Song no: 55
- ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద -2
- ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే -2
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥
- ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే -2
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥
- యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥
ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది -2