Song no:
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!
విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!
నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ తేనెకంటే మధురము!
నీ ప్రేమ లోతులో, నను నడుపు యేసయ్యా! నీ ప్రేమలోన నే వేరు పారి నీకై జీవించనా!
ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నిను వెంబడింతును
ప్రేమతో ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నిను ఆరాధింతును
- నా తల్లి గర్భమునందు, నే పిండమునైయుండంగా, దృష్టించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైనా, ఆరంభము కాకమునుపే, గ్రంథములో లిఖియించిన ప్రేమ
నా ఎముకలను, నా అవయవములను, వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను, పాలు త్రాగుచున్నపుడు, నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ!
ప్రేమతో ప్రేమతో – నీ కోసం నను సృజియించావయా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నను మురిపెంగా లాలించావయా!
- నే ప్రభువును ఎరుగకయుండి అజ్ఞానములో ఉన్నపుడు, నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనపుడు, నా కోసం వేచిచూచిన ప్రేమ
బాల్యదినములనుండి నను సంరక్షించి కంటిరెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యౌవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్ననూ నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ!
ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నను దర్శించావయా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నను ప్రత్యేకపరిచావేసయ్యా!
- నే పాపినై యుండగానే, నాకై మరణించిన ప్రేమ, తన సొత్తుగ చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకై, తన ప్రాణపు వెల చెల్లించి, నా విలువను పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి, చులకన చేసిననూ, తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
ఎవ్వరూ లేకున్నా, నేను నీకు సరిపోనా, నీవు బహుప్రియుడవని బలపరచిన ప్రేమ
నా ముద్దుబిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ!
యేసయ్యా! యేసయ్యా! – నాపై యింత ప్రేమ ఏంటయా!
యేసయ్యా! యేసయ్యా! యేసయ్యా! – నను నీలా మార్చేందులకేనయా!
- పలుమార్లు నే పడినపుడు బహు చిక్కులలోనున్నపుడు కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేశానంటూ నేనే భరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులను, తప్పకుండ సరిచేసి, తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
నన్ను బట్టి మారదుగా, నన్ను చేరదీసెనుగా, షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ!
ప్రేమతో ప్రేమతో – నను మరలా సమకూర్చావేసయ్యా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నీ సాక్ష్యంగా నిలబెట్టావయా!
- కష్టాల కొలుముల్లోన, కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో తన మాటతో శాంతినిచ్చిన ప్రేమ
లోకమే మారిననూ, మనుష్యులే మరచిననూ మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి, తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణమాత్రమైనా నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ!
ప్రేమతో ప్రేమతో – నా విశ్వాసం కాపాడావయా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో – బంగారంలా మెరిపించావయా!
- ఊహించలేనటువంటి కృపలను నాపై కురిపించి నా స్థితిగతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడునూ పొందగ లేని అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షిరాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎపుడూ, క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ!
ప్రేమతో ప్రేమతో – శాశ్వత జీవం నాకిచ్చావయా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నను చిరకాలం ప్రేమిస్తావయా!
Shawathamaina prematho nanu preminchavayya ! Ne prema nanu gelchenu !
Viduvaka nee krupa na yeda kuripinchinavayya ! Nee krupaye nanu marchenu !
Nee prema unnatham, nee prema amrutham, nee prema thenekantey madhuramu !
Nee prema lothallo. Nanu nadupu yesayya ! Nee premalona ne verupari neekai jeevinchana !
Prematho prematho – yesayya ninu vembadinthunu
Prematho prematho prematho – yesayyaa ninu aaradhinthunu
1. Naa thalli garbamunandhu, ney pindamunaiyundaga, drustinchi nirminchina prema
Naa dinamulalo okataina, aarambhamu kaakamunapey, grandhamulo likhinchina prema
Naa yemukalanu, naa avayamulanu, vinthaga yedhiginchi rupinchina prema
Thalli odilo nenu, palu thraguchunnapudu, nammikanu naalonu puttinchina prema
Thana sontha polika rupulona nanu srustinchina prema
Prematho prematho
– nee kosam nanu srujinchina prema
!
Prematho prematho prematho
– nanu muripenga laalinchavaya !
2. Ney prabhuvunu yerugakayundi agnaamulo unnapudu, nanu viduvaka ventadina prema
Naa srustikarthanu gurchi smaraney naalo lenapppudu, naa kosam veechichuchina prema
Balya dhinamula nundi nanu samrakshinchi kantireppalaa nannu kapadina prema
Yevvana kalamuna krupatho nanu kalisi sathyamunu bhodhinchi veliginchina prema
Ney vedukakunnanuu naaku doriki nanu brathikinchina prema
Prematho prematho – yessayya nanu dharshinchavayya !
Prematho prematho prematho – nanu prathyeksha parichavesaya !
3. Ney papinai yundaganey, nakai maranichina prema, thana sotthuga chesukunna prema
Viluvey lenatti nakai, thana pranapu vela chellinchi, naa viluvanu preminchesina prema
Lokame nanu gurchi, chulakana chesinanuu, thana drustilo nenu ghanudanna prema
Yevvaruu lekunnaa, nenu neeku sariponaa, neevu bhahu priyudavani balaparachina prema
Naa muddubidda nuvvantuu nannu thega muddhadina prema!
Yesayya! Yesayya! – napai intha prema yentaiah !
Yesayya! Yesayya! Yesayya! – nanu neelaa marchendulakenayaa !