Lechi sthuthimpa bunudi lokeswaruni లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని

Song no: #47
    లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని లేచి స్తుతింపఁ బూనుఁడి లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతోఁ గరము జాచి కాపాడు విభుని ||లేచి||

  1. రాత్రి జాముల యందున రంజిలఁదన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసఁబ విత్ర గీతము పాడుచు ||లేచి||
  2. నిదురఁభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురఁబొంది యుదయాన లేచితిమి సదయుఁడైన క్రీస్తు పదముల దరిఁజేర ||లేచి||
  3. నిగమ వేద్యుఁడు మనలనుఁ దనలోన నీ పగలు కాపాడఁబూనెను దిగులు బొందక పనులు తెగువతోఁ జరుపుకొనుచు వగపుతో లేచి మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి ||లేచి||
  4. నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి||

Sthothramu sthothramu o deva ie vekuvane sthothramu స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే

Song no: #48
    స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా||

  1. పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య||

  2. కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా||

  3. పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా||

Vinave na vinathi nivedhana dhaya velayaga no వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో

Song no: #49
    వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా ||వినవే||

  1. నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను ||వినవే||
  2. నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా ||వినవే||
  3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేవగలు ||వినవే||
  4. పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ ||వినవే||
  5. నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు ||వినవే||

Deva neeku sthothramu e rathrilo ni velugu dheevenakai దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై

Song no: #50
    దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ||

  1. పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||
  2. చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ||
  3. నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ||

Dhinamu gathiyimmchenu dhinanadhuda pradhri venukdage దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె

Song no: #51
    దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము||

  1. సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము||
  2. కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము||
  3. తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము||
  4. ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ ||దినము||
  5. ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము ||దినము||
  6. అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ ||దినము||
  7. అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ ||దినము||
  8. దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక ||దినము||

Aakasambu bhumiyu anthata chekati yayenu ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను

Song no: #52
    ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా||

  1. చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్||

  2. చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించున్||

  3. చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూగావుమా||

  4. నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్||

  5. రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా||

  6. తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్ మేల్కొల్పుము నా ప్రియతండ్రి||

  7. జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్||

Saatileni dhaivama na yesayya సాటిలేని దైవమా నా యేసయ్యా

సాటిలేని దైవమా నా యేసయ్యా
మాటతోనే చేతువు ఏ కార్యమైనా  (2)

తోడు నీడగా వెంట ఉందువు
అన్ని వేళలా ఆదుకొందువు  (2) "సాటిలేని"

బండ నుండి నీటిని - ప్రవహింప జేసావు
ఎండిన యెముకలలో - జీవాన్ని పోసావు  (2)
నీవే నాతో ఉండగా - అపజయమే లేనేలేదుగా (2) "తోడు నీడగా"

ఆశగల ప్రాణాన్ని - సంతృప్తి పరచావు
ఆకలిగొను వారిని - మేలుతో నింపావు (2)
నీవే నాతో ఉండగా - అన్యాయము నాకు జరగదుగా (2)  "తోడు నీడగా"

నా ఎడారి భూములు - తోటగా మార్చావు
సంగీత గానము - వినిపింపజేసావు (2)
నీవే నాతో ఉండగా - అపశృతులే నాలో లేవుగా (2)  "తోడు నీడగా"