Yesu bhajanaye manalanu aa sugathiki యేసు భజనయే మనలను ఆ సుగతికి

Song no: #78
    యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు జేయు పలు దోసములు మోయు ||యేసు||

  1. మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ గాలావధి ఁగూల||యేసు||

  2. అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్ష యను దీక్షన్||యేసు||

  3. మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత వాటములను మీటు||యేసు||

  4. శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ మాత్రము విను మనుచున్||యేసు||

  5. మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ బావన మొనరించెను మనలన్||యేసు||

Amma viswasamma anukuva kaligundalamma అమ్మా విశ్వాసమ్మా అణుకువ కలిగుండాలమ్మా

Song no: #232

    అమ్మా విశ్వాసమ్మా అణుకువ కలిగుండాలమ్మా } 2
    భక్తిగల స్త్రీలకు తగినట్టుగా } 2
    శక్తి నాశ్రయించి బ్రతకాలమ్మా } 2 || అమ్మా విశ్వాసమ్మా ||

  1. నగలు నాణ్యత పైన అత్యాశ వలదమ్మా } 2
    క్షయముకాని శాశ్వతధనము పైన నీకు కలదమ్మా } 2
    నీ వేష భాషలలో అనుకరణ చావాలమ్మా } 2
    నీతి వస్త్రధారణనే అలంకరణ కావాలమ్మా } 2 || అమ్మా విశ్వాసమ్మా ||

  2. తేనెలాంటి తీపిమాటలు వల్లించుట దేనికమ్మా } 2
    క్రియలు లేని గొప్పబోధలు ఉపయోగం లేనివమ్మా } 2
    అనురాగం ఆత్మీయతలే నీ సంపదలవ్వాలమ్మా } 2
    యేసు ప్రేమ ప్రతిరూపముగా ఇల నీవు నిలవాలమ్మా } 2 || అమ్మా విశ్వాసమ్మా ||

  3. మెడలోనే సిలువ ధరిస్తే నీకేమి లాభమమ్మా } 2
    జీవితాన సిలువను మోస్తే నిత్యమైన జీవమమ్మా } 2
    గుడిలోన దేవదూతలా కనిపిస్తే సరిపోదమ్మా } 2
    ప్రతిచోట క్రీస్తుదివ్వెలా వెలుగిస్తే సిరి నీదమ్మా } 2 || అమ్మా విశ్వాసమ్మా ||


Vijaya geethamul padare kreesthunaku విజయ గీతముల్ పాడరే క్రీస్తునకు

Song no: #77
    విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ పాడరే వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్ హృదయములతో భజన జేయుచు నిత్యమున్ ||విజయ||

  1. మంగళముగ యేసుఁడే మనకు అక్షణ శృంగమై మరి నిల్చెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు మీరఁగఁదన రక్తబలము వలనఁ పొంగు నణఁగఁజేసెను సాతానుని బల్ క్రుంగ నలిపి చీల్చెను||విజయ||

  2. పాపముల్ దొలఁగింపను మనలను దన స్వ రూపంబునకు మార్పను శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరియించెను పాప మెరుఁగని యేసు పాపమై మనకొరకు పాపయాగము దీర్చెను దేవుని నీతిన్ ధీరుఁడై నెరవేర్చెను||విజయ||

  3. సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన వానికి చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ జేసిన వానికిఁ కొలువుఁజేతుమెగాని ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాల విలువ గలదని చాటుచు||విజయ||

Kreesthuyesunaku mamgalam ma keerthi rajunaku క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు

Song no: #76
    క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును కూడి పాడుదు మంగళం||

  1. ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం ||క్రీస్తు||

  2. జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు ప్రేమజూపిన అమరతేజుడ మంగళం ||క్రీస్తు||

  3. ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం ||క్రీస్తు||

  4. మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం ||క్రీస్తు||

  5. జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తు||

Vandhaname yesunaku varasugunodharunaku వందనమే యేసునకు వరుసుగుణోదారునకు

Song no: #74
    వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర నీకు ||వందనమే||

  1. యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ ప్రభువుల ప్రభువునకు||వందనమే||

  2. ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు||వందనమే||

  3. మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ బరమేశ్వర నీకు||వందనమే||

  4. రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు భువనావన నీకు||వందనమే||

  5. ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము లర్పింతుము నీకు||వందనమే||

Mangalamu badare kreesthunaku jaya మంగళము బాడరె క్రీస్తునకు జయ

Song no: #72
    మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||

  1. రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||

  2. కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ||మంగళము||

  3. సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||

Deva kumara dhinopakara na vanka దేవ కుమారా దీనోపకారా నా వంక

Song no: #70
    దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా ||దేవ||

  1. వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా ||దేవ||

  2. పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు ||దేవ||

  3. వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా ||దేవ||

  4. భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా ||దేవ||

  5. కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు ||దేవ||

  6. మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా ||దేవ||