మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె (2)
పాకలో పుట్టె పాకలో పుట్టె (2) || మన యేసు ||
- గొల్లలంతా దూత ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి నమస్కరించిరి (2) || మన యేసు ||
- జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2) || మన యేసు ||
Mana Yesu Bethlahemulo
Chinna Pashula Paakalo Putte (2)
Paakalo Putte Paakalo Putte (2) ||Mana Yesu||
Gollalanthaa Dootha Dwaaraa
Yesuni Yoddaku Vachchiyundiri (2)
Vachchiyundiri Namaskarinchiri (2) ||Mana Yesu||
Gnaanulanthaa Chukka Dwaaraa
Yesuni Yoddaku Vachchiyundiri (2)
Vachchiyundiri Kaanukalichchiri (2) ||Mana Yesu||
వినుమా యేసుని జననము
కనుమా కన్య గర్భమందున (2)
పరమ దేవుని లేఖనము (2)
నెరవేరే గైకొనుమా (2)
ఆనందం విరసిల్లె జనమంతా
సంతోషం కలిగెను మనకంతా
సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత
చిరజీవం దిగివచ్చె భువికంతా || వినుమా ||
- గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట
చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి
మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన
ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా || వినుమా ||
- పాపులనంతా రక్షింపగా
పరమును విడిచె యేసు (2)
దీనులకంతా శుభవార్తేగా (2)
నడువంగ ప్రభువైపునకు (2) || ఆనందం ||
- అదిగో సర్వలోక రక్షకుడు
దివినుండి దిగివచ్చినాఁడురా (2)
చూడుము యేసుని దివ్యమోమును (2)
రుచియించు ప్రభుని ప్రేమను (2) || ఆనందం ||
Vinumaa Yesuni Jananamu
Kanumaa Kanya Garbhamanduna (2)
Parama Devuni Lekhanamu (2)
Neravere Gaikonumaa (2)
Aanandam Virasille Janamanthaa
Santhosham Kaligenu Manakanthaa
Soubhaagyam Pranaville Prabhu Chentha
Chirajeevam Digi Vachche Bhuvikanthaa ||Vinumaa||
Gollalochche Dootha Dwaaraa – Saagilapadi Mrokkiranta
Chukka Choochi Gnaanulu Vachchiri – Yesunu Choochi Kaanukalichchiri
Manakosam Puttenanta – Pashuvula Paakalona
Entha Masthu Devudanna – Rakshanane Thechchenannaa ||Vinumaa||
Paapulananthaa Rakshimpagaa
Paramunu Vidiche Yesu (2)
Deenulakanthaa Shubhavaarthegaa (2)
Naduvanga Prabhu Vaipunaku (2) ||Aanandam||
Adigo Sarvaloka Rakshakudu
Divinundi Digi Vachchinaaduraa (2)
Choodumu Yesuni Divya Momunu (2)
Ruchiyinchu Prabhuni Premanu (2) ||Aanandam||
నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
చెంత చేరి సంతసించుమా (2)
స్వంతమైన క్రీస్తు సంఘమా || నింగిలో ||
- పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) || నింగిలో ||
- సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2) || నింగిలో ||
Ningilo Devudu Ninu Chooda Vachchaadu
Aa Neethi Sooryudu Shree Yesu Naadhudu (2)
Chentha Cheri Santhasinchumaa (2)
Swanthamaina Kreesthu Sanghamaa ||Ningilo||
