Ghanudaina yehova gaddhe mumdhata ఘనుడైన యెహోవా గద్దె ముందట

Song no: #61
    ఘనుఁడైన యెహోవా గద్దె ముందట మీరు వినతు లిప్పుడు చేయుడి యోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనం బొప్పుచుండనో జనులార ||ఘనుఁడైన||

  1. ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించు సంహరించు ననియున్ నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే మక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె మృత్తుచే మానవులఁగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరఁ దిరుగఁదన దొడ్డిఁబెట్టెనో జనులారా ||ఘనుఁడైన||
  2. మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలో మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ సహితముగను భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ బొందైన నీ నగరి కా ధామంబులను గాన సన్నుతి వితతిపూరి తమ్ములుగఁ జేయు దేవా యో జనులారా ||ఘనుఁడైన||
  3. ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ తగ విరహితాద్యంతమై స్థిరమైన కాలంబువలెనె యున్న దయదయ పొరలిపోవుచు నున్నవత్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు సత్యంబు నిలిచియుండున్ వర శిలా ఖండ పర్వతము తోడను సాటి వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులారా ||ఘనుఁడైన||

Sukshema shubhakala visranthi dhinama సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా

Song no: #59
    సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచారమెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున మా త్ర్యేక దేవ స్తుతిఁగావింతు మెంతయు.

  1. నీయందు సృష్టికర్త విశ్రామ మొందెను నీయందు యేసుక్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెను నీ యందు పావనాత్మ మాకియ్యఁ బడెను.
  2. భూవాసు లీ దినంబు సంతోషపడుచు సువార్త విని, పాడి మా యేసు స్తోత్రము ప్రితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు.

Iedhi yehova kaliginchina dhinamu ఇది యెహోవా కలిగించిన దినము

Song no: #58
    ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||

  1. మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||
  2. అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||
  3. ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||
  4. సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ బ్రచురముఁ జేయుదు ||యిది||
  5. దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది||

O rakshaka nee dhivya namamu ఓ రక్షకా నీ దివ్య నామము

Song no: #57
    ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మెందు వేళయం దను గ్రహించు నీదు దీవెనన్.

  1. గృహంబుఁ జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదా ఇచ్చట సేవఁ జేయు మమ్మును పాపంబుఁ జేయకుండఁగాయుము.
  2. మా చుట్టు నుండు మబ్బునఁ ప్రభో నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా పాపాంధకా బాధ నుండి నీ బిడ్డల మైన మమ్ముఁ బ్రోవుమా.

Rathriyayyena nnedabayaku dhathripai రాత్రియయ్యెన న్నెడఁబాయకు ధాత్రిపైఁ

Song no: #56
    రాత్రియయ్యెన న్నెడఁబాయకు ధాత్రిపైఁ జీఁకతులుఁ గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుఁడా, నన్ బాసిపోకుమీ.

  1. ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వఁజాలను నీకంటె నాకు లేదుగా లోక ప్రకాశుఁడా, నన్ బాయకు.
  2. నా చెంత నీవు చేరియుండఁగ ఏ చింతయైన నన్ను సోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా? నా శైలమా, నన్ బాసిపోకుమా.
  3. సమృద్ధుఁడు సహాయుఁ డాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయమబ్బునా? మా మధ్యమున్ సర్వేశ పాయకు.
  4. రేవు నేఁ జేరఁబోవు వేళలోన్ కావుమయ్యా నీ దీప్తిఁ జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్ బాసిపోకుము.

Prosshu grumkuchunnadhi saddhanagucunnadhi ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది

Song no: #55
    ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా స్తుతించుఁడి. || శుద్ధ, శుద్ధ, శుద్ద సర్వేశుఁడా యిద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ||

  1. జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండఁగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.
  2. నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్ మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు.

Aanandham pongindhi aparadham poyindhi ఆనందం పొంగిందీ అపరాధం పోయింది

Song no:
HD
    ఆనందం పొంగిందీ - అపరాధం పోయింది
    జీవితం మొదలైంది - ఈ అనుభవము నాలో } 2
    రక్షణ ఆనందం - శ్రీ యేసు నీ జననం
    తీయని అనురాగం - నీతోనే నా పయనం } 2
    ఊహించిన వివరించిన - సరపోదయ్యా } 2 || ఆనందం ||

  1. చీకటి ఆవరించే నెమ్మదిలేక - కలవరమాయె నీవు లేక } 2
    నా హృదయంలో జన్మించిన క్షణం - పగలు రేయి పరవశిస్తున్న ప్రతీదినం } 2
    కనుల పండుగ... గుండె నిండుగా... } 2 || ఆనందం ||

  2. ఎదురు చూసాను గమ్యం లేక - నీవొస్తావని చిన్ని కోరిక } 2
    దిగివచ్చావు శరీరదారియై - తరియించింది మానవాళి ఏకమై } 2
    నీ జన్మము... సమాధానము...} 2 || ఆనందం ||