Yesu devuni asrayinchuma sodhara sodhari యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ

Song no:
HD
    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే
    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమార్గాన

  1. రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
    మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
    విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును } 2
    యేసు నందు విశ్వాసముంచుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
    మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను
    నీవు అడుగుము నీకివ్వబడును } 2
    యేసుని ప్రార్థించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  3. శోధనలెన్నైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా
    యధారతకు నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను
    సహసము చూపుము సమకూడి జరుగును } 2
    యేసు నందు నిరీక్షించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే
    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

Na yedhuta neevu therichina thalupulu నా ఎదుట నీవు తెరిచిన తలుపులు

Sthuthi ganame padanaa jayageethame paadanaa స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా

Song no: 143
HD
    స్తుతి గానమే పాడనా
    జయగీతమే పాడనా (2)
    నా ఆధారమైయున్న
    యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
    జీవితమంతయు సాక్షినై యుందును (2) || స్తుతి ||

  1. నమ్మదగినవి నీ న్యాయ విధులు
    మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
    నీ ధర్మాసనము – నా హృదయములో
    స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) || స్తుతి ||

  2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
    లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
    నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
    కృపావరములతో నను – అలంకరించితివే (2) || స్తుతి ||

  3. నూతనమైనది నీ జీవ మార్గము
    విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
    నీ సింహాసనము – నను చేర్చుటకై
    నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) || స్తుతి ||

Sthuthi Gaaname Paadanaa
Jayageethame Paadanaa (2)
Naa Aadhaaramaiyunna
Yesayyaa Neeku – Kruthagnudanai
Jeevithamanthayu Saakshinai Yundhunu (2)     ||Sthuthi||

Nammadhaginavi Nee Nyaaya Vidhulu
Melimi Bangaaru Kante – Entho Korathaginavi (2)
Nee Dharmaasanamu – Naa Hrudayamulo
Sthaapinchabadiyunnadhi – Parishuddhaathmuniche (2)     ||Sthuthi||

Shreshtamainavi Neevichchu Varamulu
Loukika Gnaanamu Kante – Entho Upayukthamainavi (2)
Nee Shreshtamaina – Paricharyalakai
Krupaavaramulatho Nanu – Alankarinchithive (2)     ||Sthuthi||

Noothanamainadhi Nee Jeeva Maargamu
Vishaala Maargamu Kante – Entho Aashinchadhaginadhi (2)
Nee Simhaasanamu – Nanu Cherchutakai
Naatho Neevuntive – Naa Guri Neevaithive (2)     ||Sthuthi||

Sthuthi ganama na yesayya nee thyagame స్తుతి గానమా నా యేసయ్య నీ త్యాగమే

Song no: 63

స్తుతి గానమా నా యేసయ్య
నీ త్యాగమే నా ధ్యానము
నీ కోసమే నా శేష జీవితం || స్తుతి గానమా ||

నా హీన స్థితిచూచి
నా రక్షణ శృంగమై } 2
నా సన్నిధి నీ తోడని
నను ధైర్యపరచినా } 2
నా నజరేయుడా } 2 || స్తుతి గానమా ||

నీ కృప పొందుటకు
ఏ యోగ్యత లేకున్నను } 2
నీ నామ ఘనతకే నా
శాశ్వత నీ కృపతో } 2
నను నింపితివా } 2 || స్తుతి గానమా ||

Thallikunnadha thandrikunnadha nee prema jali yesayya తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమజాలి యేసయ్యా



Yehovaye na kapariga nakemi kodhuvagunu యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును

Song no: 83
    యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగును    (2X)

  1. పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును
    శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును || యెహోవాయే ||

  2. గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను
    నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును || యెహోవాయే ||

  3. నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి
    నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లు చున్నది || యెహోవాయే ||

  4. నా బ్రతుకు దినంబులన్నియును - ని కృపాక్షేమాలే నా వెంట వచ్చును
    నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ నాశింతును || యెహోవాయే ||

Nerpabadenu naku vechiyunduta mounamuga నేర్పబడెను నాకు వేచియుండుట మౌనముగా ఉండుటే

Song no:
HD
    నేర్పబడెను నాకు వేచియుండుట
    మౌనముగా ఉండుటే సెలవాయెను } 2
    విధేతయను నీవు నేర్చుకుంటివా శ్రమలయందున } 2
    ప్రార్థించుట నేర్పు దేవా నీ సన్నిధిలో } 2

  1. ఉపదేశం క్రమము నాకు తెలియజేయబడెన్
    లోబడే స్వభావమే కిరీటమాయెను } 2
    నేలవరకు తగ్గించుకొనుట కీర్తియాయెను
    అర్పించబడుట కరిగిపోవుట ప్రీతిఆయెను } 2

    నేర్పబడెను నాకు వేచియుండుట
    మౌనముగా ఉండుటే సెలవాయెను

  2. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమాయెను
    దండించబడుట నాకు ఆహారమాయెను } 2
    మాదిరిగనే ముందు నడుచుట శ్రేష్టమాయెను
    ప్రతిష్టించబడిన జీవితం ప్రాణమాయెను } 2

    నేర్పబడెను నాకు వేచియుండుట
    మౌనముగా ఉండుటే సెలవాయెను

  3. యేసు కొరకే బ్రతుకుట నా ఊపిరాయెను
    యేసు వలెనే మార్చబడుటే గురీయాయెను } 2
    సీయోనులో నేనుండుటయే నాపిలుపుఆయెను
    విశ్వాస బాషా పలుకుట నా విజయమాయెను } 2

    నేర్పబడెను నాకు వేచియుండుట
    మౌనముగా ఉండుటే సెలవాయెను } 2