Paapaala Pankilamai Shokaalakankithamai
Maraninchi Mana Kosam Karuninchi Aa Daivam (2)
Deena Jana Rakshakudai Deva Devuni Suthudai (2)
Janminche Nee Kosam Dhanyamu Cheyagaa (2) ||Ningilo||
Saathaanu Shodhanale Shaapaala Vedanalai
Vilapinche Deenulakai Alarinchu Deevenalai (2)
Sharanamai Udayinche Tharunamau Ee Vela (2)
Gunde Gudi Paanupulo Cherchukona Raavela (2) ||Ningilo||
చలి చలి గాలులు వీచే వేళ
తళ తళ మెరిసింది ఓ నవ్యతార ఆ....... ఓ...... } 2
- యూదయు దేశాన బేత్లెహేములో
ఆ ప్రభు జన్మించే పశుశాలలోన } 2
కన్య ఒడియే ఉయ్యాలా
ఆమె లాలనే జంపాలా } 2|| చలి చలి గాలులు ||
- తురుపు జ్ఞానులు బంగరు సాంబ్రాణి
బోళంబులతో ఎతించిరి నాడు } 2
రాజాధి రాజా హోసన్నా
రవికోటి తేజ ఏసన్న } 2|| చలి చలి గాలులు ||
బెత్లెహేము గ్రామములోన
క్రీస్తు యేసు జన్మించినాడే
ఆ పశువుల పాకలోన
ప్రభు యేసు జన్మించినాడే } 2
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కీష్టులైన మనషులకు భూమి మీద సమాదానం } 2
- దేవుని స్వరూపము కలిగినవాడై
దాసుని స్వరూపము ధరించుకొని
తన్నుతాను రిక్తునిగా చేసుకొని
ఆకారమందు మనుషుడాయేనే } 2
సిల్వ మరణం పొందినంతగా
- తన్నుతాను తగ్గిచ్చుకొనెను } 2
మరణమొంది మూడవ దినమునాడు
-మృత్యుజయుడై తిరిగి లేచినాడే} 2 || బెత్లెహేము ||
- ఆయన ఎదుట ప్రతి మోకాళ్లు వంగున్
ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనును
అధికంగా ఆయనను హెచ్చించేదం
యేసు నామమునే గొప్ప చేసెదాము } 2
పరలోకమునకు వెళ్ళి దూతల మీదను
-అధికారుల మీదను శక్తుల మీదను } 2
అధికారం పొందినవాడై
-దేవుని కుడి పార్శమున ఉన్నాడు } 2 || బెత్లెహేము ||
జనులారా స్తుతియించుడి
ఇది యేసుక్రీస్తుని జన్మదినం
ప్రజలారా సేవించుడి
ఇది రక్షకుడు వెలసిన పర్వదినం } 2
- పాపుల శాపపు భారముకై
దేవుడు వెలసిన దివ్యదినం
పాప శాప విమోచనకై
దైవము వెలసిన మహాదినం } 2 || జనులారా ||
- ఆశ నిరాశలలో కృంగిన లోకములో
ఆశ నిరాశలతో కృంగిన లోకములో
ఆధరణకర్తగా
ప్రభు వెలసిన దివ్యదినం } 2 || జనులారా ||
- రాజుల రాజునిగా
ప్రభువుల ప్రభువునిగా } 2
భువినేలు రారాజుగా
ప్రభు వెలసిన పర్వదినం } 2 || జనులారా ||
రారండోయ్ రారండోయ్ జనులారా..
మీరంతా ఈ వార్తను విన్నారా... } 2
దేవదూత వచ్చింది శుభవార్త తెచ్చింది } 2
ఏమని.....
లోకానికి రక్షకుడే వచ్చాడని
ఈ లోకానికి రక్షకుడే వచ్చాడని } 2
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ } 2
- బెత్లెహేము పురముకు ఆ గొర్రెల కాపరులు
పరుగు పరుగునెల్లి ఆ శిశువును పూజించె } 2
బ్రతుకుల్లో సంబరాలే ఆ రోజుతొ వచ్చాయిలే
ప్రకటించె ఈ వార్తని మన యేసు పుట్టాడని } 2
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ } 2
- తార చూపు దారిలో ఆ శిశువును చూడాలని
తూర్పు దేశ జ్ఞానులు తరలి తరలి వెళ్లారు } 2
పశువుల పాకలోనే ఆ శిశువును చూశారులే
బంగారము బోళము సాంబ్రాణులనర్పించెను } 2
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ } 2 || రారండోయ్ ||