• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Naa arpanalu neevu parishuddhaparachuchunnavani నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

Song no: 128

    నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని
    యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద } 2
    నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని } 2

  1. ఆధారణలేని ఈ లోకములో
    ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే } 2
    అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో
    అరణ్యవాసమే  మేలాయెనే } 2 || నా అర్పణలు ||

  2. గమ్యమెరుగని వ్యామోహాలలో
    గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే } 2
    గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో
    షాలేము నీడయే నాకు మేలాయెనే } 2 || నా అర్పణలు ||

  3. మందకాపరుల గుడారాలలో
    మైమరచితినే మమతను చూపిన నీపైనే } 2
    మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
    సీయోనుధ్యానమే నాకు మేలాయెను } 2 || నా అర్పణలు ||

Share:

Neevugaka yevarunnaru naku ielalo yesayya నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య

Song no: 122

    నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2
    నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2

  1. ఘోరపాపముతో నిండిన నా హృదిని
    మార్చితివే  నీదరి చేర్చితివే } 2
    హత్తుకొని ఎత్తుకొని
    తల్లివలె నన్ను ఆదరించితివే } 2 || నీవుగాక ||

  2. అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో
    వెదకితివే నావైపు తిరిగితివే } 2
    స్థిరపరచి బలపరచి
    తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2 || నీవుగాక ||


Share:

Naa yesayy nee dhivya premalo naa jeevitha నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం

Song no: 120
    నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
    నా జీవితం  - పరిమళించెనే } 2

  1. ఒంటరిగువ్వనై  - విలపించు సమయాన
    ఓదర్చువారే - కానరారైరి } 2
    ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2 || నా యేసయ్య ||

  2. పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
    పూర్ణబలముతో - ఆరాధించెద } 2
    నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||

  3. జయించిన నీవు - నా పక్షమైయుండగా
    జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2
    జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||

Share:

Nithyasrayadhurgamaina yesayya tharatharamulalo నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో

Song no: 119

    నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య
    తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి } 2
    ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే } 2 || నిత్యా ||

  1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు
    నీ మార్గములలో నన్ను నడిపించెనే } 2
    నా నిత్యరక్షణకు కారణజన్ముడా
    నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య } 2 || నిత్యా ||

  2. నా అభిషిక్తుడా నీ కృపావరములు
    సర్వోత్తమమైన మార్గము చూపెనే } 2
    మర్మములన్నియు బయలుపరుచువాడా
    అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య } 2 || నిత్యా ||

Share:

Naa geetharadhanalo yesayya nee krupa నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే

Song no: 117

    నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
    నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) || నా గీతా ||

  1. నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
    చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)
    నీ కృప నాలో అత్యున్నతమై
    నీతో నన్ను అంటు కట్టెనే (2) || నా గీతా ||

  2. చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
    సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)
    నిశ్చలమైన రాజ్యము కొరకే
    ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) || నా గీతా ||

  3. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
    ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)
    ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
    నే వేచియుందునే నీ రాకడకై (2) || నా గీతా ||

Share:

Viswasamu lekunda deviniki estulaiyunduta asadhyamu విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము

Song no: 116
    విశ్వాసము లేకుండా దేవునికి
    ఇష్టులైయుండుట అసాధ్యము
    విశ్వాసము ద్వారా మన పితరులెందరో
    రాజ్యాల్ని జయించినారు.......

  1. హనోకు తన మరణము చూడకుండ
    పరమునకు ఎత్తబడిపోయెనుగా } 2
    ఎత్తబడకమునుపే దేవునికి
    ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను } 2 || విశ్వాసము ||

  2. నోవహు దైవభయము గలవాడై
    దేవునిచే హెచ్చింపబడిన వాడై } 2
    ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
    నీతికే వారసుడని సాక్షమొందెను } 2 || విశ్వాసము ||

  3. మోషే దేవుని బహుమానము కొరకై
    ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి } 2
    శ్రమలనుభవించుటయే భాగ్యమని
    స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను } 2 || విశ్వాసము ||

  4. వీరందరు సాక్ష్యము పొందియున్నను
    మనము లేకుండా సంపూర్ణులు కారు } 2
    అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
    మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము } 2 || విశ్వాసము ||
Share:

Naa pranama nalo neevu yendhukila krungiyunnavu నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా క్రుంగియున్నావు

Song no: 113

  1. నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా క్రుంగియున్నావు? } 2
    దేవునివలన ఎన్నో మేళ్ళను అనుభవించితివే } 2
    స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా } 2

    ఎందుకిలా జరిగిందనీ యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని
    సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే } 2
    ఎందుకిలా జరిగిందనీ.....

  2. నా హృదయమా ఇంకెంతకాలము ఇంతగ నీవు కలవరపడుదువు? } 2
    దేవునిద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే } 2
    అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? } 2 || ఎందుకిలా ||

  3. నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా } 2
    దేవుడుచేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా } 2
    బ్రతుకు దినములన్నియు నీవు ఉత్సాహగానము చేయుమా } 2 || ఎందుకిలా ||



Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages