Song no:
- అదిగదిగో అల్లదిగో
- గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో } 2
అచటనే యుండి ప్రార్ధించుడని } 2
పలికిన క్రీస్తు మాటదిగో } 2 || అదిగదిగో ||
- శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు } 2
ప్రభువును యూదులకప్పగింప } 2
పెట్టిన దొంగ ముద్దదిగో } 2 || అదిగదిగో ||
- లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై } 2
పావనుడేసుని రక్తమును గల } 2
ముప్పది రూకల మూటదిగో } 2 || అదిగదిగో ||
- చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో } 2
మూడవసారి బొంకిన వెంటనే } 2
కొక్కొరొకోయను కూతదిగో } 2 || అదిగదిగో ||
- యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే } 2
నీలో దోషము కనుగొనలేక } 2
చేతులు కడిగిన పిలాతుడాడుగో } 2 || అదిగదిగో ||
- గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున } 2
సాక్షాత్తు యెహోవా తనయుని } 2
సిలువను వేసిరి చూడదిగో } 2 || అదిగదిగో ||
- గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో } 2
యూదుల రాజా దిగి రమ్మనుచు } 2
హేళన చేసిన మూకదిగో } 2 || అదిగదిగో ||
- దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు } 2
పరిశుద్ధుడు మన రక్షకుడేసు } 2
మన మది యేమో గమనించు } 2 || అదిగదిగో ||
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో || అదిగదిగో ||
Song no:
- Adhigadhigo Alladhigo
- Gethsemanu Oka Thotadhigo
Aa Thotalo Praardhana Sthalamadhigo } 2
Achatne Yundi Praardhinchudani } 2
Palikina Kreesthu Maatadhigo } 2 || Adhigadhigo ||
- Shishyulalo Iskariyothu
Yoodhaayanu Oka Ghaathakudu } 2
Prabhuvunu Yoodhulakappagimpa } 2
Pettina Donga Muddhadhigo } 2 || Adhigadhigo ||
- Lekhanamu Neraverutakai
Ee Lokapu Paapamu Povutakai } 2
Paavanudesuni Rakthamunu Gala } 2
Muppadhi Rooka Mootadhigo } 2 || Adhigadhigo ||
- Chali Kaachukonu Gumpadhigo
Aa Pethuru Bonkina Sthalamadhigo } 2
Moodavasaari Bonkina Ventane } 2
Kokkorokoyanu Koothadhigo } 2 || Adhigadhigo ||
- Yoodhula Raajuvu Neevenaa
Modhamutho Neevannatle } 2
Neelo Dhoshamu Kanugonaleka } 2
Chethulu Kadigina Pilaathudadugo } 2 || Adhigadhigo ||
- Golgothaa Sthala Addharini
Aa Iddaru Dongala Madhyamuna } 2
Saakshaatthu Yehovaa Thanayuni } 2
Siluvanu Vesiri Choodadhigo } 2 || Adhigadhigo ||
- Golluna Yedchina Thalladhigo
Aa Thalliki Cheppina Maatadhigo } 2
Yoodhula Raajaa Digi Rammanuchu } 2
Helana Chesina Mookadhigo } 2 || Adhigadhigo ||
- Daahamu Gonuchunnaananuchu
Praanamu Vidichenu Paavanudu } 2
Parishuddhudu Mana Rakshakudesu } 2
Mana Madhi Yemo Gamaninchu } 2 || Adhigadhigo ||
Kalvari Mettaku Dhaaradhigo
Aa Prabhuvunu Vesina Siluvadhigo || Adhigadhigo ||