అఘాద సముద్ర జలములైనా- ఈ ప్రేమను ఆర్పజాలవుగా -2
ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే -2
సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
పావురము పక్షులన్నియును
దుఃఖారావం అనుదినం చేయునట్లు
పావురము పక్షులన్నియును
దుఃఖారావం అనుదినం చేయునట్లు
దేహ విమోచనము కొరకై నేను
మూల్గుచున్నాను సదా
దేహ విమోచనము కొరకై నేను
మూల్గుచున్నాను సదా
మూల్గుచున్నాను సదా
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
గువ్వలు గూళ్లకు ఎగయునట్లు
శుద్ధులు తమ గృహమును చేరుచుండగా
గువ్వలు గూళ్లకు ఎగయునట్లు
శుద్ధులు తమ గృహమును చేరుచుండగా
నా దివ్య గృహమైన సీయోనులో
చేరుట నా ఆశయే
నా దివ్య గృహమైన సీయోనులో
చేరుట నా ఆశయే
చేరుట నా ఆశయే
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2
ప్రేమను పంచగలిగినా పరమ తండ్రివి నీవె
సహయం చెయగలిగిన నా హితుడవు నీవే }2
నీ ప్రేమ చాలయ్య నను కొన్న యేసయ్య
నీ ప్రేమ చాలయ్య నను కన్న యేసయ్య
అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2
కన్నీరు తడిచి కలతలను బాపే
కలుషాత్ములను కడిగే కరుణాత్ముడవు నీవే }2
కృపా సత్య సంపూర్ణమై నా హృధిని గెలిచావే }2
కొనియాడ నా యేసయ్య కోటి కంటాలతో
కీర్తించే నా యేసయ్య స్తోత్ర గీతాలతో
ఎందుకింత ప్రేమయ్య నా పైన యేసయ్య }2
అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే
వేదనలు తొలగించి శోధనలు గెలిపించి
వారసునిగా మార్చి వీరునిగా చేసావే }2
వాక్యంతో నను నింపి వారధిగా నిలిపావే }2
విలువైన పిలుపుతో పిలిచి వెన్నంటే ఉన్నావే }2
ఎంత వింత ప్రేమయ్య నా పైన యేసయ్య }2
అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2