-->

Yevarunnaru ee lokamlo yevarunnaru ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో

Song no: 47

    ఎవరున్నారు ఈ లోకంలో
    ఎవరున్నారు నా యాత్రలో -2
    నీవే యేసయ్యా ఆనందము నా
    నీవే యేసయ్యా ఆశ్రయము -2

  1. ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే -2
    ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే
    నీ దరి చేర్చితివే -2 || ఎవరు ||

  2. శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా -2
    నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే
    నన్నిల బ్రోచితివే -2 || ఎవరు ||
Share:

Nee krupa bahulyame naa jeevitha aadharame నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే

Song no: 46

    నీ కృప బాహుళ్యమే - నా జీవిత ఆధారమే -2
    నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥

  1. శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ -2
    నీ కృప వీడక - నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥

  2. శ్రమలలో - పుటమువేయ బడిన వేళ -2
    నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా -2 ॥ నీ కృపా ॥
Share:

Sthuthiki pathruda sthothrarhuda shubhapradhamaina nirikshanatho స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో

Song no: 42

    స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా
    శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో
    జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
    జయగీతమే పాడెద- అ - ఆ - ఆ

  1. నా కృప నిన్ను విడువదంటివే -2
    నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 ॥ స్తుతికి ॥

  2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2
    పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 ॥ స్తుతికి ॥

  3. ఇహపరమందున నీవే నాకని -2
    ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2 ॥ స్తుతికి ॥
Share:

Sthuthi pathruda sthothrahruda sthuthulandhuko poojahruda స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా

Song no: 42

    స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
    స్తుతులందుకో - పూజార్హుడా -2
    ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
    స్తుతి పాత్రుడా.... ఆఆఅ

  1. నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2
    నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి
    విడిపించినావు - కాపాడినావు -2
    స్తుతి పాత్రుడా...

  2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2
    నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను
    నీ సన్నీధిలో - నీ సంఘములో -2
Share:

Naa priyudu yesu naa priyudu naa priyuniki ne నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే

Song no: 38

    నా ప్రియుడు యేసు నా ప్రియుడు
    నా ప్రియునికి నే స్వంతమెగా } 2

    నా ప్రియుడు నా వాడు } 2 ||నా ప్రియుడు||

  1. మరణపు ముల్లును నా లో విరిచి
    మారాను మధురం గా చేసి } 2
    మనస్సును మందిరము గా మార్చే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  2. కృపనే ధ్వజముగా నాపై నెత్తి
    కృంగిన మదిని నింగి కెత్తి } 2
    కృపతో పరవశ మొందించే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  3. సంఘముగా నను చేర్చుకొని
    సంపూర్ణ నియమములన్నియును } 2
    సంగీతముగా వినిపించే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  4. జీవితమే జలరేఖలుగా
    చెదిరిన సమయములన్నింటిలో } 2
    పిలుపును స్థిరపరచే కృపలో } 2 ౹౹నా ప్రియుడు౹౹

  5. సంబరమే యేసు కౌగిలిలో
    సర్వాంగ సుందరుడై వచ్చువేళ } 2
    సమీపమాయే ఆ శుభవేళ } 2 ౹౹ నా ప్రియుడు ౹౹
Share:

Krupaye neti varaku kachenu naa krupa ninnu కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదనినా

Song no: 37

    కృపయే నేటి వరకు కాచెను
    నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹

  1. మనోనేత్రములు వెలిగించినందున - యేసు పిలిచిన పిలుపును
    క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో- పరిశుద్ధులలో చూపితివే  ౹౹కృపా ౹౹

  2. జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగి రాగా
    అలల వలే నీ కృపతోడై - చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹

  3. భీకర రూపము దాల్చిన లోకము -మ్రింగుటకు నన్ను సమీపించగా
    ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹

  4. సేవార్థమైన వీణెలతో నేను - వీణెలు వాయించు వైణికులున్నా
    సీయోను కొరకే జీవించుచూ- సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹

  5. నీదు వాక్యము - నా పాదములకు- నిత్యమైన వెలుగై యుండున్
    నా కాలుజారె ననుకొనగా - నిలిపెను నన్ను నీ కృపయే ౹౹కృపా౹౹

Share:

Lokamunu vidichi vellavalenuga sarvamicchutane లోకమును విడచి వెళ్ళవలెనుగ సర్వమిచ్చటనే విడువవలెన్

Song no: 735
"నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము." హెబ్రీ Hebrews 13:14
    పల్లవి : లోకమును విడచి వెళ్ళవలెనుగ
    సర్వమిచ్చటనే విడువవలెన్

  1. యాత్రికులము యీ దుష్టలోకములో
    పాడులోకములో మనకేది లేదు
    యే విషయమందైన గర్వించలేము
    జాగ్రత్తగానే నడచుకొనెదము || లోకమును ||

  2. కష్ట బాధలచే బ్రతుకంత నిండె
    కన్నీళ్ళు నిరాశ నిస్పృహల మయము
    కరుణా కటాక్షము నమ్మెదము
    క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము || లోకమును ||

  3. ఎంత వరకు యీ భువి యందుండెదమో
    సైతానుతో సదా పోరాటమేగా
    శత్రుని తంత్రాల నెరిగితిమి
    ధైర్యముతోనే కొనసాగెదము || లోకమును ||

  4. గతము నంతటిని మరచిపోయెదము
    గురియొద్ద కానందముతో వెళ్ళెదము
    మార్గాన వచ్చేటి శ్రమల నోర్చి
    అర్హులమౌదము బహుమానమొంద || లోకమును ||

  5. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి
    నిజ ప్రేమతోనే జీవించెదము
    నిష్కళంకులమై శుద్ధులమై
    పరిపూర్ణతను చేపట్టుదము || లోకమును ||

  6. జీవము గల ప్రభు రక్షించె మనల
    విమోచించి నూతన జీవమొసగ
    కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్
    అందుచే మనము సిద్ధపడెదము || లోకమును ||

  7. ఆత్మీయ నేత్రాలతో చూచెదము
    ఎంత అద్భుతము సౌందర్య నగరం
    ప్రభువు చెంతకు వెళ్ళెదము
    విజయోత్సవముతో ప్రవేశించెదము || లోకమును ||
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts