నిత్యమైన మహిమను వీడి - కోట్ల దూత గణములనొదిలి
నీతిని స్థాపించుటకు - దివి నుండి భువికి వచ్చెను } 2
భువి నడిబొడ్డున - బేత్లెహేము పురి గడ్డపై
క్రీస్తు యేసను నరునిగా - మన రాజు జన్మించెను } 2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||
దీనులకు రక్షణ వస్త్రము - కప్పు రక్షకుడు
మరణ ఛాయ నుండి - గొప్ప వెలుగుకు నడిపే మన నాయకుడు } 2
మహా సంతోషకరమైన - సువర్తమానమును
దూతలచేత పంపెను - పొలములోని గొల్లలకు } 2
నశించినవారిని సహితము - వెదకి పిలుచుటకు
దివి నుండి భువికి తండ్రి చేత పంపబడెనే - మన రక్షకుడు } 2
ఎందరో పాపులను క్షమియించి - పాపుల స్నేహితుడాయెను
జక్కయ్యలో మార్పు - ఆ దినమే ఆరంభమాయెను } 2
Song no: రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే
ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే || రారాజు పుట్టాడోయ్ ||
మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారిసూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా
అందరి తోడు నీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడెనంట
మరువని బంధమై || రారాజు పుట్టాడోయ్ ||
Song no: Raaraaju puttaadoi
maaraaju puttaadoi
soodanga raarandoi
vedanga raarandoi
Ee lokamunaku rakshakudika puttinaadandoi
mana koraku devadevudu dhigi vachinaadandoi
ningi nela pongipoye
aa thaara velasi murisipoye sambaramaayeney || Raaraaju puttaadoi ||