Raksha naa vandhanalu sree rakshaka naa vandhanalu రక్షకా నా వందనాలు శ్రీరక్షకా నా వందనాలు

Song no: 29

    రక్షకా నా వందనాలు - శ్రీరక్షకా నా వందనాలు

  1. ధరకు రాకముందె భక్త - పరుల కెరుకైనావు || రక్షకా ||

  2. ముందు జరుగు నీ చరిత్ర - ముందె వ్రాసిపెట్టినావు || రక్షకా ||

  3. జరిగినపుడు చూచి ప్రవ - చనము ప్రజలు నమ్మినారు || రక్షకా ||

  4. నానిమిత్తమై నీవు - నరుడవై పుట్టినావు || రక్షకా || - (లూకా 2 అ)

  5. మొట్టమొదట సాతాను - మూలమూడ గొట్టినావు || రక్షకా || - (మత్తయి4:10)

  6. పాపములు పాపముల - ఫలితములు గెలిచినావు || రక్షకా || - (1పేతురు 2:21-23)

  7. నీవె దిక్కు నరులకంచు - నీతిబోధ చేసినావు || రక్షకా || - (యోహాను 14:10)

  8. చిక్కుప్రశ్న లాలకించి - చిక్కుల విడదీసినావు || రక్షకా || - (మత్తయి 22:21)

  9. ఆకలిగలవారలకు - అప్పముల్ కావించినావు || రక్షకా || - (యోహాను 6:12)

  10. ఆపదలోనున్న వారి - ఆపద తప్పించినావు || రక్షకా || - (మత్తయి 8:26)

  11. జబ్బుచేత బాధనొందు - జనుని జూడ జాలినీకు || రక్షకా || - (మత్తయి 9:36)

  12. రోగులను ప్రభావముచే - బాగుచేసి పంపినావు || రక్షకా || - (మార్కు 5:30)

  13. మందు వాడకుండ జబ్బు - మాన్పి వేయగలవు తండ్రి || రక్షకా || - ( మార్కు 2:12)

  14. వచ్చినవారందరికి - స్వస్థత దయ చేయుదువు || రక్షకా || - (మార్కు 1:32,33)

  15. అప్పుడును యిప్పుడును - ఎప్పుడును వైధ్యుడవు || రక్షకా || - (హెబ్రీ 13:8)

  16. నమ్మలేని వారడిగిన - నమ్మిక గలిగింపగలవు || రక్షకా || - (మార్కు9:24)

  17. నమ్మగలుగు వారి జబ్బు - నయముచేసి పంపగలవు || రక్షకా || - (మత్తయి 9:29)

  18. రోగిలోని దయ్యములను - సాగదరిమి వేసినావు || రక్షకా || - (మత్తయి 17:18)

  19. దయ్యముపట్టినవారి - దయ్యమును దరిమినావు || రక్షకా || - (మార్కు 5:13)

  20. బ్రతుకు చాలించుకొన్న - మృతులను బ్రతికించినావు || రక్షకా || - (లూకా 7:15)

  21. పాపులు సుంకరులు ఉన్న - పంక్తిలో భుజించినావు || రక్షకా || - (లూకా 15:2)

  22. మరల నీవు రాకముందు - గురుతు లుండునన్నావు || రక్షకా || - (మత్తయి 24 అధ్యా)

  23. చంపుచున్న శత్రువులను - చంపక క్షమించినావు || రక్షకా || - (లూకా 23:34)

  24. రాకవెన్క అధికమైన - శ్రమలు వచ్చునన్నావు || రక్షకా || - (మత్తయి 24:21)

  25. క్రూరులు చంపంగ నా - కొరకు మరణమొందినావు || రక్షకా || - (థెస్స 5:10)

  26. పాపములు పరిహరించు - ప్రాణరక్తమిచ్చినావు || రక్షకా || - (యోహాను 19:34; మత్తయి 27:50)

  27. పాపభారమెల్లమోసి - బరువు దించివేసినావు || రక్షకా || - (యెషయి 53 అధ్యా)

  28. వ్యాధిభారమెల్ల మోసి - వ్యాధి దించివేసినావు || రక్షకా || - (యెషయి 53)

  29. శిక్షభారమెల్లమోసి - శిక్షదించివేసినావు || రక్షకా || - (యెషయి 53)

  30. మరణమొంది మరణభీతి - మరలకుండ జేసినావు || రక్షకా || - (హెబ్రీ 2:14)

  31. మరణమున్ జయించిలేచి - తిరిగి బోధజేసినావు || రక్షకా || - (అపో.కా.1:3)

  32. నిత్యము నాయొద్దనుండ - నిర్ణయించుకొన్నావు || రక్షకా || - (మత్తయి 28:20)

  33. సృష్టికి బోధించుడని - శిష్యులకు చెప్పినావు || రక్షకా || - (మార్కు 16:15)

  34. నమ్మి స్నానమొందరక్ష - ణంబు గల్గునన్నావు || రక్షకా ||

  35. దీవించి శిష్యులను - దేవలోకమేగినావు || రక్షకా || - ( లూకా 24:51)

  36. నరకము తప్పించి మోక్ష - పురము సిద్ధపరచినావు || రక్షకా || - (యోహాను 14:3; ప్రకటన 20:14)

  37. మహిమగల బ్రతుకునకు - మాదిరిగా నడచినావు || రక్షకా || - (యోహాను 8:54; 1పేతురు 2:21)

  38. దేవుడని నీ చరిత్ర - లో వివరము చూపినావు || రక్షకా || - (యోహాను 20:28; రోమా 9:5)

  39. త్వరగావచ్చి సభను మోక్ష - పురము కొంచుపోయెదవు || రక్షకా || - (యోహాను 14:3)

  40. నేను చేయలేనివన్ని - నీవె చేసి పెట్టినావు || రక్షకా || - (1తిమోతి 1:15)

  41. యేసుక్రీస్తు ప్రభువ నిన్ను - యేమని స్తుతింపగలను || రక్షకా || - (1తిమోతి 1:15)

  42. బైబిలులో నిన్ను నీవు - బయలుపర్చుకొన్నావు || రక్షకా || - (లూకా 24:44)

  43. భూమిచుట్టు సంచరించు - బోధకులను పంపినావు || రక్షకా || - (అపో.కా. 1:8)

  44. సర్వదేశాలయందు - సంఘము స్థాపించినావు || రక్షకా || - (సంఘ చరిత్ర)

  45. అందరకు తీర్పు రాక - ముందే బోధచేసెదవు || రక్షకా || - (మత్తయి 7:22;ప్రకటన 20:1)

