Song no: 43
ప్రభువా - నీ సముఖము నందు
సంతోషము - కలదు
హల్లెలూయా సదా - పాడెదన్
హల్లెలూయా సదా - పాడెదన్
ప్రభువా - నీ సముఖము నందు
- పాపపు ఊబిలో - నేనుండగా
ప్రేమతో - నన్నాకర్షించితిరే -2
కల్వారి రక్తంతో - శుద్ధి చేసి -2
రక్షించి పరిశుద్ధులతో - నిల్పి ॥ ప్రభువా ॥
- సముద్ర - తరంగముల వలె
శోధనలెన్నో- ఎదురైనను -2
ఆదరణ కర్తచే - ఆదరించి -2
నీ నిత్య కృపలో - భద్రపరచి ॥ ప్రభువా ॥
3. సౌందర్య సీయోన్ని - తలంచగా
ఉప్పొంగుచున్న - హృదయముతో -2
ఆనందమానంద - మానందమాని -2
ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥
Song no:
యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా
హా! ఎంతో ఆనందమే (2)
- అవనిలో జరుగు క్రియలన్ని - హా ఎంతో సత్యమేగా (2)
వేదవాక్యం నేరవేరు చుండ - యిక మీకు చింతయే లేదా (2)
2. లోకజ్ఞానం పెరుగుచుండె - అనుదినం జనములలో (2)
అది ప్రేమ చల్లారేనుగా - యివే రాకడ సూచనల్గా (2)
3. విన్నవాక్యం నీలో ఫలింపచేసి–సిద్దపడుము(2)
ప్రాణాత్మ దేహం సమర్పించుము - ప్రార్ధనలో మేల్కొనుము (2)
4. త్వరపడుము రాకడకై - అలస్యము చేయక (2)
దేవుని బూరధ్వనించు వేళ - ఎంతో ఆసన్న మాయెనుగా (2)
Song no:
ఉత్సాహధ్వనితో కీర్తింతును హల్లెలూయ పాటలు పాడెదను } 2
నజరేతువాడా ప్రేమామయుడా నిరతము నిన్నే కీర్తింతును నిరతము నిన్నే కీర్తింతును
హల్లెలూయ హల్లెలూయా (3) {ఉత్సాహధ్వనితో}
- నాకొండయు నాకోటయు నాఆశ్రయ దుర్గము నీవేకదా (2)
నీ కృపను బట్టి ఆనంద భరితుడనై సంతోషించెదను (2) {హల్లెలూయ}
- నా దాగుచోటు నాకేడెమా శ్రమలోనుండి రక్షించెధవు (2)
నా ప్రార్థనలను, విఙ్ఞాపనలను నీ వాలకించితివే (2) {హల్లెలూయ}
Song no:
కలవంటిది నీ జీవితం - కడు స్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్పము
విలువైనది నీజీవితం - వ్యర్ధముచేయకుమా
యువకా వ్యర్ధము చేయకుమా - యువతీ వ్యర్ధముచేయకుమా
- నిన్ను ఆకర్షించే ఈలోకము - కాటువేసే విషసర్పము
యువకా అది కాలు జారే స్థలము -
ఉన్నావు పాపపు పడగనీడలో నీ అంతము ఘోర నరకము -
యువకా అదియే నిత్య మరణము
- నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం - నూతనా సృష్టిగామార్చును పాపం క్షమియించి రక్షించును -
ఆ మోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువూ - నీవు నిత్యము ఆనందింతువు } 2 {కలవంటిది}
Song no:
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||
-
దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||
-
రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ||
-
విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ||
-
పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును ||అభయ||
-
కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||
Song no: 90
ముద్దు మురిపాల చిన్నారి నాన్నా-సద్దు చేయకే నా చిట్టికన్నా
ఈ మాట వింటే మదిని దాచుకుంటే
నీ జీవితంలో సిరుల పంటే - ఆనందం కలకాలం నీవెంటే
జోలాలీ లాలీ జోలాలీ (2)
- తల్లిదండ్రులను గౌరవించి - తనవారినెల్లను ప్రేమించి
శత్రువులను సయితము క్షమించి - పరిచారకుడుగా జీవించి
దేవాదిదేవుడే అత్యంత దీనుడై
ఎంతో తగ్గించుకొని మాదిరి చూపించెను
ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం
ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం - జోలాలీ లాలీ జోలాలీ (2)
- దేవుని ఉపదేశమును మరువక-దయను సత్యమునెన్నడు విడువక
బుద్ది వివేచనకై వెదకిన - భయభక్తులు యేసునియందుంచిన
సుఖజీవము కలిగి ధరలో జీవింతువు
దేవుని దృష్టిలో నీవు కృప సంపాదింతువు
నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం
పరలోకం చేరేందుకు ఏకైకమార్గం - జోలాలీ లాలీ జోలాలీ (2)
Song no:
నీ కృప తప్ప నాకేమి లేదయ్యా నీకృప తప్ప నా కేమి లేదయ్యా కృపా నీవే ఆధారం కృపా నీవే ఆశ్రయం (2) (నీ కృప )
- అన్నీ వేళలా అన్నీ కాలాల్లో ఆదరించావు (2)
ఆదరించావు నన్ను అభిషేకించావు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
- కృంగిన వేళలో కృపను చూపావు(2) నను హత్తుకున్నావు నను ఎత్తుకున్నావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
- అందరు విడచినా అన్నీపోయినా(2)
అభిషేకం నాకిచ్చినావు అండగా నీవు నిలచినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)