-->
Song no: 120
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో నా జీవితం - పరిమళించెనే } 2
ఒంటరిగువ్వనై - విలపించు సమయాన ఓదర్చువారే - కానరారైరి } 2 ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2 || నా యేసయ్య ||
పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరాధించెద } 2
నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||
జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||
Song no: 119
నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి } 2
ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే } 2 || నిత్యా ||
నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు
నీ మార్గములలో నన్ను నడిపించెనే } 2
నా నిత్యరక్షణకు కారణజన్ముడా
నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య } 2 || నిత్యా ||
నా అభిషిక్తుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే } 2
మర్మములన్నియు బయలుపరుచువాడా
అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య } 2 || నిత్యా ||
Song no: 117
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) || నా గీతా ||
నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే (2) || నా గీతా ||
చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) || నా గీతా ||
ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2) || నా గీతా ||
Song no: 116
విశ్వాసము లేకుండా దేవునికి
ఇష్టులైయుండుట అసాధ్యము
విశ్వాసము ద్వారా మన పితరులెందరో
రాజ్యాల్ని జయించినారు.......
హనోకు తన మరణము చూడకుండ
పరమునకు ఎత్తబడిపోయెనుగా } 2
ఎత్తబడకమునుపే దేవునికి
ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను } 2 || విశ్వాసము ||
నోవహు దైవభయము గలవాడై
దేవునిచే హెచ్చింపబడిన వాడై } 2
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
నీతికే వారసుడని సాక్షమొందెను } 2 || విశ్వాసము ||
మోషే దేవుని బహుమానము కొరకై
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి } 2
శ్రమలనుభవించుటయే భాగ్యమని
స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను } 2 || విశ్వాసము ||
వీరందరు సాక్ష్యము పొందియున్నను
మనము లేకుండా సంపూర్ణులు కారు } 2
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము } 2 || విశ్వాసము ||
Song no: 113
నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా క్రుంగియున్నావు ? } 2
దేవునివలన ఎన్నో మేళ్ళను అనుభవించితివే } 2
స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా } 2
ఎందుకిలా జరిగిందనీ యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని
సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే } 2
ఎందుకిలా జరిగిందనీ.....
నా హృదయమా ఇంకెంతకాలము ఇంతగ నీవు కలవరపడుదువు? } 2
దేవునిద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే } 2
అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? } 2 || ఎందుకిలా ||
నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా } 2
దేవుడుచేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా } 2
బ్రతుకు దినములన్నియు నీవు ఉత్సాహగానము చేయుమా } 2 || ఎందుకిలా ||
నా ప్రాణమా నాలో నీవు
ఎందుకు కృంగియున్నావు
యెహోవాయందే ఇంకను
నిరీక్షణ ఉంచుము నీవు (2) || నా ప్రాణమా ||
ఈతి బాధల్ కఠిన శ్రమలు
అవమానములే కలిగిన వేళ (2)
నీ కొరకే బలియైన యేసు
సిలువను గూర్చి తలపోయుమా (2)
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) || నా ప్రాణమా ||
ఆప్తులంతా నిను వీడిననూ
శత్రువులే నీపై లేచిననూ (2)
తల్లి అయినా మరచినా మరచున్
నేను నిన్ను మరువాననినా (2)
యేసుని ప్రేమన్ తలపోయుమా
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) || నా ప్రాణమా ||
ఐశ్వర్యమే లేకున్ననూ
సౌఖ్య జీవితమే కరువైననూ (2)
ప్రభు సేవలో ప్రాణములనే
అర్పించవలసి వచ్చిననూ (2)
క్రీస్తునికే అంకితమై ఆనందించు
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) || నా ప్రాణమా ||
Naa Praanamaa Naalo Neevu
Enduku Krungiyunnaavu
Yehova Yande Inkanu
Nireekshana Unchumu Neevu (2) ||Naa Praanamaa||
Eethi Baadhal Katina Shramalu
Avamaanamule Kaligina Vela (2)
Nee Korake Baliyaina Yesu
Siluvanu Goorchi Thalapoyumaa (2)
Alpakaala Shramala Pidapa
Mahimatho Ninu Nimpunu Prabhu Naa Praanamaa (2) ||Naa Praanamaa||
Aapthulantha Ninu Veedinanoo
Shathruvule Neepai Lechinanoo (2)
Thalliainaa Marachina Marachun
Nenu Ninnu Maruvaananinaa (2)
Yesuni Preman Thalapoyumaa
Aashrayinchu Prabhuni Naa Praanamaa (2) ||Naa Praanamaa||
Aiashwaryame Lekunnanoo
Soukhya Jeevithame Karuvainanoo (2)
Prabhu Sevalo Praanamulane
Arpinchavalasi Vachchinanoo (2)
Kreesthunike Ankithamai Aanandinchu
Prabhu Raakakai Kanipettumaa Naa Praanamaa (2) ||Naa Praanamaa||
Song no: 112
నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే ....
శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం.... } 2 || నేను యేసుని ||
అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా } 2
ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. . . . } 2 || నేను యేసుని ||
రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును.... } 2
గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును } 2 || నేను యేసుని ||
అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి } 2
నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను } 2 || నేను యేసుని ||