాధలలోన } 2
నీవే నన్ను విడిపించినావు
నీవే నన్ను కాపాడినావు
కడవరకు నాతోనుండెడి దేవా
కన్నీరు తుడిచి కాచేటి దేవా || యేసయ్యా యేసయ్యా ||
- తల్లియు నీవే తండ్రియు నీవే
అక్కయు నీవే అన్నయు నీవే } 2
బంధుమిత్రులే ననువిడిచిపోయినా
ఆత్మీయులే నను అవమానపరచినా
కడవరకు నాతోనుండెడి దేవా
కనుపాపవలె నను కాచేటి దేవా || యేసయ్యా యేసయ్యా ||
- ఆదియు నీవే అంతము నీవే
అల్ఫాయు నీవే ఓమెగావు నీవే } 2
సత్యము నీవే జీవము నీవే
మార్గము నీవే సర్వము నీవే
కడవరకు నాతోనుండెడి దేవా
కలకాలం నన్ను కాచేటి దేవా || యేసయ్యా యేసయ్యా ||
నా మంచి యేసయ్యా
నా తోడు నీవేనయ్యా యేసయ్యా
సరిలేరు నీకెవరయ్యా } 2
యేసయ్యా యేసయ్యా
నా మంచి యేసయ్యా!