  46. పెండ్లి విందునందు వధువు - పీఠము నీచెంతనుండు || రక్షకా ||

  47. ఏడేండ్ల శ్రమలయందు - ఎందరినో త్రిప్పెదవు || రక్షకా ||

  48. హర్మగెద్దోను యుద్ధమందు - ధ్వజము నెత్తెదవు || రక్షకా ||

  49. నాయకులను వేసెదవు - నరకమందు తత్ క్షణంబె || రక్షకా ||

  50. సాతానును చెర - సాలలో వేసెదవు || రక్షకా ||

  51. వసుధమీద వెయ్యి సం - వత్సరంబులేలెదవు || రక్షకా ||

  52. కోట్లకొలది ప్రజలను సమ - కూర్చి రక్షించెదవు || రక్షకా ||

  53. వెయ్యి యేండ్లు నీ సువార్త - విన్న వారికుండు తీర్పు || రక్షకా ||

  54. పడవేతువు సైతానున్ - కడకు నగ్నిగుండమందు || రక్షకా ||

  55. కడవరి తీర్పుండు నంత్య - కాలమందు మృతులకెల్ల || రక్షకా ||

  56. నీకును నీ సంఘమునకు - నిత్యమును జయము జయము || రక్షకా ||

  57. నీకును నీ శ్రమలకును నిత్యమును - జయముజయము || రక్షకా ||

  58. నీకును నీ నిందలకును - నిత్యమును జయముజయము || రక్షకా ||

  59. నీకును నీ బోధకును - నిత్యమును జయముజయము || రక్షకా ||

  60. నీకును నీ పనులకును - నిత్యమును జయముజయము || రక్షకా ||

  61. నీకును నీ కార్యములకు - నిత్యమును జయముజయము || రక్షకా ||

  62. నీకును నీ సేవకులకు - నిత్యమును జయముజయము || రక్షకా ||

  63. నీకును నీ రాజ్యమునకు - నిత్యమును జయముజయము || రక్షకా ||





raagaM: jaMjhooTi taaLaM: tisrachaapu



    rakshakaa naa vaMdanaalu - Sreerakshakaa naa vaMdanaalu

  1. dharaku raakamuMde bhakta - parula kerukainaavu || rakshakaa ||

  2. muMdu jarugu nee charitra - muMde vraasipeTTinaavu || rakshakaa ||

  3. jariginapuDu choochi prava - chanamu prajalu namminaaru || rakshakaa ||

  4. naanimittamai neevu - naruDavai puTTinaavu || rakshakaa || - (lookaa 2 a)

  5. moTTamodaTa saataanu - moolamooDa goTTinaavu || rakshakaa || - (mattayi4:10)

  6. paapamulu paapamula - phalitamulu gelichinaavu || rakshakaa || - (1paeturu 2:21-23)

  7. neeve dikku narulakaMchu - neetibOdha chaesinaavu || rakshakaa || - (yOhaanu 14:10)

  8. chikkupraSna laalakiMchi - chikkula viDadeesinaavu || rakshakaa || - (mattayi 22:21)

  9. aakaligalavaaralaku - appamul^ kaaviMchinaavu || rakshakaa || - (yOhaanu 6:12)

  10. aapadalOnunna vaari - aapada tappiMchinaavu || rakshakaa || - (mattayi 8:26)

  11. jabbuchaeta baadhanoMdu - januni jooDa jaalineeku || rakshakaa || - (mattayi 9:36)

  12. rOgulanu prabhaavamuchae - baaguchaesi paMpinaavu || rakshakaa || - (maarku 5:30)

  13. maMdu vaaDakuMDa jabbu - maanpi vaeyagalavu taMDri || rakshakaa || - ( maarku 2:12)

  14. vachchinavaaraMdariki - svasthata daya chaeyuduvu || rakshakaa || - (maarku 1:32,33)

  15. appuDunu yippuDunu - eppuDunu vaidhyuDavu || rakshakaa || - (hebree 13:8)

  16. nammalaeni vaaraDigina - nammika galigiMpagalavu || rakshakaa || - (maarku9:24)

  17. nammagalugu vaari jabbu - nayamuchaesi paMpagalavu || rakshakaa || - (mattayi 9:29)

  18. rOgilOni dayyamulanu - saagadarimi vaesinaavu || rakshakaa || - (mattayi 17:18)

  19. dayyamupaTTinavaari - dayyamunu dariminaavu || rakshakaa || - (maarku 5:13)

  20. bratuku chaaliMchukonna - mRtulanu bratikiMchinaavu || rakshakaa || - (lookaa 7:15)

  21. paapulu suMkarulu unna - paMktilO bhujiMchinaavu || rakshakaa || - (lookaa 15:2)

  22. marala neevu raakamuMdu - gurutu luMDunannaavu || rakshakaa || - (mattayi 24 adhyaa)

  23. chaMpuchunna Satruvulanu - chaMpaka kshamiMchinaavu || rakshakaa || - (lookaa 23:34)

  24. raakavenka adhikamaina - Sramalu vachchunannaavu || rakshakaa || - (mattayi 24:21)

  25. kroorulu chaMpaMga naa - koraku maraNamoMdinaavu || rakshakaa || - (thessa 5:10)

  26. paapamulu parihariMchu - praaNaraktamichchinaavu || rakshakaa || - (yOhaanu 19:34; mattayi 27:50)

  27. paapabhaaramellamOsi - baruvu diMchivaesinaavu || rakshakaa || - (yeshayi 53 adhyaa)

  28. vyaadhibhaaramella mOsi - vyaadhi diMchivaesinaavu || rakshakaa || - (yeshayi 53)

  29. SikshabhaaramellamOsi - SikshadiMchivaesinaavu || rakshakaa || - (yeshayi 53)

  30. maraNamoMdi maraNabheeti - maralakuMDa jaesinaavu || rakshakaa || - (hebree 2:14)

  31. maraNamun^ jayiMchilaechi - tirigi bOdhajaesinaavu || rakshakaa || - (apO.kaa.1:3)

  32. nityamu naayoddanuMDa - nirNayiMchukonnaavu || rakshakaa || - (mattayi 28:20)

  33. sRshTiki bOdhiMchuDani - Sishyulaku cheppinaavu || rakshakaa || - (maarku 16:15)

  34. nammi snaanamoMdaraksha - NaMbu galgunannaavu || rakshakaa ||

  35. deeviMchi Sishyulanu - daevalOkamaeginaavu || rakshakaa || - ( lookaa 24:51)

  36. narakamu tappiMchi mOksha - puramu siddhaparachinaavu || rakshakaa || - (yOhaanu 14:3; prakaTana 20:14)

  37. mahimagala bratukunaku - maadirigaa naDachinaavu || rakshakaa || - (yOhaanu 8:54; 1paeturu 2:21)

  38. daevuDani nee charitra - lO vivaramu choopinaavu || rakshakaa || - (yOhaanu 20:28; rOmaa 9:5)

  39. tvaragaavachchi sabhanu mOksha - puramu koMchupOyedavu || rakshakaa || - (yOhaanu 14:3)

  40. naenu chaeyalaenivanni - neeve chaesi peTTinaavu || rakshakaa || - (1timOti 1:15)

  41. yaesukreestu prabhuva ninnu - yaemani stutiMpagalanu || rakshakaa || - (1timOti 1:15)

  42. baibilulO ninnu neevu - bayaluparchukonnaavu || rakshakaa || - (lookaa 24:44)

  43. bhoomichuTTu saMchariMchu - bOdhakulanu paMpinaavu || rakshakaa || - (apO.kaa. 1:8)

  44. sarvadaeSaalayaMdu - saMghamu sthaapiMchinaavu || rakshakaa || - (saMgha charitra)

  45. aMdaraku teerpu raaka - muMdae bOdhachaesedavu || rakshakaa || - (mattayi 7:22;prakaTana 20:1)

  46. peMDli viMdunaMdu vadhuvu - peeThamu neecheMtanuMDu || rakshakaa ||

  47. aeDaeMDla SramalayaMdu - eMdarinO trippedavu || rakshakaa ||

  48. harmageddOnu yuddhamaMdu - dhvajamu nettedavu || rakshakaa ||

  49. naayakulanu vaesedavu - narakamaMdu tat^ kshaNaMbe || rakshakaa ||

  50. saataanunu chera - saalalO vaesedavu || rakshakaa ||

  51. vasudhameeda veyyi saM - vatsaraMbulaeledavu || rakshakaa ||

  52. kOTlakoladi prajalanu sama - koorchi rakshiMchedavu || rakshakaa ||

  53. veyyi yaeMDlu nee suvaarta - vinna vaarikuMDu teerpu || rakshakaa ||

  54. paDavaetuvu saitaanun^ - kaDaku nagniguMDamaMdu || rakshakaa ||

  55. kaDavari teerpuMDu naMtya - kaalamaMdu mRtulakella || rakshakaa ||

  56. neekunu nee saMghamunaku - nityamunu jayamu jayamu || rakshakaa ||

  57. neekunu nee Sramalakunu nityamunu - jayamujayamu || rakshakaa ||

  58. neekunu nee niMdalakunu - nityamunu jayamujayamu || rakshakaa ||

  59. neekunu nee bOdhakunu - nityamunu jayamujayamu || rakshakaa ||

  60. neekunu nee panulakunu - nityamunu jayamujayamu || rakshakaa ||

  61. neekunu nee kaaryamulaku - nityamunu jayamujayamu || rakshakaa ||

  62. neekunu nee saevakulaku - nityamunu jayamujayamu || rakshakaa ||

  63. neekunu nee raajyamunaku - nityamunu jayamujayamu || rakshakaa ||

Yesukreesthu vari katha vinudi dheshiyulara యేసుక్రీస్తు వారి కథవినుడి దేశీయులారా

Song no: 28

    యేసుక్రీస్తు వారి కథవినుడి - దేశీయులారా - యేసు క్రీస్తువారి
    కథవినుడి = దోసకారులన్ రక్షింప - దోసములంటని రీతిగనె
    దాసుని రూపంబుతో మన - ధరణిలో వెలసిన దేవుండౌ || యేసుక్రీస్తు ||

  1. రోగులన్ కొందరినిజూచి - బాగుచేయునని యనలేదు - రోగముల
    తీరది పరికించి - బాగుచేయ లేననలేదు - రోగముల నివారణకైన -
    యోగముల్ తాజెప్పలేదు - యోగయోగులమించు వైద్య - యోగి
    తానని ఋజువుగొన్న || యేసుక్రీస్తు ||

  2. పాపులను నిందించి యేవిధ - శాపవాక్కుల్ పల్కలేదు - పాపులకు
    గతిలేదని చెప్పి - పారద్రోలి వేయలేదు కోపపడుచు పాపులను
    రా - కూడదని వచియింపలేదు = పాపములు పరిహారము చేసి -
    పరమదేవుడు తానని తెల్పిన || యేసుక్రీస్తు ||

  3. నరులకు దేవుడు తండ్రియగు వరుస బైలుపరచినాడు పొరుగు
    వారు సోదరులన్న - మరొకవరుస - తేల్చినాడు మరియు దేవున్
    పొరుగు వారిన్ - సరిగ ప్రేమించు మన్నాడు = కొరతలేకుండ
    సర్వాజ్ఞల్ నెరవేర్చి మాదిరి జూపిన || యేసుక్రీస్తు ||

  4. వాక్కు వినవచ్చినవారలకు - వాక్యహారమున్ తినిపించె ఆకలితో
    నున్న ఆయైదువేలన్ గనికరించె - మూకకు వండని రొట్టెలను
    బుట్టించి తృప్తిగా వడ్డించె = లోకమంతకు పోషకుడు తా-నే కదా
    యని మెప్పుగాంచిన || యేసుక్రీస్తు ||

  5. దురితములను తత్ఫలములను - దుష్టుడౌ సైతానును గెల్చె తరుణ
    మందు మృతులన్ లేపె - దయ్యములను దరిమివైచె నరుల
    భారమున్ వహియించి - మరణమొంది తిరిగిలేచె = తిరుగవచ్చెద
    నంచు మోక్ష -పురము వెళ్ళి గూర్చున్న || యేసుక్రీస్తు ||

  6. పాపులకు రోగులకు బీద - వారికి దేవుండుయేసె ఆపదలన్నిటిలో
    నిత్య - మడ్డుపడు మిత్రుండు క్రీ స్తే - పాపమున పడకుండగా
    పాడెడు శిల యేసుక్రీస్తే - పాపులాశ్రయించిన యెడల - పర
    లోకమునకు గొంపోవు || యేసుక్రీస్తు ||

  7. మరల యూదుల్ దేశమునకు - మళ్ళుచున్నారిదియొక గుర్తు
    పరుగులెత్తుచున్నవి కారుల్ - బస్సులు ఇది మరియొకగుర్తు - కరు
    వురు మతవాదాలు భూ - కంపముల్ యుద్ధా లొకగుర్తు =
    గురుతులై పోయినవిగనుక - త్వరగవచ్చుచున్న శ్రీ || యేసుక్రీస్తు ||






raagaM: bilhari taaLaM: aadi



    yaesukreestu vaari kathavinuDi - daeSeeyulaaraa - yaesu kreestuvaari
    kathavinuDi = dOsakaarulan^ rakshiMpa - dOsamulaMTani reetigane
    daasuni roopaMbutO mana - dharaNilO velasina daevuMDau || yaesukreestu ||

  1. rOgulan^ koMdarinijoochi - baaguchaeyunani yanalaedu - rOgamula
    teeradi parikiMchi - baaguchaeya laenanalaedu - rOgamula nivaaraNakaina -
    yOgamul^ taajeppalaedu - yOgayOgulamiMchu vaidya - yOgi
    taanani Rjuvugonna || yaesukreestu ||

  2. paapulanu niMdiMchi yaevidha - Saapavaakkul^ palkalaedu - paapulaku
    gatilaedani cheppi - paaradrOli vaeyalaedu kOpapaDuchu paapulanu
    raa - kooDadani vachiyiMpalaedu = paapamulu parihaaramu chaesi -
    paramadaevuDu taanani telpina || yaesukreestu ||

  3. narulaku daevuDu taMDriyagu varusa bailuparachinaaDu porugu
    vaaru sOdarulanna - marokavarusa - taelchinaaDu mariyu daevun^
    porugu vaarin^ - sariga praemiMchu mannaaDu = koratalaekuMDa
    sarvaaj~nal^ neravaerchi maadiri joopina || yaesukreestu ||

  4. vaakku vinavachchinavaaralaku - vaakyahaaramun^ tinipiMche aakalitO
    nunna aayaiduvaelan^ ganikariMche - mookaku vaMDani roTTelanu
    buTTiMchi tRptigaa vaDDiMche = lOkamaMtaku pOshakuDu taa-nae kadaa
    yani meppugaaMchina || yaesukreestu ||

  5. duritamulanu tatphalamulanu - dushTuDau saitaanunu gelche taruNa
    maMdu mRtulan^ laepe - dayyamulanu darimivaiche narula
    bhaaramun^ vahiyiMchi - maraNamoMdi tirigilaeche = tirugavachcheda
    naMchu mOksha -puramu veLLi goorchunna || yaesukreestu ||

  6. paapulaku rOgulaku beeda - vaariki daevuMDuyaese aapadalanniTilO
    nitya - maDDupaDu mitruMDu kree stae - paapamuna paDakuMDagaa
    paaDeDu Sila yaesukreestae - paapulaaSrayiMchina yeDala - para
    lOkamunaku goMpOvu || yaesukreestu ||

  7. marala yoodul^ daeSamunaku - maLLuchunnaaridiyoka gurtu
    parugulettuchunnavi kaarul^ - bassulu idi mariyokagurtu - karu
    vuru matavaadaalu bhoo - kaMpamul^ yuddhaa lokagurtu =
    gurutulai pOyinaviganuka - tvaragavachchuchunna Sree || yaesukreestu ||

Halleluya halleluya halleluya ma prbhuvu vacchiyunnadu హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ మా ప్రభువచ్చియున్నాడు

Song no: 27

  1. హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ మా ప్రభువచ్చియున్నాడు - హల్లేలూయ

  2. హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ మా - ప్రభువిక్కడున్నాడు హల్లేలూయ

  3. హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ మా - ప్రభువు వచ్చుచున్నాడు హల్లెలూయ

  4. హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ మా - కెప్పుడును క్రిస్మసె హల్లేలూయ





raagaM: - taaLaM: -



  1. hallaelooya hallaelooya hallaelooya maa prabhuvachchiyunnaaDu - hallaelooya

  2. hallaelooya hallaelooya hallaelooya maa - prabhuvikkaDunnaaDu hallaelooya

  3. hallaelooya hallaelooya hallaelooya maa - prabhuvu vachchuchunnaaDu hallelooya

  4. hallaelooya hallaelooya hallaelooya maa - keppuDunu krismase hallaelooya

Yesu raju yese raju yesu raju esa prajapathi kreesthe raju యేసు రాజు యేసే రాజు యేసు రాజు ఈసా ప్రజాపతి క్రీస్తేరాజు

Song no: 26

    యేసు రాజు యేసే రాజు యేసు రాజు - ఈసా ప్రజాపతి క్రీస్తేరాజు

  1. రాకరాకవచ్చినాడు యేసు రాజు - రాకవచ్చినాడు క్రీస్తురాజు || యేసు ||

  2. లేక లేక కల్గినాడు యేసురాజు - లోకమునకు కల్గినాడు క్రీస్తేరాజు || యేసు ||

  3. గొల్లలకు కానిపించె యేసురాజు - ఎల్లరకు కానిపించె క్రీస్తేరాజు || యేసు ||

  4. జ్ఞానులకు కానిపించె యేసురాజు - అజ్ఞానులకు కానిపించె క్రీస్తేరాజు || యేసు ||

  5. గగనమందు ఘనతనొందె యేసురాజు - జగతియందు ఘనతనొందె క్రీస్తురాజు || యేసు ||

  6. గౌతముని ప్రవచనము యేసేరాజు - భూతలమున గురువు రాజు క్రీస్తేరాజు || యేసు ||

  7. మొదట యెహొదీయులకు యేసేరాజు - పిదప మనకందరకు క్రేస్తేరాజు || యేసు ||

  8. హల్లెలూయ - హల్లేలూయ యేసేరాజు హల్లేలూయ హల్లేలూయ క్రీస్తేరాజు || యేసు ||





raagaM: - taaLaM: -



    yaesu raaju yaesae raaju yaesu raaju - eesaa prajaapati kreestaeraaju

  1. raakaraakavachchinaaDu yaesu raaju - raakavachchinaaDu kreesturaaju || yaesu ||

  2. laeka laeka kalginaaDu yaesuraaju - lOkamunaku kalginaaDu kreestaeraaju || yaesu ||

  3. gollalaku kaanipiMche yaesuraaju - ellaraku kaanipiMche kreestaeraaju || yaesu ||

  4. j~naanulaku kaanipiMche yaesuraaju - aj~naanulaku kaanipiMche kreestaeraaju || yaesu ||

  5. gaganamaMdu ghanatanoMde yaesuraaju - jagatiyaMdu ghanatanoMde kreesturaaju || yaesu ||

  6. gautamuni pravachanamu yaesaeraaju - bhootalamuna guruvu raaju kreestaeraaju || yaesu ||

  7. modaTa yehodeeyulaku yaesaeraaju - pidapa manakaMdaraku kraestaeraaju || yaesu ||

  8. hallelooya - hallaelooya yaesaeraaju hallaelooya hallaelooya kreestaeraaju || yaesu ||

Lali lali lalammalali lali sree mariyamma puthra లాలి లాలి - లాలమ్మలాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర

Song no: 25

    లాలి లాలి - లాలమ్మలాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకేలాలి

  1. బెత్లెహేము పుర వాస్తవ్య లాలి - భూలోక వాస్తవ్యులు చేయు స్తుతులివిగో లాలి || లాలి ||

  2. పశువుల తొట్టె - నీకు పాన్పా యెను లాలి
    ఇపుడు పాపులమైన మా హృదయములలో పవళించుము లాలి || లాలి ||

  3. పొత్తివస్త్రములేనీకు - పొదుపాయెను లాలి
    మాకు మహిమ - వస్త్రము లియ్యను నీవు మహిలో పుట్టితివా || లాలి ||

  4. పశువుల పాకే నీకు వసతి గృహమాయె
    మాకు మహిమ - సౌధములియ్యను నీవు మనుష్యుడవైతివా || లాలి ||

  5. తండ్రికుమార - పరిశుద్ధాత్మలకే స్తోత్రం
    ఈ నరలోకమునకు - వేంచేసిన శ్రీ బాలునకే స్తోత్రం || లాలి ||





raagaM: - taaLaM: -



    laali laali - laalammalaali laali Sree mariyamma putra neekaelaali

  1. betlehaemu pura vaastavya laali - bhoolOka vaastavyulu chaeyu stutulivigO laali || laali ||

  2. paSuvula toTTe - neeku paanpaa yenu laali
    ipuDu paapulamaina maa hRdayamulalO pavaLiMchumu laali || laali ||

  3. pottivastramulaeneeku - podupaayenu laali
    maaku mahima - vastramu liyyanu neevu mahilO puTTitivaa || laali ||

  4. paSuvula paakae neeku vasati gRhamaaye
    maaku mahima - saudhamuliyyanu neevu manushyuDavaitivaa || laali ||

  5. taMDrikumaara - pariSuddhaatmalakae stOtraM
    ee naralOkamunaku - vaeMchaesina Sree baalunakae stOtraM || laali ||

Yesu baluda yesu baluda yenthayu vandhanam యేసుబాలుడ యేసుబాలుడ ఎంతయు వందనం

Song no: 24

    యేసుబాలుడ - యేసుబాలుడ - ఎంతయు వందనం - ఓ బాసుర దేవకుమార - భక్తివందనం = ఓ భాసుర దేవకుమార - భక్తివందనం

  1. పసుల తొట్టిలోనే యప్పుడు - పరుండినావు = ఇప్పుడు - వసుధ భక్తులందరిలోను - వాసము జేతువు || యేసుబాలుడ ||

  2. యూదులలోనే యావేళ ఉద్భవించితివి - ఇప్పుడు = యూదాది సకలజనులలో - ఉద్భవింతువు || యేసుబాలుడ ||





raagaM: hiMdusthaanitODi taaLaM: daeSaadi



    yaesubaaluDa - yaesubaaluDa - eMtayu vaMdanaM - O baasura daevakumaara - bhaktivaMdanaM = O bhaasura daevakumaara - bhaktivaMdanaM

  1. pasula toTTilOnae yappuDu - paruMDinaavu = ippuDu - vasudha bhaktulaMdarilOnu - vaasamu jaetuvu || yaesubaaluDa ||

  2. yoodulalOnae yaavaeLa udbhaviMchitivi - ippuDu = yoodaadi sakalajanulalO - udbhaviMtuvu || yaesubaaluDa ||

Deva dhutha kreesmasu dhuthaseya krismasu దేవదూత క్రిస్మసు దూతసేన క్రిస్మసు

Song no: 23

  1. దేవదూత క్రిస్మసు....... దూతసేన క్రిస్మసు
  2. గొల్లవారి క్రిస్మసు....... తూర్పుజ్ఞాని క్రిస్మసు

  3. చిన్నవారి క్రిస్మసు....... పెద్దవారి క్రిస్మసు
  4. పేదవారి క్రిస్మసు....... గొప్పవారి క్రిస్మసు

  5. పల్లెయందు క్రిస్మసు....... పట్నమందు క్రిస్మసు
  6. దేశమందు క్రిస్మసు....... లోకమంత క్రిస్మసు

  7. క్రిస్మసన్న పండుగ........ చేసికొన్న మెండుగ
  8. మానవాత్మ నిండుగ....... చేయకున్న దండుగ

  9. క్రీస్తు దేవదానము......... దేవవాక్య ధ్యానము

  10. క్రీస్తు శిష్యగానము.......... వీనికాత్మ స్థానము

  11. కన్నవారి క్రిస్మసు........ విన్నవారి క్రిస్మసు
  12. క్రైస్తవాళి క్రిస్మసు........ ఎల్లవారి క్రిస్మసు

  13. పాపలోకమందున........ క్రీస్తు పుట్టినందున
  14. పాపికెంతో మోక్షము........ ఈ సువార్త సాక్ష్యము

  15. క్రీస్తే సర్వభూపతి ........ నమ్మువారి సంగతి
  16. మేము చెప్పు సంగతి ........ నమ్మకున్న దుర్గతి





  1. daevadoota krismasu....... dootasaena krismasu
  2. gollavaari krismasu....... toorpuj~naani krismasu

  3. chinnavaari krismasu....... peddavaari krismasu
  4. paedavaari krismasu....... goppavaari krismasu

  5. palleyaMdu krismasu....... paTnamaMdu krismasu
  6. daeSamaMdu krismasu....... lOkamaMta krismasu

  7. krismasanna paMDuga........ chaesikonna meMDuga
  8. maanavaatma niMDuga....... chaeyakunna daMDuga

  9. kreestu daevadaanamu......... daevavaakya dhyaanamu

  10. kreestu Sishyagaanamu.......... veenikaatma sthaanamu

  11. kannavaari krismasu........ vinnavaari krismasu
  12. kraistavaaLi krismasu........ ellavaari krismasu

  13. paapalOkamaMduna........ kreestu puTTinaMduna
  14. paapikeMtO mOkshamu........ ee suvaarta saakshyamu

  15. kreestae sarvabhoopati ........ nammuvaari saMgati
  16. maemu cheppu saMgati ........ nammakunna durgati